Sunday, January 22, 2012

Nippu - Music Review

Casting:                     Ravi Teja, Deeksha Seth
Producer:                   YVS Chowdary
Director:                    Gunasekhar
Music:                        Thaman SS

Thaman is the real Businessman in recent times who is on Dookudu big time. Does this music album brings the real fire is what we have to see. Some one in Audio release said that Thaman will soon create Guinness record for music direction for maximum number of movies if he goes on the way he is doing right now. In audio release functions we hear many exaggerations like this, but the reality might be all different. He is far from reaching there, but quantity doesn't matter to be remembered only songs will make any music director to be remembered life long. I read somewhere that Thaman's songs will impact you as long as one is listening to them. Once the song is over, it is very hard. YVS chowday or Gunasekhar had their earlier films huge musical hits, whether its Okkadu or Devadas.. Whether this movie can be reach anywhere close to those albums lets see..

01.Vega Vega
Singers : Shankar Mahadevan
Lyrics: Chandrabose

Thaman attempts a breathless kind of song. Shankar Mahadevan has mastered this art. He is definitely an asset for this song. However నిప్పెవరంటే is pronounced as నిప్పవేరంటే. Cant help it. ఆషా instead of ఆశ doesn't get noticed in the speed of the song. Thaman added DJ kind of sound gimmicks in between didn't add any value to the song and didn't go well with the song flow. Not sure why none of Thaman's music doesn't appear fresh to me, reminds me many songs. Chorus in between also could have been added with some clarity(chorus says its fire burning it up???? - or something). Lyrics are decent. As song suggests this is the title song. But again I have major problem with tune and lyrics coordination. "వేగ వేగ వేసేయ్యర అడుగు" is the start of the song. But shankar sang it as "వేగ వేగ వే   సెయ్యర అడుగు". I know in the speed world not every one is interested what is the lyric, but people who love Telugu do care about it.  unless word is pronounced correctly, the song is just another sound.Any way its all Shankar Mahadevan's show. He does it with great ease and its a treat if one can ignore the above issues.

02.Nenaa Ninnu
Singers : Karthik , K.S.Chitra
Lyrics: Vanamali
Good start by Thaman. What singers can do to the song, this song will prove it. Karthik and Chitra elevate this song to a different level. A decent melody from Thaman. Interludes are cool.First time I guess in Thaman's career, he let the song go as it is. Just singers take of the job without his excess sound engineering techniques. Its very rare to get to hear Chitra now a days. Her expressions really gives a good feeling. This song remains one decent attempt in recent times for Thaman.

03.Ali Baba
Singers : Javed Ali
Lyrics: Viswa
Thaman is back on track. Thaman Baba, Thaman Baba its ok Baba. Javed Ali did exactly what is required for this song. A friendship song in Raviteja's movie mainly when title is Nippu? Viswa's lyrics has nothing to offer. This song has all fake accent all over it, which makes less listenable. If Thaman reminds happy days song chorus its not his fault.

04.Oye Pilla
Singers : Tippu , Harini
Lyrics: Rama Jhogayya Sastry

Typical Raviteja song, listening to this song we can easily imagine. However what Thaman is doing is a adaptation of tunes to make it into a new song. Tippu and Harini did their bit very well. The beats are foot tapping, Song goes on well except for lack of freshness. This song for itself is fine. Its heavy orchestration, its hard to listen few instruments. May be next time Thaman needs to concentrate on this.
05.Dooba Dooba
Singers : Thaman S
Lyrics: Bhaskarbatla
Thaman doesn't have anything to offer new in this song. He is as usual himself, Since he sings the song for himself and Its done for RaviTeja and remains with them only. Again Thaman needs to focus on how lyrics are said also, not just tune and presenting the song. His team should focus on getting things right. "తొలి తొలి ప్రేమ" appears as "తొల్లి తొలి" also చెప్పలేనే is sung as "చెపలేనే"  " శాపాలు" it is pronounced "సపాలు".

06.Dhiya Dhiya
Singers : Rahul Nambiar , Krishna Chaitanya , Geetha Madhuri , Deepu , Himabindhu , Sudha , Parnika
Lyrics: Ananth Sriram
So many singers? అంతా మహా మహా మాయ, మహత్తు నీవయ (తమన్) .. Truly as said in the song. Seems like this movie has 6 songs and 6 lyricist. Is this a new trend of equal opportunity employment? Ananth Sriram seems like focused on ప్రాస to match the tune. పట్టుకుంట కోక, పెట్టు కోవే కేక? Not sure whether tune is making lyricists difficult finding good words. Mojha, Hosanna( ali baba song) fascination is not getting away. All singers try to bring some energy to the song. This song is tailor made for this movie.

07.Slokam Nippu
Singers : Sravana Bargavi
Mahaganapatim manasa smaraami, bit in the song, How come its become slokam for Nippu? Sravana Bhargavi tried to bring in carnatic accent, but she should let have it to sing naturally as her self.

Pick(s) of the Album: Nena Ninnu, Vega Vega and Dhiya Dhiya

When some is going in a success path, whatever they do will be accepted, Once they go in failure mode, things will be magnified. Right now Thaman will be a case study for analysis in Telugu Film Industry as with just giving average( some times below average) music he is grabbing all the projects and people seems to be fine with whatever music he is giving.  The music of this movie is more than required for Ravi Teja movies. I would say it is better than his earlier movie Veera. How repetitive Thaman is, though there is no freshness in his music it doesn't appear to be a problem. His success story proves it.

Saturday, January 21, 2012

Poola Rangadu - Audio Review

Starring:      Sunil, Isha Chawla
Music:          Anoop Rubens
Director:      Veerabrahmam
Producer:    K Atchi Reddy

Comedian Sunil came up with third film as Hero. His first film as hero Andala Ramudu had no expectations on music or movie, but movie gave him decent success.  Then his earlier flick Maryada Ramanna had good music provided by Keeravani, since it was from Rajamouli. His latest offering "Poolarangadu" not sure any one will have any expectations, as people expect his movie offer comedy and his dancing treats. However Atchi reddy is a producer who was associated with SV Krishna Reddy gave some hit movies earlier. He roped in Anoop Rubens, who in his past has done 15-17 movies, but most of them went unnoticed. His debut film "Jai" with Director Teja thought he has some talent but after listening to this music, not sure where is he headed to.

