Showing posts with label Article. Show all posts
Showing posts with label Article. Show all posts

Monday, January 30, 2012

Sriramarajyam Songs

శ్రీరామ రాజ్యం సినిమా పాటలు 
శ్రీ రామ రాజ్యం సినిమా గురించి మొదట విన్నప్పుడు ఆ సినిమా ఏమిటో కథ కథనం ఏంటో తెలియదు. ఈ సినిమా ఆడియో విడుదల చెయ్యకముందే చాల రోజుల క్రితం "జగదానంద కారక" పాటను విడుదల చెయ్యటం జరిగింది. బాలు గారు పాడిన ఆ పాట విన్న తరువాత సంగీత సాగరగమనం లో కోల్పోయిన సంగీత ప్రియులకి ఒక చుక్కాని లాగ కనిపించింది, ఎడారి లో దాహంతో కొట్టు మిట్టాడుతున్న ప్రయాణికులకి ఒక ఒయాసిస్సు మాత్రమే కాదు దాహం తీర్చటానికి ఒక నది ప్రత్యక్షం అయినంత ఆనందం కలిగించింది. సంగీత సాగర గర్భం లో రత్నాలు వెతికే వాళ్లకి మణి మాణిక్యాలు, వజ్ర వైడూర్యాలు దొరికినట్టు అయ్యింది.
ఆ ఆనందం లో మునిగి తేలుతున్న వారికి ఆ సినిమా వివరాలు ఇంకొన్ని ఆసక్తి కలిగించే విశేషాలు తెలిసాయి. ఈ చిత్రానికి బాపు/రమణ గార్లు దర్సకత్వం, కథనం చేసారు అని. వీళ్ళు ఇద్దరు తెలుగు తనానికి ప్రతీక. "ముత్యమంత పసుపు ముఖమెంతో చాయ" అన్న వాళ్ళు తెలుగు సినిమా మరల చేస్తున్నారంటే అంతకంటే తెలుగు వాళ్ళకి సుకృతం ఏముంటుంది.
ఇంకో గొప్ప విశేషం, ఆ సినిమా కి ఇళయరాజా సంగీత సారధ్యం వహిస్తున్నారని. ఆయన సంగీతం విని పెరిగిన వాళ్ళకి ఎప్పటికి ఆ సంగీతం తనివి తీర్చదు. ఎందుకంటే ఆయన సంగీతం తల్లి పెట్టే భోజనం లాంటిది. ఎన్ని సార్లు తిన్నా ఇంకో సారి వడ్డిస్తే తినాలి అనిపిస్తుంది. ఆయన ఇంకో సినిమాకి  ఎప్పుడు సంగీతం సమకూరుస్తారో అని వేచి చూసే వాళ్ళే అయన అభిమానులు.దాదాపు వెయ్యి సినిమాలకి సంగీతం సమకూర్చిన ఇంకా ఇంకా అంటుంది అభిమానుల మనసు. అది తెలుగు సినిమాకి స్వయం గా సంగీతం సమకూర్చటం.
ఇంక బాలసుబ్రహ్మణ్యం గారు, ఆయనేమో గాన గంధర్వుడాయే. ఆయనకైన వయసు మీరుతుందేమో కాని ఆయన గాత్రానికి కాదు. అందుకే అయన గంధర్వుడయ్యాడు.  ఈ మధ్య కాలంలో బాలు గారి పాట పది సినిమాల్లో ఒకటో రెండో ఉంటె ఈ సినిమా లో ఏకం గా నాలుగు పాటలు పాడటం. ఇన్ని సుగుణాలున్న ఈ సినిమా కి అన్నిటికంటే ఇంకో పెద్ద వరం ఈ సినిమా లవకుశ సినిమా అవ్వటం. ఈ విషయం ఆడియో విడుదల అయినంత వరకు తెలియక పోయిన, రామ కథ అన్న తరువాత రాముని సుగుణాలు అన్ని కలపోసి విడుదల అయ్యింది. రామ నామం, ఎన్ని సార్లు అన్న ఎన్ని సార్లు విన్న తనివి తీరనిది. తిరగేసి మరగేసి, విడగొట్టి పడగొట్టి అన్న రామ నామం యొక్క తియ్యదనం పోదు, కరిగి పోదు. అలాగే రామ కథ, ఎవరు ఎన్ని రకాలుగా అన్న, ఎన్ని రకాలుగా రాసిన, ఎన్ని రకాలుగా విన్న అది అమృతమే. ఇంతటి సుగుణాలున్న సినిమా ఆడియో విడుదలయ్యింది. 

ఇంక అప్పటి లవకుశ సినిమాలోని పాటలు ఇంకా మనకి మారుమ్రోగుతూనే ఉన్నాయి. ఆ పాటలు విన్న వాళ్ళకి ఆ పాటలు మాటలు ఇంకా గుర్తు ఉన్నాయి. పద్య భరితమైన అప్పటి సినిమా కి ఏ మాత్రం తీసిపోకుండా ఇప్పటి కాలానుగుణం కోసం సరళమైన భాషలో అందరికి అర్థం అయ్యేలా అద్బుతం గా రాసారు జొన్నవిత్తుల.  "గాలి నింగి నీరు" ఆ పాట ఎలా ఉందొ అంతకుముంది రాయటం జరిగింది.

ఈ ఆడియో విడుదలయ్యి ఇన్ని నెలలు ఐన తరువాత ఇప్పుడు దీనిగురించి రాయటమేమిటి అనుకుంటే అది పాటల లోకి వెళ్తే తెలుస్తుంది. మనిషికి తనకు ఏదైనా లభించకపోతే అందులో కొంత లభించినా ఆనందపడతాడు, ఆ తరువాత ఆ లభించిన దానిని విశ్లేషించి చివరకు ఇంతేనా అని పెదవి విరుస్తాడు, ఇంతేనా నాకు లభించింది అని నిరాశ చెంది మల్ల తనకు లభించిన  దానితో సంతృప్తి చెందక తన అన్వేషణ మరల మొదలు పెడతాడు. ఈ సినిమా లో ఇన్ని సుగుణాలు ఉన్న చివరకు నిరాశ మిగుల్తుంది ఎందుకో అది చూద్దాం.

ఈ సినిమా పాటలు మనకి తెలుగు పాట గురించి మనకి కొన్ని చేదునిజాలు చెప్తాయి, అవి ఏమిటంటే, తెలుగు పాట ఎంత దుస్థితి లో ఉందొ అని. లవకుశ సినిమాలో పాటలు ఇన్ని ఏళ్ళు ఏ కారణాల వాళ్ళ నిలబడ్డాయో అందరికి తెల్సిందే. కాని ఈ సినిమా లో పాటలు కొన్ని కారణాల వాళ్ళ తెరమరుగు అయిపోతాయి. రుచికరమైన విందు భోజనం వడ్డించిన వారందరూ అన్నం లో రాళ్ళూ మిగిల్చారు. అందుకనే అవి కలుక్కు మని పంటికి తగిలి రుచికరమైన భోజనం కంటే రాళ్ళ వల్ల కలిగిన నొప్పి మిగిలిపోతుంది. అందరు కలిసి చిలికి అమృతం లాంటి పాయసం అందించే ముందు అందులో చిన్న ఉప్పు రాయి కలిపితే పాలు ఎలా విరిగిపోతాయో అలాగే అయ్యాయి కొన్ని పాటలు.