01 -  Poola Rangadu
Benny Dayal,Nakash,Bhargavi,Lipsika
Lyrics: Ananth Sriram
Its not పూల రంగాడు, Its పూల  రంగడు. I really want to see how the song recording goes, Doesn't lyricist be present at the recording to see what singers are singing? I think after few days, the lyricist might think who wrote this song? I think I wrote a song for this movie, where is it??

Coming to the song, A peppy fast paced, catchy song with lots of high voltage in terms of orchestration, but Singers tried their maximum extent to bring energy to the song. Sunil will have all the ways to prove his dancing abilities. The song provides him a platform. Why music director has to play around with female voices I cannot understand. Too much shouting is not required to bring energy, but rap is ok..Singer had sung to the tune, doesn't care what he has sang. Ananth Sriram lyrics are so so.. 

02 -  Nuvvu Naku Kavali
Anup Rubens,Ranjith,Kousalya
Lyrics: Ramajogayya Sastry
Was Anoop told that this movie was for Ravi Teja, and later on it happened that Sunil has got into this movie? This song starts like Raviteja's song. Ramajogayya sastry makes this song to listen. Its all the way singers. Anoop didnt put any effort for additional Sound engineering effects, so this song doesnt get additional effects which one way helps this song. However, ఓ పిరి లో కోరిక " ఉన్న చోటే ఆగక, doesn't know what it means. 

03 -  Okkade Okkade
Raja Hassan,Noel,Lipsika
Lyrics: Kandikonda
If I wouldn't have seen the cover of this music album before I would have presumed that this song is composed by Thaman. Again if I just listen this song, I would have presumed it was for Ravi Teja movie. Not sure where the current Music directors are headed to? Absolutely they are killing Telugu in the name of variety. Raja Hassan if I am correct was a runner up in a Hindi Singing Competition Sa Re Ga Ma Pa.. Why in the world he is required for a Telugu song when are are hundreds of telugu singers waiting for a break? On the other hand Lipsika Bhashyam (if she is whom I am assuming) got an early break. This song doesnt offer anything other than some sound engineering experiments by Anup other than offering Sunil a great scope to show case his dancing abilities by the beats and pace in the song. Tune is not refreshing at all. He infused some folk elements but they are kind of leaves a feeling,  I heard this some where.

 
04 -  Nuvve Nuvvele
Karthik,Gayatri
Lyrics: Vanamali
ఆషవే in the start of the songs is a turn off, but so far better song in the album. Karthik infuses life to not only this song, but whole album. But the way the "నిన్ను పంపి నాడేమో" was sung, its complete fault of Anoop. Why he needs to add accent to the song that was going so well so far? If he wanted to match that line to the tune for words "Black and white" or some one mixed up the notes and Karthik sang it? A decent attempt but  execution has some issues. If not Karthik, this song?? . Vanamali gets full marks for the lyrics department for this movie.

05 -  Chocolate
Udit NArayan,Meenal Jain
Lyrics: Chandrabose
Udit Narayan, we all know he cannot do justice to Telugu song. What he will be singing neither he or we can understand. Chandrabose many times writes substandard lyrics. May be he is demanded to write them or that is his limited capability. గుండె గోకుతున్నవే Not sure I heard correctly. If I heard correctly, only Chandrabose will know why he wrote that. Only consistent in this music album is that they are mass oriented, fast paced, peppy beats and catchy phrases. Nothing refreshing tunes, just what is required for Sunil to Perform, The focus is only that nothing else.

06 -  Okkade Okkade (Rubens Club Mix) Download
Raja Hassan,Lipsika
This is a mix of the okkade okkade song... Nothing to say about it..

Overall its an album to meet the requirements of Sunil. This doesn't have anything to offer for music lovers. It doesn't have any thing for repeated hearing as well. Who ever will be interested is Sunil's fans and who want fast numbers, doesn't care about anything else other than some catchy, fast paced tunes. Sunil might add value to this songs by his performance in the movie, what he does will have to wait and see..

Pick(s) of the album: Nuvvele Nuvvele, Nuvvu Naaku kaavali.

Thursday, January 19, 2012

Song of the week - Aakasam Digivachi

 Song of the week - ఆకాశం దిగివచ్చి

ముందు మాట : Instead of posting same matter every time, providing the link to one of the earlier posts. ( What inspired me to write this series)

Movie Name:              నువ్వు నాకు నచ్చావ్
Producer:                   స్రవంతి  రవి  కిషోర్
Director:                    విజయభాస్కర్ 

Music Director:           కోటి
Singer:                      S.P. బాలసుబ్రహ్మణ్యం
Lyrics:                       సిరివెన్నెల సీతారామ శాస్త్రి
Year of Release:         2001


 ఆకాశం దిగివచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి
ఊరంతా చెప్పుకునే ముచ్చటగా జరగాలి పెళ్ళంటే మరి
చెరిసగమవమని మనసులు కలుపుతూ తెర తెరిచిన తరుణం
ఇది వరకెరగని వరసలు కలుపుతు మురిసిన బంధుజనం
మా ఇల్ల లేత మావిళ్ళ తోరణాలన్ని పెళ్లి శుభలేఖలే 
అక్షింతలేసి ఆశీర్వదించమను  పిలుపులైనవి గాలులే ||ఆకాశం దిగివచ్చి||
చరణం 1
చంపలో విరబూసే అమ్మాయి  సిగ్గు దొంతరలు 
ఆ సొంపులకు  ఎరవేసే అబ్బాయి  చూపు తొందరలు 
ఏ వరాలో ఈ జవరాలై జతపడు సమయంలో ..
వానవిల్లే వధువుగ మారి ఒదిగిన వేడుకలో 
తన  సరసను  విరిసిన  సిరిసిరి  సొగసుల  కులుకల  కలువకు  కానుకగా 
ఎద  సరసున  ఎగసిన  అలజడి  అలలే  తాకగా ||ఆకాశం దిగివచ్చి||
చరణం 2
విన్నవారెవరసలు సన్నాయి వారి సంగతులు 
సన్న సన్నగా రుసరుసలు వియ్యాలవారి విసవిసలు 
సందు చూసి చక చక ఆడే జూద శిఖామణులూ....
పందిరంతా ఘుమ ఘుమలాడే విందు సువాసనలూ
తమ నిగనిగ నగలను పదుగురు ఎదురుగ ఇదిగిదిగో అని చూపెడుతూ 
తెగ తిరిగే తరుణుల తికమక పరుగులు చూడగా ||ఆకాశం దిగివచ్చి||
సినిమా గురించి కొన్ని మాటలు:

ఎన్ని సార్లు చూసిన అస్సలు బోర్ కొట్టని సినిమాలలో "నువ్వు నాకు నచ్చావ్" ఒకటి. దానికి కారణం సరళమైన కథ, చక్కని ఆరోగ్యకరమైన హాస్యం, "One Line Punches" తో ఆద్యంతం ఆకట్టుకుంటాయి. కొన్ని సన్నివేశాలు ఎన్ని సార్లు చూసిన నవ్వు తెప్పిస్తాయి. ఆ పాత్రలు వేసిన వాళ్ళు అంతటి నవ్వు తెప్పిస్తారు. త్రివిక్రమ్ మాటలు రాయటం లోని నైపుణ్యం, అతని ప్రతిభ ఈ సినిమా లో కనిపిస్తుంది. జంధ్యాల గారి తరువాత ఆయనంత కాకపోయినా కొంతలో కొంత మంచి సంభాషణలు అందించగలిగిన వారిలో ఒకరు. వెంకటేష్ చక్కగా తన పాత్ర లో వొదిగి పోయి నటించిన సినిమాలలో ఇది ఒకటి.

పాట సందర్భం:
హీరో తండ్రి వ్యవసాయం చేస్తూ ఉంటాడు. గాలికి తిరిగే తన కొడుకుని ఉద్యోగానికి సహాయం కోసం తన స్నేహితుడి దగ్గరకు పంపుతాడు. అక్కడ తండ్రి స్నేహితుని ఇంట్లో ఉంటూ కాలక్షేపం చేస్తూ ఉంటాడు. వాళ్ళ అవుట్ హౌస్ లో ఉంటున్న అతను ఒకసారి ఏదో పని మీద వాళ్ళింటికి వెళ్తాడు. అక్కడ అందరు చాల సీరియస్ గా హీరోయిన్ పెళ్లి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. హీరోయిన్ బాబాయ్ పెళ్లి పనులు మనం ఏమి చెయ్యక్కర్లేదు మ్యారేజ్ కాంట్రాక్టర్స్ కి ఇచ్చేస్తే అన్ని వాళ్లే చూసుకుంటారు, మనం కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని పెళ్లి చూసి అక్షంతలు వెయ్యటమే అంటాడు. అందరి అభిప్రాయాలూ తీసుకుంటూ హీరో ని అడిగితె అతని నుంచి మెచ్చుకోలు ఎదురు చూసిన బాబాయ్ కి చుక్కెదురు అవుతుంది. వాళ్ళ మధ్య జరిగే సంభాషణ సినిమాలో చూడాల్సిందే. అప్పుడు చివరికి బాబాయ్ హీరో ని పందిరి ఎలా ఉండాలి అని అడిగితె, హీరో పాట మొదలెడతాడు.

తెలుగు వారింట పెళ్లి అంటే అదో చెప్పరాని అనుభూతి. అందులో శాస్త్రోక్తం గా చేసే పెళ్లి చూడాల్సిందే. అది తెలియని వాళ్ళకి చెప్పటం అనేది కత్తి మీద సాము వంటిదే. ఎందుకంటే అది వివరించటానికి పెళ్లి లో జరిగే తంతులు ఒకటా రెండా, కోకొల్లలు. ఆ సరదాలు సంగతులు వేలకు వేలు. కాని ఏ సందర్భం అయిన అవలీలగా పాట రాసెయ్య గలిగిన సీతారామ శాస్త్రి గారికి ఒక లెక్ఖ?, ఈ పాట వింటే పెళ్లి అవని వాళ్ళకి ఆ అనుభవం కావాలని, అయిన వాళ్ళకి వాళ్ళ పెళ్లి నాటి ముచ్చట్లు గుర్తుకు రాక మానవు.

మంచి సాహిత్యానికి మంచి ట్యూన్ దానంతట అదే వస్తుందేమో, కోటి సమకూర్చిన రాగం, బాలు గారు పాడిన వైనం ఎన్ని సార్లైనా మరల మరల వినాలనిపించేలా చేస్తుంది. అసలు ఈ పాత ప్రతి పెళ్లి లోను వినపడేలాగా చిరాయువు కలిగింది. అదే ఈ పాట ప్రత్యేకత. బాలు గారి గొంతులోంచి ఈ పాట వింటే ఊహ లోకం లో విహరించి పాట అయిపోతే తిరిగి రావటం చాల కష్టం అవుతుంది. అటువంటి అనుభూతి మిగిల్చిన కోటి గారు , బాలు గారు, సీతారామశాస్త్రి గారు అందరికి శత "కోటి" వందనాలు.

పాట ప్రారంభం:

 ఆకాశం దిగివచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి
ఊరంతా చెప్పుకునే ముచ్చటగా జరగాలి పెళ్ళంటే మరి

ఆకాశం అంత పందిరి భూదేవి అంత అరుగు అనటం అందరికి తెలుసు, కాని అలా అంటే సీతారామ శాస్త్రి గారెందుకు అవుతారు. మన కోసం ఆకాశంనే తీసుకు వస్తారు. అసలు అంత పెద్ద పందిరి, అంత అరుగు ఎందుకు అంటే, తెలుగు వాళ్ళ పెళ్లి అంటే అందరి సాక్షిగా జరుగుతుంది, మనకి ఎంత మంది తెలిస్తే అంత మందిని పిలిచి చేసే తతంగం. అందులో ప్రతి వాళ్ళకి పెళ్లి రోజు జీవితాంతం గుర్తుండే లాగ జరిగే ఒకే ఒక రోజు, ఒక జ్ఞాపకం. అందరి ఆశీర్వాదం తీసుకోవటం మన వాళ్ళ ప్రత్యేకత.. వధు వరులని ఆశీర్వదించటానికి వచ్చిన వాళ్ళకి మరి ఆకాశం అంత పందిరి, వెయ్యాల్సిందే. కాని పందిరి ఎలా ఉండాలి అంటే, ఆకాశం దిగి వచ్చి మబ్బులే పందిరి అవ్వాలనే సుందరమైన భావన. అలాగే అందరు చెప్పుకునేవి ముచ్చట్లు అన్నారు కాని పెళ్లి ఘనం గా జరిగింది అనలేదు సీతారామశాస్త్రి గారు. మనం పెళ్లి లో కలివిడి గా ఉంటేనే ముచట్లు ఉంటాయి. ఆ విధం గా అందరు చేసి చెప్పుకునేటట్లు ఉండాలనేదే అందరు కోరుకునేది. ఎంత అందమైన వివరణ??