దానికి కారణం గాయనీ మణుల ఉచ్చారణ దోషాలు. ఇంత గొప్ప సినిమా లో ఆ సినిమాలో పాటల లో ఏ మాత్రం అంగీకరించలేని దోషాలు ఇవి. మన తెలుగు వాళ్ళ మనసు గొప్పది, అందరిని అంగీకరిస్తాం అలాగే వాళ్ళ తప్పులు కూడా. రామ నామం, రాముని పాటలు కళ్ళు మూసుకొని వినగలగాలి, కాని ఈ ఉచ్చారణ దోషాలు గుండెలో ఎక్కడో గుచ్చుకొని ఉలిక్కి పడి లేచేల చేస్తాయి. అటువంటి దౌర్భాగ్యపు స్థితిలో మనం ఉన్నామంటే అది మన తెలుగు వాళ్ళందరికీ సిగ్గు చేటు. సరిగ్గా తెలుగు పాడలేని వాళ్ళ చేత తెలుగు పాటలు పాడించే స్థితి లో ఉన్నాం అంటే తెలుగు సినిమా పరిశ్రమ ఆలోచించి ఆచరించ వలసిన పరిణామం. పాడేవాళ్ళ గొంతు ఎంతో శ్రావ్యం గా ఉండొచ్చు కాని తెలుగు సరిగ్గా ఉచ్చరించ లేనప్పుడు తెలుగు పాటలు పాడించటం ఎందుకు?  ఇది పెద్దలు అందరు ఆలోచించ వలసిన అవసరం ఎంతైనా ఉంది. తెలుగుని నిలుపటానికి అవసరమైన శ్రమ చెయ్యకపోతే కొన్నాళ్ళకు తెలుగు పాట అంతరించి పోతుంది అనటం లో సందేహం లేదు.

మామూలు సినిమా పాటలు రణ గొణ ధ్వనుల్లో తెలుగు మాటలు ఎలాగో వినపడవు, విన్న అర్థం కావు, కాని ఇటువంటి కలకాలం నిలిచి పోవాల్సిన పాటల్లో కొంత శ్రద్ధ తీసుకోవటానికి ఎందుకు కుదరలేదో. బాపు గారి సినిమాకే ఇన్ని కష్టాలు అంటే ఇంక ముందు కాలం లో తెలుగు పాటలు ఎలా ఉంటాయో ఊహించుకోవచ్చు.ఏ  పాటకైన అందం వచ్చేది రచయిత/కవి చెప్పదల్చుకున్నది గాయని గాయకులూ సరిగ్గా చెప్పినప్పుడే, పదం సరి అయిన చోట సరిగ్గా పలుకక పొతే అర్థమే మారి పోతుంది., అర్థం మారి పొతే తెలుగు పాట పాడై పోతుంది, దానికి కారకులెవరైనా తెలుగు పాటకి అన్యాయం చేసిన వాళ్ళే. ఇప్పుడు ఎవరి ట్రాక్ వారు పాడుతున్న రోజులలో పక్కవారు ఏమి పాడారో చూసి పాడే ఛాన్స్ కూడా లేదు పోనీ వారు ఏమి పాడారో దాన్ని బట్టి పాడుదామంటే. బాలు గారి యుగళ గీతం ఇది స్పష్ట పరుస్తుంది. స, శ, ష  తేడ తెలియని వాళ్ళు తెలుగు పాట పాడటం అనేది మింగుడు పడని విషయం, అందునా రాముని పాటలు.
ఉదాహరణకి కొన్ని తప్పులు చూద్దాం.
జగదానంద కారకా
  1. పాలన శ్రీకరమవుగాక  ---  పాటలో పాడిన విధానం ------- పాలన ష్రీకర మవుగాక 
  2. శుభ స్వాగతం           ---  పాటలో పాడిన విధానం -------  షుభ ష్వాగతం (షుభ సాగతం, సుబ స్వాగతం)
  3. సుఖ శాంతులు          ---  పాటలో పాడిన విధానం ------- షుక షాంతులు ( సుక షాంతులు)
  4. దర్శనము                  ---  పాటలో పాడిన విధానం -------  దర్షనం
శ్రీరామ లేరా ఓ రామ 
ఈ పాట లో ఎక్కువ గా గాయని గాయకులు కలసి పాడటం వాళ్ళ తప్పులు తక్కువ వినిపిస్తాయి, అలాగని లేవు అని కాదు.
  1. శ్రీ రామ/ శ్రీ జానకి              ---  పాటలో పాడిన విధానం -------  ష్రీ రామ , ష్రీ జానకి
  2. హృదయాలను కరిగించి    ---  పాటలో పాడిన విధానం ------- రుదయాలను  కరిగించి
  3. మేలు ఒసగును                ---  పాటలో పాడిన విధానం ------మేలు వసగును
  4. వైదేహి హృదయం            ---  పాటలో పాడిన విధానం -------వైదేహి రుదయం
 దేవుళ్ళే మెచ్చింది
  1. శత్రుఘ్నులు    ---  పాటలో పాడిన విధానం -------  షత్రుఘ్నలు
  2. శివ ధనువు    ---  పాటలో పాడిన విధానం -------  షివ ధనువు 
  3. సుఖ శాంతి  ---  పాటలో పాడిన విధానం -------  సుఖ షాoతి
  4. కౌశికుడు ఏతెంచెను ---  పాటలో పాడిన విధానం ------- కౌషికుడే   తెన్చెను ( తెంచటం ఏమిటో ?? )
  5. దసరధ భూపతి పసి రాముని ప్రేమలో ---  పాడినప్పుడు కొంచెం విరామం లో పసి రాముడు ఏమిటా అని ఒక్కసారి అనిపిస్తుంది. పసి రాముడు ఏమిటో అంటే మొత్తం వినాలి అర్థం అవ్వాలి. ఫెళ ఫెళ అని కూడా సరిగ్గా అర్థం కాదు. ఇలాగ చాల ఉన్నాయి, హృదయం అని సరిగ్గా అన్న అక్కడ అనవసరమైన కష్టం తెలుస్తుంది పాడినప్పుడు.
 సీతా సీమంతం 
  1. సీతమ్మఅవుతోందే               --- పాటలో పాడిన విధానం ------- సీత అమ్మ అవుతోందే అని ఉంటె బాగుండేదేమో
  2. చీరలిచ్చి సారేలిచ్చి              --- పాటలో పాడిన విధానం -------  చేరలిచ్చి సారేలిచ్చి
  3. ముత్యమంత బొట్టు పెట్టి ????? దగ్గరయ్యేనే?  --- పాటలో పాడిన విధానం ------  ముత్యమంత బొట్టు పెట్టి ????? దగ్గరయ్యేనే?
  4. కుంకుమ పువ్వే                 --- పాటలో పాడిన విధానం -------  కొంకుమ పువ్వే
  5. ?????? రాజ్యం                   --- పాటలో పాడిన విధానం -------  కరుణా ( space) టక మధ్యలో గ్యాప్ వలన ఆ రాజ్యమేమిటో ఎప్పుడు వినని రాజ్యమయ్యింది.
  6. పట్ట రాని              --- పాటలో పాడిన విధానం -------  పట్టా రాణి 
  7. ప్రేమ తోటి     --- పాటలో పాడిన విధానం -------  ప్రేమా తోటి 
  8. రామ నామ కీర్తనలు  ---- పాటలో పాడిన విధానం -------  రామ నామ కీర్తనాలు
  9. ఆశీస్సులతో -------    పాటలో పాడిన విధానం -------- ఆషేస్సుల తో

 రామ రామ అనే 
  1. బాల రాముని  --- పాటలో పాడిన విధానం -------  బాలా రాముని    
  2. హద్దులు  మీర  --- పాటలో పాడిన విధానం ------- హదులూ మీర
 రామ రామ అనే 
  1. మల్లెల్లార   --- పాటలో పాడిన విధానం -------  మల్లెలార ( ఇద్దరు కాబట్టి మల్లెల్లార అని ఉండాలేమో?? ) 
 మంగళం 
ఇక్కడ జానకి వాయ సినివాసునకు?? స్పష్టత లేదు?? 
ఇన్ని పాటలలో తేడాలుంటే, వినాలంటే కష్టమే, అత్యంత భక్తి శ్రద్ధలతో తీసిన సినిమా, అందరు చాల శ్రమ పడి తీసిన సినిమా ఇది. కాని పాటల విషయం లో ఎందుకింత అశ్రద్ధ చేసారో ఆ రామునికే తెలియాలి. జొన్న విత్తుల గారు పడ్డ శ్రమ అంత సీతమ్మ వారి కష్టం లాగ తన తప్పు లేకపోయినా బూడిదలో పోసిన పన్నీరు అయ్యింది. బాలు గారు లేకపోతే ఈ పాటలు ఏమయ్యేవో అని ఊహ ఒక భయంకరమైన దుస్స్వప్నం, తెలుగు సినిమా పాటకి. 