చెరిసగమవమని మనసులు కలుపుతూ తెర తెరిచిన తరుణం
ఇది వరకెరగని వరసలు కలుపుతు మురిసిన బంధుజనం
మా ఇల్ల లేత మావిళ్ళ తోరణాలన్ని పెళ్లి శుభలేఖలే 
అక్షింతలేసి ఆశీర్వదించమను  పిలుపులైనవి గాలులే
ఈ పదాల అల్లిక, వాటి కలయిక అమోఘం. ఆ పద ప్రవాహం అపురూపం. పెళ్లి అంటే ఏంటి అనేది ఇంతకన్నా అందమైన వర్ణన ఉంటుందా?? రెండు గా ఉన్న మనసులు, చెరో సగమై ఒక మనస్సై కలవమని వదు వరుల మధ్య తెర జీలకర్ర బెల్లం పెట్టిన తరువాత తీసేస్తారు, అంటే ఆ సమయం ఇద్దరు ఒకరిలో ఒకరు అయ్యే సమయం అదే పెళ్లి సమయం. ఈ పెళ్లి లో సాధారణం గా మనకి తెలియని భంధువులు కలుస్తారు, కొత్త కొత్త పరిచయాలు అవుతాయి, ఆ ఆనంద సమయం లో జరిగే హడావిడి అంతా ఇంతా కాదు అటువంటి సమయం ఎటు వంటిదంటే, అటు ఇటు తిరుగుతూ అందరు హడావిడి గా ఉంటారు. అటువంటి పెళ్లి కి పిలుపులు ఎలా ఉండాలో వివరిస్తారు వినూత్నం గా సీతారామ శాస్త్రి గారు. ఇంటికి మావిడి ఆకు తోరణాలు కట్టామంటే ఆ ఇంట్లో జరిగేది శుభ కార్యమే, మామూలు తోరణాలు కాదు లేత మావిడాకు తోరణాలు. అవి కట్టమంటే అందరికి తెలుస్తుంది, ఆ తెలియటమే శుభలేఖ. మా లేత ఆకులనుంచి వచ్చే సుగంధం గాలి లో ప్రయాణం చేసి అందరిని పలుకరిస్తుంది ఆ దారిన పోయే వాళ్ళకు ఆ చుట్టుపక్కల వాళ్ళకు, ఇంకేముంది శుభ కార్యం వచ్చి ఆశీర్వదించి అక్షింతలు వెయ్యండి అని.. ఇంత సరళమైన పదాలతో విన్యాసాలు చెయ్యటం ఆయనకే సొంతమైన విద్య.

చంపలో విరబూసే అమ్మాయి  సిగ్గు దొంతరలు 
ఆ సొంపులకు  ఎరవేసే అబ్బాయి  చూపు తొందరలు 
ఏ వరాలో ఈ జవరాలై జతపడు సమయంలో ..
వానవిల్లే వధువుగ మారి ఒదిగిన వేడుకలో 
తన  సరసను  విరిసిన  సిరిసిరి  సొగసుల  కులుకల  కలువకు  కానుకగా 
ఎద  సరసున  ఎగసిన  అలజడి  అలలే  తాకగా

అద్బుతమైన పద గారడీ చేస్తారు సిరివెన్నెల. పెళ్లి కూతురు పడే యాతన , పెళ్లి కొడుకు పడే తపన వివరిస్తారు. పెళ్లి అనగానే సిగ్గు పడే అమ్మాయి, ఆ అమ్మాయి కోసం నానా పాట్లు పడే అబ్బాయి, ఏ పెళ్లి తెర చాటున అయిన జరిగే కథ ఇది. ఎన్నో పూజలు చేసుకుంటే కాని ఇలాంటి మంచి అమ్మాయి దొరకదు అని వింటూ ఉంటాం. పూజ చేస్తే వచ్చే వరాలతో వచ్చిన ఈ అమ్మాయి, అత్యంత మనోహరమైన ఇంద్ర ధనుస్సు లాంటి అమ్మాయి వధువు గా మారి పెళ్లి పందిరి లో ఒదిగి తెర చాటున కూర్చుంటే పెళ్లి అత్యంత కమనీయం గా జరుగుతున్న శుభ ముహూర్తాన, ఆ సమయం ఎలాంటిదంటే, తన పక్కనే కులుకలతో కూర్చున్నకాలువకి కానుక ఏమి ఇవ్వటం?  తన మనసు లో ఉవ్వెత్తున ఎగసే అలజడి తప్ప? ఆ పదాలు అలా అల్లుకు పోతుంటే ఒక స్వప్న లోకం లో విహరిస్తున్నట్టు ఉంటుంది.