Sunday, December 4, 2011

Ae nimishaniki VS. Gaali Ningi Neeru

ఏ నిమిషానికి ఏమి జరుగునో - లవ కుశ ( Singer/Composer - ఘంటసాల, Lyricist - సదాశివ బ్రహ్మం )
 

గాలి నింగి నీరు - శ్రీ రామరాజ్యం ( Singer - SPB, Composer - ఇళయరాజా , Lyricist - జొన్నవిత్తుల )
 

రామ నామము ఎన్ని సార్లు అన్న, రాముని చరితము ఎన్ని సార్లు చదివిన సారం తగ్గనిది. రామచరితం ఎన్ని సార్లు చదివినా, చదివిన కొద్ది రత్నాలు , మణులు మాణిక్యాలు దొరుకుతాయి. అటువంటి రామచరితాన్ని ఎందరో అనువదించారు, విశ్లేషించారు, శ్లాఘించారు. కొంతమంది దృశ్య కావ్యాలు తీసారు. ఇంకొంత మంది ఇంకొంచెం ముందుకెళ్ళి తమసొంత కథలు కల్పించి మెప్పించారు. లవకుశ జననం ఆ తరువాత కథ ఉత్తర రామాయణంగా అందరికి పరిచయమే, వాల్మికి ఇది రాయక పోయిన రాసిన వాళ్ళు అందులో వాల్మీకి పాత్ర సృష్టించి అది యదార్ధ గాధగా నిల్చేలా చేసారు.

కథ అందరికి తెల్సిందే!! కాని ఉత్తర రామాయణం లో అత్యంత క్లిష్టమైన ఘట్టం, అత్యంత ఉదాత్తమమైన ఘట్టం సీత పరిత్యాగం. చాకలి వాని అజ్ఞానాన్ని కూడా వదలక దాన్నే జనాభిప్రాయం గా తలచి, ఒక రాజుగా తన కర్తవ్య నిర్వహణ కోసం, సీతమ్మ వారికీ చెప్పకుండా లక్ష్మణుడికి చెప్పి అడవులలో విడిచి రమ్మనడం అనేది యుగాధర్మమేమో, రాజధర్మమో కానీ న్యాయం అయితే కాదు ఏ కోణంలో చూసిన సరే

సీతమ్మ వారు ఒక మహారాణి అందులో అన్ని కష్టాలు పడి వనవాసం చేసి రావణుని గుప్పెట్లోనుంచి బయటకి వచ్చి శీల పరీక్ష చేసి రాజధాని కి వచ్చిన తరువాత ఎవరైనా ఇటువంటి కష్టాన్నికోరుకోరు. అందులో రాముని అత్యంత ప్రీతి పాత్రమైన సీతని ఇటువంటి కష్టానికి గురిచెయ్యటం కూడా ఎవరు ఊహించరు.

సీతమ్మ వారు నదీ తీరం లోని మునులు ఋషుల సమక్ష్యంలో కొన్ని రోజులు గడపాలని కోరిక రావటం రాబోయే కాలానికి సూచనేమో .

రాముడు రాజు ఐనప్పుడు చేసిన ప్రమాణం, ప్రజల అభిష్టమే తన అభీష్టం, ప్రజా వాక్కే తన వాక్కు, ప్రజల కోసం తన కష్ట నష్టాలు, ఇష్ట అయిష్టాలు , తనవాళ్ళు ఇటువంటి వాణ్ణి వదులుకుంటాను అని ప్రమాణం చేస్తే అది ఇంక శాసనమే, అటువంటిది, తమ జంట మీద అంట పెద్ద కళంకం వస్తే ఇంకా ఏమైనా ఉందా, మునుపటి తరాలకి రాబోయే తరాల ప్రతిష్ట ఏమి కావాలి అని తీసుకున్న నిర్ణయం. ఇంతటి  కఠిన నిర్ణయం తీసుకున్నాడు కాబట్టే రాముడు దేవుడయ్యాడు.. ఆ రాముడి కి అండగా నిల్చింది కాబట్టే సీతమ్మ దేవత అయ్యింది.