విన్నవారెవరసలు సన్నాయి వారి సంగతులు 
సన్న సన్నగా రుసరుసలు వియ్యాలవారి విసవిసలు 
సందు చూసి చక చక ఆడే జూద శిఖామణులూ....
పందిరంతా ఘుమ ఘుమలాడే విందు సువాసనలూ
తమ నిగనిగ నగలను పదుగురు ఎదురుగ ఇదిగిదిగో అని చూపెడుతూ 
తెగ తిరిగే తరుణుల తికమక పరుగులు చూడగా ||ఆకాశం దిగివచ్చి||
మనం సాధారణం గా పెళ్ళిళ్ళలో ఎవరు పట్టించుకోని వాళ్ళు సనాయి వాళ్ళు వాళ్ళని చూస్తూనే ఉంటాము, వాళ్ళు ఒక మూలన కూర్చొని ఏదో వాయిస్తారు కానీ వారి సంగతి పట్టించుకునే నాథుడే ఉండడు. వారు ఏమి వాయిస్తున్నారో వినేవాళ్ళు ఉండరు. ఎందుకంటే ఎవరి పనులలో వారు ఉంటారు ఎవరి గొడవలలో వాళ్ళు ఉంటారు  కాని సీతారామశాస్త్రి గారు అస్సలు ఎవర్ని అల వదిలేయరు. అందుకనే అంటారు, సన్నాయి మేళం వారిని వినేవారు ఎవరు ఉన్నారు పెళ్లి లో? అది కూడా ఎందుకంటే వియ్యాల వాళ్ళు ఏదో ఒక కారణంతో కోపంతో విస విస లాడుతూ ఉంటారు. ఇంకో పక్క మగవాళ్ళ లో చాల మంది పేక ఆటతో ఎక్కడో ఒక చోట సర్దుకు పోయి ఉంటారు. ఇంకా మిగిలింది వంటసాల, అక్కడ పెళ్లి భోజనాలతో సువాసనలతో సందడి సందడి గా ఉంటుంది. ఇంకా ఆడవారు డ్రెస్ గురించో, లేక నగల గురించో ఇదిగో చూసారా అంటూ తమ గొప్పతనం అందరికి చూపించటానికి హడావిడి గా తిరుగుతూ జరుగుతున్న సందడి గా ఉన్న పెళ్లి ఆకాశం తన మబ్బులతో దిగి వచ్చి పందిరి వెయ్యదా??

అప్పుడు బాలు గారు "చూడగా" అంటూ మరల పల్లవి లోకి వచ్చి పాట ముగిస్తే అప్పుడే అయిపోయిందా, ఈ పాటకి ఇంకో చరణం ఎందుకు రాయలేదా అనిపించటం ఖాయం విన్న నా లాంటి వాళ్ళకి. ఎందుకు ఇంకో చరణం పెట్టలేదో ఆ దర్శక నిర్మాతలకే తెలియాలి.. సీతారామశాస్త్రి గారైతే ఇంకో నాలుగు చరణాలు రాసెయ్య మన్న రాసేస్తారు, మరి పెళ్లి తతంగం ఇంతేనా ఇంకా చాల ఉంది గా, ఇక శాస్ర్తి గారు ఎంత రాస్తే అంత కోటి గారు రాగం కట్టేస్తారు,  బాలు గారు పాడేస్తారు, మనము వినేస్తాము.............

కొసమెరుపు:
ఈ పాట చిత్రీకరణ చాల వినోదం గా సందడి గా సాగుతుంది. అసలు ఈ పాట ఏ సినిమాలో అయిన సందర్భం సరిపోతుంది, కాని పాట వల్ల సినిమాకి చిరాయువు వచ్చింది, సినిమా చూడని వాళ్ళు పాట వింటే, సినిమా చూస్తె అది ఎలాగో నచ్చుతుంది కాబట్టి. ఈ సినిమా లో పెళ్లి ని ఒక వివిధమైన వివరణ ఇస్తూ కథ రాసారు సినిమా తీసారు, వాళ్ళు ఏది చేసిన మనకి ఒక అద్బుతమైన పాట ఇచ్చారు. అంటే చాలు.

Monday, January 9, 2012

song of the week - Aadi Bikshuvu

Song of the Week -  ఆది భిక్షువు వాడినేది కోరేది 

ముందు మాట : Instead of posting same matter every time, providing the link to one of the earlier posts. ( What inspired me to write this series)

Movie Name:              Siri Vennela
Producer:                   Geethakrishna Movie Creations
Director:                    K. Viswanath
Music Director:           K.V. Mahadevan/ Pugazhendi.
Singer:                      S.P. Balasubrahmanyam
Lyrics:                       Seetarama Sastry
Year of Release:         1987
ఆది భిక్షువు వాడినేది కోరేది
బూడిదిచ్చేవాడినేది అడిగేది
ఏది కోరేది వాడినేది అడిగేది
ఏది కోరేది వాడినేది అడిగేది
తీపి రాగాల ఆ కోకిలమ్మకు నల్లరంగునలమినవాడినేది కోరేది
కరకు గర్జనల మేఘముల మేనికి మెరుపు హంగుకూర్చినవాడినేది అడిగేది
ఏది కోరేది వాడినేది అడిగేది
తేనెలొలికే పూలబాలలకు మూణ్ణాళ్ళ ఆయువిచ్చినవాడినేది కోరేది
బండరాళ్ళను చిరాయువుగ జీవించమని ఆనతిచ్చినవాడినేది అడిగేది
ఏది కోరేది వాడినేది అడిగేది
గిరిబాలతో తనకు కళ్యాణమొనరింప దరిజేరుమన్మధుని మసిచేసినాడు ... వాడినేది కోరేది
వరగర్వమున మూడు లోకాల పీడింప తలపోయుదనుజులను కరుణించినాడు... వాడినేది అడిగేది
ముఖప్రీతి కోరేటి ఉబ్బు శంకరుడు... వాడినేది కోరేది
ముక్కంటి ముక్కోపి... ముక్కంటి ముక్కోపి తిక్కశంకరుడు  || ఆది భిక్షువు ||

ఈ పాట శివ భక్తుడైన సీతారామ శాస్త్రి గారు, తనకు అత్యంత ప్రీతి పాత్రుడైన శివుని మీద రాసిన నిందా స్తుతి. ( వ్యాజ స్తుతి)  అంటే తిడుతూనే పొగడటం అనిపిస్తుంది. లేదా స్తుతించటం కూడా negativeగా అనిపిస్తుంది. ఎంతైనా భగవంతుని మీద భక్తునికి సర్వాధికారాలు ఉంటాయి. భక్తుడికే దేవుణ్ణి తిట్టే అధికారం పొగడుకునే అధికారం అన్ని ఉంటాయి. వాళ్ళ బంధం అటువంటిది, అనుబంధం అటువంటిది.


KV మహదేవన్ గారు/పుహళేంది గారు మన తెలుగు వాళ్ళకి లభించిన గొప్ప వరం. తెలుగు భాష వాళ్ళు కాక పోయినా తెలుగు పాటకి ఎంతటి న్యాయం చేకుర్చాలో అంతంటి న్యాయం చేకూర్చిన మహానుభావులు. ఇంకా SP బాలసుబ్రహ్మణ్యం గారిని ఏమని పొగిడితే సరిపోతుంది? ఈ పాట ఎన్ని సార్లు విన్న తనివితీరని పదవిన్యాసం సీతారామ శాస్త్రి గారిదైతే, దానికి పరిమళం అద్దిన మహదేవన్ జంట, ఆ పాటని తన మధుర గానామృతంతో మనల్ని ఎక్కడికో తీసుకెళ్ళి సాక్షాత్తు శివ సాక్షాత్కారం కలిగింప చేసిన ఆ మధుర గాయకుని గళానికి తెలుగు వాళ్ళు ఏమి ఇచ్చి ఋణం తీర్చుకోగలరు? కళ్ళు మూసుకొని ఈ పాట వింటే కలిగే అనుభూతి వర్ణనాతీతం. ఆ అనుభూతి కలుగచేసిన అందరు ధన్యులే.

పాటకి ముందు వచ్చే scenes
ఒక కళ్ళు లేని అద్బుతమైన కళాకారుని జీవిత కథ ఈ "సిరివెన్నెల" సినిమా. ఆ కళాకారుడు గాయకుడు, వేణు విద్వాంసుడు. తనకు సహజం గా వచ్చిన ఈ కళలతో అందరిని అలరిస్తు వచ్చిన డబ్బులతో  గడిపేస్తున్న "హరి ప్రసాద్" జీవితం లోకి అనుకోకుండా ఇద్దరు వనితలు ప్రవేశించి, ఆ జీవితాన్ని సిరివెన్నెల తో ఎలా నింపుతారో, కథ ఎన్ని మలపులు తిరిగి చివరికి అతని జీవితం ఏమి అవుతుందో అనేది ఈ సినిమా. ఈ సినిమాలో హరి కి కన్నులు ఉండవు, అతను కోరింది జ్యోతినే, అంటే కళ్ళు లేని అతను కోరుకునేది వెలుగునే, అంటే కళ్ళే, చివరికి ఆ జ్యోతి అతనికి వెలుగు ప్రసాదించి ఈ లోకంలోంచి నిష్క్రమిస్తుంది. పాత్రలకి పేరు పెట్టటం లో కూడా విశ్వనాధ్ గారి సూక్ష్మ ఆలోచన చాల తక్కువ మంది దర్శకుల్లో చూస్తాం.

హరి జీవితాన్ని మార్చిన జ్యోతి అంటే అతనికి ఎంతో గౌరవం. ఆ గౌరవం, అభిమానం గా మారి ఆ తరువాత  ఆరాధన గా మారి చివరికి ప్రేమగా మారుతుంది. ఆమెని పెళ్లి చేసుకోవాలని కూడా అనుకుంటాడు. కాని ఆమె ఎక్కడికో ఎవరికీ తెలియకుండా తిరుగుతూ ఉంటుంది. ఎక్కడ ఉందొ కూడా హరికి తెలియదు. ఈలోగా హరి ఒక ఊరికి వెళ్తూ ఉండగా సుభాషిని అనే మూగ అమ్మాయి పరిచయం అవుతుంది. సుభాషిని మంచి చిత్రకారిణి, అలాగే శిల్పాలు కూడా చక్కగా చెక్కుతుంది. ఆ పరిచయం పెరిగి, ఆమె హరిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంది. జ్యోతి విషయం తెలియని ఆమె తన అన్న ద్వార హరికి ప్రేమ వ్యవహారం తెలియచేయమంటుంది. అప్పుడు హరి మనసులో ఉన్న అసలు విషయం తెలుసుకొని, హరిని, జ్యోతి ని కలపాలని దేవుడిని ప్రార్ధించటానికి దగ్గరలో ఉన్న శివాలయానికి తీసుకుని వెళ్తుంది హరిని..

పాట సందర్భం
శివాలయానికి వెళ్లి జ్యోతి పూజారి గారితో హరికి జ్యోతి తో పెళ్లి జరిగేలాగా పూజ చెయ్యమని కోరుతుంది. కాని అది సరిగ్గా అర్థం కాక సుభాషినికి, హరికి పెళ్లి జరిగేల పూజ ప్రారంబిస్తాడు ఆ పూజారి. సుభాషిణి తన మూగ భాషతో సైగలతో, మొత్తానికి తన మనసులో ఉన్న భావం హరికి తెలియచేయగలగుతుంది. తనకి జ్యోతికి పెళ్లి చెయ్యమని నేను ఇప్పుడు శివుని వేడుకోవాల అని, పాట పాడటం మొదలు పెడతాడు.

పాట ప్రారంభం 
ఆది భిక్షువు వాడినేది కోరేది,  బూడిదిచ్చేవాడినేది అడిగేది, ఏది కోరేది వాడినేది అడిగేది
శివుడు ఆది భిక్షువు, అన్ని వదిలేసి నిర్వికారుడుగా, నిర్వ్యమోహుడు గా ఎప్పుడు తప్పస్సు చేసుకునే దేవుడు. సృష్టి స్థితి లయకారకులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరుడి లో శివునికి ఆది భిక్షువు అని పేరు. ఎందుకంటే శివుడు కాలభైరవుడు. కాలభైరవుడు నరికిన బ్రహ్మ యొక్క ఐదో తల పుర్రె తో భిక్ష మెత్తుకొని తిరుగుతూ ఉంటాడు. భిక్షమెత్తుకొనే వాళ్ళలో మొదటి వాడైన  అట్లాంటి భిక్షకుని దగ్గర మన కోరికలు ఏమి అడుగుతాము?  శివరూపం సాధారణం గా చూస్తె ఆ రూపం తో ఉన్న వాళ్ళు మనకోరికలు తీరుస్తారు అనుకోము కదా, ఒళ్ళంతా బూడిద రాసుకొని, పాము మెడకు చుట్టుకొని, స్మశానం లో నివసించే శివుని అడిగితే బూడిద తప్ప ఏమి రాలుతుంది? అంటే ఆ శరీరం నుంచి రాలేదు బూడిదే కదా, ఆ బూదిదనిచ్చే వాడినేది కోరేది? ఇది అయన రాసుకున్న పాటైన సినిమా లో ఎంత అద్బుతం గా సరిపోయింది అంటే, హరి తన జీవితంలో చీకటి నింపిన దేవుడు అంటే నిరసనే. అందుకనే మనం వెళ్తున్నది శివ ఆలయమా, మనం శివున్ని అడగాల అని ప్రతి సారి అంటాడు.