ఇంకా ఈ సందర్భానికొస్తే, అన్న ఆజ్ఞ జవదాటలేక, అట్లాగని ఇష్టం లేని పని చెయ్యాల్సి వచ్చిన లక్ష్మణుని పరిస్తితి ఎవరు కావాలని కోరుకోరు. తనకు అత్యంత ఇష్టమైన వదిన గారికి ఇంత అన్యాయం జరుగుతుంటే పడే ఆవేదన ఒక వైపు, ఈ ఆవేదన తన వదినగారికి కనిపించకుండా దాచటం ఇంకోవైపు, తన ఆలోచనలు గుర్రం లా పరిగెత్తుతుంటే మరొక వైపు సీతమ్మ వారిని అడవిలో వదిలే సందర్భం లో ఇద్దరి మధ్య మాటలు ఎలా ఉంటాయి? సినిమా లో ఈ సందర్భం లో పాట కంటే ఇంకో మాధ్యమం లేదు ఆ పరిస్తితి వివరించటానికి.

ఈ సన్నివేశంలో లవకుశలో పాట రాసిన ఇద్దరు మహారధుల కి సంబందించిన "Comparison" చేసేంత అర్హత అనుభవం, జ్ఞానం నాకు లేదు కాని పాటలు విన్న తరువాత లక్షణుడు ఏమి అలోచించి ఉండొచ్చుఅని కలిగిన ఆలోచన ఇద్దరు రచయితల ఆలోచన విధానం ఎలా ఉంటుంది అన్న విశ్లేషణ మాత్రమే ఇది.

ఏ నిమిషానికి ఏమి జరుగునో - లవ కుశ




ఏ  నిమిషానికి  ఏమి జరుగునో ఎవరూహించెదరూ                    
విధి  విధానమును  తప్పించుటకై ఎవరు సాహసించెదరూ

చిన్నప్పటినుంచి నా మదిలోను మనస్సులోను నిలచిపోయిన పాట ఇది, ఎప్పుడు ఏమి జరుగుతుందో, మన జీవితం ఏ గమ్యం ఏ మజిలి ఏ మలుపు తిరుగుతుందో మనకే తెలియదు అని నేర్పిన ఈ పాట ఇప్పటికి చేవులలోనే మారుమోగుతుంది. ఘంటసాల గారు స్వరపరచి పాడిన ఈ పాట ఆపాత మధురం.

కంచెయ నిజముగా చేనుమేసిన కాదనువారెవరు
రాదేయికి ( రాజే ఇది correct word) సాసనమని పలకిన ప్రతిఘటించువారెవరు                                        
  
ఇక్కడ చూస్తె కంచే చేను మేస్తే అంటే రాముడే సీతని పంపితే ఎవరు మాత్రం ఏమి చెయ్యగలరు అని లక్ష్మణుడు అనుకుంటాడు, దాన్ని విధి విలాసం గా భావిస్తాడు, ఈ సందర్భం లో ఇంతకన్నా ఏమి చెయ్యగలడు?ఎంతైనా అన్న, అన్నని దిక్కరించాతమే కాదు ఎదురు మాట ఎలా చెప్తాడు? అన్న మాటకి శాసనం ఇంకా దానికి తిరుగులేదు. కానీ ఈ పాటలో లక్ష్మణుని అసహాయత నేను ఏమి చెయ్యలేను అన్న సందేశం ఇస్తుంది.  
                                    
ఇంక తరువాత చరణం లోకి వెళ్తే

కరునామయులిది కాదనలేర, కఠిన కార్యమనబోర ??
సాద్వులకేప్పుడు వెతలేనా తీరని దుఖపు కథలేనా??

ఇనకులమున జనియించిన నృపదులు ఈ దారుణమును సాహించెదర ??
వినువీధిని రేనులుగా నిల్చి విడ్డురముగా చూసెదర ??