తీపి రాగాల ఆ కోకిలమ్మకు నల్లరంగునలమినవాడినేది కోరేది
కరకు గర్జనల మేఘముల మేనికి మెరుపు హంగుకూర్చినవాడినేది అడిగేది ఏది కోరేది వాడినేది అడిగేది
శివుడు సృష్టికి కారకుడు కాకపోయినా శివ భక్తులకి శివుడే సర్వస్వం. అందుకనే ఈ లోకం లో ఏది జరిగిన, దానికి కారకుడు శివుడే, ఇక్కడ సృష్టి లో లోపాలను చెప్పి ఇలాంటి తప్పులను చేసిన వాడిని ఏమి కోరగలం మనం అనే నింద కనిపిస్తుంది. నలుపు మానవుకి నప్పని, ఇష్టపడని రంగు. అది చీకటిని, భయాన్ని తెలియచేస్తుంది కనుక. అంతే కాక అది కంటికి ఇంపుగా ఉండదు కూడా. తీయగా పాడే కోకిలమ్మ కు నలుపు రంగు ప్రసాదించిన ఆ దేవుడినా నేను కోరేది? ఇక్కడ తీయటి గొంతునిచ్చి, సుందర రూపం కూడా ఇస్తే చాల బాగుండేది కదా, అటు చూడటానికి, ఇటు వినటానికి అందంగా ఉండేది,. చక్కటి గొంతునిచ్చి, రూపం సరిగ్గా ఇవ్వకుండా అన్యాయం చేసిన దేవుడిని ఏమి కోరేది?

అట్లాగే మేఘాలు చేసే శబ్దాలు భయాన్నిస్తాయి, వినసొంపు గా ఉండక భయపెడ్తాయి. మేఘ గర్జన రాత్రి కనుక వస్తే ఆ ఘర్జన ఇంకా భయంకరంగా ఉంటుంది. అటువంటి భయంకరమైన శబ్దాన్ని ఇచ్చే మేఘాల మధ్య జరిగే ఘర్షణకి  అందమైన మెరుపుని కూర్చిన వాడిని ఏమి కోరేది? ఏది సరిగ్గా చెయ్యడం రాదు ఇంకేమి అడుగుతాం? దేవుడి లీలలు సాధారణంగా అర్థం కానివి, సృష్టి రహస్యాలు అంతకన్నా అంతుపట్టనిది. కాని మానవుడు తన ప్రయత్నం తను చేస్తూనే ఉంటాడు అవి తెల్సుకోవటానికి. సీతారామ శాస్త్రి గారి భావ శక్తికి, పద సౌందర్యానికి అందరం దాసోహం కాక తప్పదు. అలాగే బ్రహ్మాండమైన జ్ఞానం, తత్త్వం, వేదాంతం కలిగి ఉన్న, సరళమైన పదాలతో లోతైన భావాల్ని తెలియచేయ గలగటం ఆయనకే సాధ్యమైంది.

తేనెలొలికే పూలబాలలకు మూణ్ణాళ్ళ ఆయువిచ్చినవాడినేది కోరేది

బండరాళ్ళను చిరాయువుగ జీవించమని ఆనతిచ్చినవాడినేది అడిగేది ఏది కోరేది వాడినేది అడిగేది
ఇక్కడ కూడా అదే నింద కొనసాగుతుంది, పూలు ఎంతో రమణీయంగా ఉంటాయి, చూడటానికి ఆహ్లాదంగా ఉండి తన నిండ తేనే రూపం లో తియ్యదనం నింపుకున్న పూలకి తక్కువ ఆయుష్షు నిచ్చిన దేవుడిని ఏమి కోరేది? వెయ్యటానికి చిన్న ప్రశ్నఅయిన చాల ఆలోచింప చేసే ప్రశ్న ఇది. సృష్టినే ప్రశ్నించే ప్రశ్న. పూలు, పళ్ళు, ఆకులు వీటన్నిటికి ఆయుష్షు తక్కువే. అలాగే ఈ సృష్టి లో మనకి నచ్చేవాటి జీవిత కాలం చాల తక్కువ. కాని రాళ్ళు రప్పలు లాంటి ఎక్కువ పనికి రాని, చూడటానికి అందం లేని వాటికి కలకాలం ఉండేలాగా సృష్టించిన వాడినేమి అడుగుతాం?  నాకు ఇది కావలి దేవా అని? చలనం లేక పడి ఉండే బండరాయికి జీవం ఉండదు, కాని ఆయుషు ఉంటే ప్రాణం లేకపోయినా జీవిన్చినట్టే. అటువంటి రాయికి మటుకు కలకాలం ఉండేలాగా ఆజ్ఞ ఇచ్చిన దేవుడిన మన ఇది కావలి అని అడిగేది?

గిరిబాలతో తనకు కళ్యాణమొనరింప దరిజేరుమన్మధుని మసిచేసినాడు ... వాడినేది కోరేది
వరగర్వమున మూడు లోకాల పీడింప తలపోయుదనుజులను కరుణించినాడు... వాడినేది అడిగేది
గిరిజ అంతే పార్వతి. శివ పార్వతులని కలుపటానికి ప్రయత్నించిన మన్మధుడు ని మూడో కంటి తో భస్మం చేస్తాడు. ఇక్కడ కళ్యాణం ఎందుకన్నారో, ఆ కథ మనకి తెలియాలి. తారకాసురుడు శివుని కుమారుడి తో తప్ప చావు లేకుండా వరం పొంది ఆ వర గర్వముతో అందరిని హింసిస్తూ ఉంటాడు. తారకాసురినికి తెలుసు శివుడు అప్పటికి బ్రహ్మచారి, శివుడు విరాగి, ఇంక శివుడికి కుమారుడు కలుగడు అని. కానీ అతని కృత్యాలు మితి మీరితే, అందరు సతి దేవిని కోరితే, పార్వతి గా గిరి రాజైన హిమవంతుడి కుమార్తె గా పుట్టి, శివుని కోసం తపస్సు చేస్తుంది(అందుకే గిరి బాల అంటారు పాటలో ). కానీ శివుడు తన ధ్యానంలో తానూ మునిగి ఉంటాడు. శివుడిని పార్వతి పట్ల ఆకర్షించేది ఎట్లా? ఆ చిక్కుముడి విప్పటానికి విష్ణు కుమారుడైన మన్మధునికి ఆ పని అప్పచేప్తాడు ఇంద్రుడు. మన్మధుడు శివ దీక్షను భగ్నం చేసి పార్వతి మీద మనసు పడేలాగా మన్మధ బాణాలు వేస్తాడు, శివుని దీక్ష భగ్న అవుతుంది కాని శివునికి కోపం వచ్చి మూడో కన్ను తెరిస్తే మన్మధుడు బూడిద అవుతాడు. అప్పుడు శివుడు పార్వతిని చూసి పెళ్లి చేసుకొని కుమారుడుని కంటాడు. ఆ కుమారుడే కుమారస్వామి(కార్తికేయుడు, సుబ్రహ్మణ్య స్వామి). అతను తారకాసురిని చంపి అందరికి శాంతి చేస్తాడు.  ఇంత మంచి పని చెయ్యతలపెట్టిన మన్మధుడిని మసి చేసిన వాడినేమి కోరను తనకు తన జ్యోతిని ఇమ్మని? అంత పెద్ద కథని ఒక వాఖ్యం లో రాసేసారు సీతారామ శాస్త్రి గారు.