ఇక్కడ లక్ష్మణుడు ముందుగా తనగురించి ఆలోచిస్తాడు అనుకుంట, తను చేసే కార్యం కటినమైనిదిగా భావిచడం లో తప్పు లేదు ఎందుకంటే రాముడు అత్యంత కష్టతరమైన పని అప్పచెప్పాడు కాబట్టి. సాధ్వుల కెప్పుడు కష్టాలు అని ఇక్కడ సాధ్వి అంటే ముందుగా తనగురించి చెప్తున్నాడు కాబట్టి తనకి ఇంతటి కష్టాలు అని కూడా అనుకొవొచ్చు, నాకు ఎందుకు ఇన్ని కష్టాలు వచ్చాయి అని రాముని కోసం అష్ట కష్టాలు పడ్డ లక్ష్మణుడు ఇలాగ ఆలోచించటం విచిత్రమే, ఇక్కడ అందరు ఈ జరుగుతున్న దారుణం సహించి విడ్డూరంగా  చూస్తారా అని అనుకోవటం నిస్పృహ గా తోస్తుంది.

The meaning I thought initially was the following however didn't publish because the analysis was more towards Lakshmana's mind set,


సీతమ్మ వారిని పరిత్యజించటం అనేది కష్టతరమైన పని, అందులో నిండు చూలల్ని అడవి లో వదిలేసి రమ్మనటం రామునికి అత్యంత కటినమైనది, ఇది ఎవ్వరు విభేదించలేరు. సీత లేకుండా రాముడు సంతోషంగా  ఉండడటం అనేది జరగని పని. సీతారాములు సాద్వులు, వారు ఎన్ని కష్టాలకి గురి అయ్యారో అందరికి తెల్సు, 

ఇక్కడ అందరు ఈ జరుగుతున్న దారుణం సహించి విడ్డూరంగా  చూస్తారా అని అనుకోవటం నిస్పృహ గా తోస్తుంది.

ఎండకన్ను ఎరుగని ఇల్లాలికి ఎందుకో ఈ వనవాసాలు? 
తరచి  చుసిన  భోదపడవులే దైవ చిద్విలాసాలు 
అగ్నిపరీక్షకే నిల్చిన సాద్విని అనుమానించుట న్యాయమా 
అల్పుని మాటయే జనవాక్యమ్మని అనుసరించుటే  ధర్మమా 

 


ఇక్కడ జనం అంటే అందరు వస్తారు , రాజుకి ప్రతి పౌరుడు తన బిడ్డే,.అతను అల్పుడైన మేధావి ఐన. కాబట్టి అల్పుని మాట అని అనటం సమంజసమో కాదో తెలియదు. బిడ్డ ఎవరైనా కాని అభిప్రాయం మటుకు మార్చలేనిది, సీత ఆగి పరీక్ష చేసిన, అది ఎంతమందికి తెల్సు? కాబట్టి ఆ అభిప్రాయం నిజాలు తెలియని  జనాల్లోంచి పోదు. అందుకే రాముడు ఆ అభిప్రాయాన్ని సీతని త్యజించటం ద్వార జనల్లోని ఆ కాస్త సందేహం కూడా కలుగకుండా చేసాడు, ఎందుకంటే చరిత్ర మార్చలేడు కాబట్టి.

సీతమ్మ మహారాణి కాబట్టి ఎండకన్ను ఎరుగదు అని అనటం సమంజసం, కానీ 14 ఏళ్ళు వనవాసం చేసిన సీతకి ఎండ కొత్తేమి కాదు కష్టాలు కొత్తేమి కాదు కదా, అగ్ని పరీక్ష చేసింది లంక లో, కాని అనుమానించింది ఒక సాధారణ పౌరుడు, ఇక్కడ ఈ విషయం అందరికి ఎందుకు తెలియదో పక్కన పెడితే, రాముడు కాబట్టి సీతను స్వీకరించాడు, నేను ఎందుకు చెయ్యాలి అనే ప్రశ్నకి సమాధానం ఉండదు.

మొత్తానికి ఈ పాట లకష్మణుడి అస్తిర భావం, అసహాయత ని ఎక్కువ చెప్తుంది. లక్ష్మణుడి ఆలోచన విధానం లో ఎక్కువ స్పష్టత లేదు అనిపిస్తుంది. 

ఇక ఇదే సందర్భం లో శ్రీ రామరాజ్యం లో పాట ఎలా ఉందొ చూద్దాం.