"దను" కుమారులు దానవులు కూడా వర గర్వము వలన ముల్లోకాలను పీడిస్తున్న వాళ్ళు అయిన వాళ్ళకి వరాలిచేస్తాడు. అంటే మంచి చేసిన వాళ్ళకు చెడు, చెడు చేసిన వాళ్ళకు మంచి చేస్తున్న దేవుడిని ఏమి కోరేది? 

ముఖప్రీతి కోరేటి ఉబ్బు శంకరుడు... వాడినేది కోరేది
ముక్కంటి ముక్కోపి... ముక్కంటి ముక్కోపి తిక్కశంకరుడు
ఇంక శివ నింద పరాకాష్ట కి చేరుతుంది, ఊరికే పొగడితే పొంగి పోయే దేవుడు శివుడు. శివ స్తుతి, తపస్సు చేస్తే వరాలిచ్చేసి అందరికి ఇబ్బంది కలుగ చేసినట్లుగా శివుని కథలు చాలానే ఉన్నాయి మనకి. వినాయక చరిత్ర గూడ అదే కదా. ముఖ ప్రీతికే  ఊరికే పొంగిపోయే దేవుడుని ఏమి ఆలోచించ కుండానే వరాలిచ్చే దేవుడిని ఏమి కోరేది? శివుని కోపం గూర్చి అందరికి తెల్సిందే, ఊరికే కోపం వచ్చే దేవుళ్ళలో మొదట ఉండే దేవుడు శివుడే. అలాగే మూడు కళ్ళు ఉన్నది కూడా శివుడే. ఎప్పుడు పొంగి పోతాడో, ఎప్పుడు ఉబ్బి తబ్బిబ్బు అయి వరాలిస్తాడో ఎవరికీ అర్థం కాదు, అందుకే శివుడిని తిక్క శంకరుడు అని ముగిస్తారు సిరివెన్నెల. శివుడు మూడో కంటిని పార్వతి కారణం గా రెండు సార్లు తెరుస్తాడు. ఒకటి మన్మధుడి మీద కోపం తో భస్మం చేస్తాడు, ఇంకోసారి దక్ష యజ్ఞం లో జరిగిన అవమానానికి. కానీ శివుడు మూడో కన్ను తెరిచేది యుగాన్ని అంతం  చెయ్యటానికే.

ఇన్ని లోపాలున్న శివుడిని ఏమి కోరతాము అన్న పాటని సందర్భానుసారం గా వాడుకుని, ఆ పాట వాడటం కోసం, సినిమా లో పాత్రల్ని, మంచి సందర్భాన్ని సృష్టించిన సినీ బ్రహ్మ K విశ్వనాధ్ గారు. అది సినిమాలో హరి పాత్ర పాడటం కూడా అంతే సమంజసం. ఎందుకంటే దేవుడి/శివుడు అతనికి అన్ని ఇచ్చి దృష్టి లేకుండా చేసిన దేవుడిని ఇలాగ ప్రశ్నించటం చాల సమంజసం.

ఈ పాట అంతులేని ఆలోచనలోకి నెట్టేస్తుంది. ఒక పాటలో ఇంత మేధో మధనం ఉంటుందా, ఎంతో భావాన్ని ఇలాగ ఒక పాటలో రాయగలగటం అనేది ఒక అద్బుతమైన వరం. ఆ వరం పొందిన సరస్వతి పుత్రుడు సీతారామ శాస్త్రి గారు.

కొసమెరుపు: 
ఈ సినిమా పాటలతో సీతారామశాస్త్రి గారు, "సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు" అయ్యారు. సినిమాల్లో అవకాశం కోసం ఈయన రాసిన కొన్ని కవిత్వాలు/పాటలు ఈ సినిమా కి చాల రోజుల ముందుగా విశ్వనాధ్ గారికి పంపిస్తే, అయన దగ్గరనుంచి ఏమి పిలిపు రాలేదు, ఆయనని కలిసిన కూడా అవకాశం ఇవ్వలేదు సరి కదా పాటలు నచినట్లు గా చెప్పలేదు. కాని ఈ సినిమా కోసం విశ్వనాద్ గారు సీతారామశాస్త్రి గారిని పిలిస్తే, అవే పాటలు మరల పంపితే చాల బాగున్నాయి అని అవకాశం ఇచ్చి మొత్తం సినిమా లోని పాటలన్నీ రాయించుకున్నారు. ఈ విషయం ఎప్పుడో ఒక ఇంటర్వ్యూ లో చదివినట్లు గుర్తు. సిరివెన్నెల సినిమా కోసం ఈ పాటని విశ్వనాధ్ గారు సీతారామ శాస్త్రి గారు ఎప్పుడో రాసుకున్నది వాడుకున్నారు, కొంచెం మార్పులతో.  సిరివెన్నెల గారు రాసి ప్రచురించిన "శివ దర్పణం" అనే పుస్తకం లో మొత్తం పాట ఉంటుంది.