 


గాలి  నింగి  నీరు  భూమి  నిప్పు  మీరు  రామా  వద్దనలేర  ఒక్కరూ
నేరం  చేసిందెవరు  దూరం  అవుతోందేవారు  ఘోరం  ఆపేదెవరు  ఎవరూ
రారే  మునులు  ఋషులు   ఏమైరి  వేదాంతులు  సాగే  ఈ  మౌనం  సరేనా?
కొండ  కోన  అడవి  సెలయేరు  సరయూ  నది  అడగండి  న్యాయం  ఇదేనా ?
 
లక్ష్మణుడు రధం మీద తీసుకెళ్తూ ఇంకా ఎక్కడో ఆశతో వెళ్తుంటాడు ఎవరైనా ఆపకపోతార అని. తనవల్ల కాలేదు, తమ అన్నదమ్ముల్ల వలన కాలేదు రాజమాతల వల్లన కాలేదు కనీసం మీరిన ఆపలేరా అని అక్రోసిస్తూ వెళ్తుంటాడు తనకు గుర్తుకు వచ్చిన వాళ్ళని దారిలో చూసిన వాళ్ళని అడుగుతాడు, మీరిన కనీసం "రామ ఈ పని వద్దు" అనండి అని,, ఎవరో నేరం చేస్తే తన అన్న వదిన ఎందుకు దూరం కావాలి అనే బాధ కనిపిస్తుంది, ఇది ఇప్పటి వాళ్ళ ఆలోచనకి సరిగ్గా సరిపోతుంది అని నా అభిప్రాయం, తనకి ఇది అన్యాయం అని తెల్సు కాని రాముని అడిగే ధైర్యం లేదు, అన్నగారి మాట జవదాటలేదు, అందుకని మౌనం గా ఉండటం సరి కాదు రామా ఇది ఆపు అని అడగటం లో లక్ష్మణుని బాధ ఉంది.




1st stanza
ముక్కోటి  దేవతలంతా  దీవించిన  ఈ  బంధం  ఇక్కడ  ఇప్పుడు  విడుతుంటే  ఎ  ఒక్కడు  కూడా  దిగిరార  ?
అందరికీ  ఆదర్శం  అని  కీర్తించే  ఈ  లోకం  రాముని  కోరగా  పోలేద  ఈ  రధముని  ఆపగలేదా ?
విదినైన  కాని  ఎదిరించేవాడే  విధి  లేక  నేడు  విలపించినాడే ఏడేడు  లోకాలకి  సోకేను  ఈ  శోకం

రంగ రంగ వైభవంగా జరిగిన సీతారాముల పెళ్లికి మూడు లోకాలు సాక్షులే. రావణ సంహారం కోసం ముక్కోటి దేవతలు దగ్గరగా వచ్చి దీవించి మరి పెళ్లి చేసారు, అటువంటిది, రావణ సంహారం అయిపోగానే ఇంకా ఈ బంధం తెగిపోతుంటే ఒక్కరు కూడా రాలేదా అని అడగటం చాల సమంజసం,అలాగే రావణ సంహారానికి అందరు సహకరించారు కాని సీతారాముల ఎడబాటుని ఒక్కళ్ళు కూడా ఆపలేకపోవటం శోచనీయం. లక్ష్మణుడు చేసే ప్రతి నిందలోను న్యాయం ఉంది, ఆదర్శం అని కీర్తిస్తే సరిపోదు, రధాన్ని ఆపి ఈ ఎడబాటుని మాపండి అని కవి ఎంతో చక్కగా చెప్తాడు.రాముడి శక్తి ముంది విధి కూడా తలవంచుతుంది అటువంటి వాడు సీతని త్యాగించి కన్నీరు మున్నీరు గా విలపించటం లక్ష్మణుడు దాన్ని గురించి బాద పడటం అనేది సందర్భోచితం. రాముడు నాకు ఈ రాజ్యాధికారం వల్లనే కదా సీతని త్యాగం చెయ్యాల్సి వచ్చింది నేను రాజ్య త్యాగం చేసి సీత తో నేను కూడా అడవులకి వెళ్ళిపోతాను అప్పుడు ఎటువంటి ఇబ్బంది ఉండదు అని అంటే ఎవరో ఒప్పుకోరు అందుకనే తన వంశం ఒక్క కీర్తి ప్రతిష్టల కోసం విధిలేక సీతని వదిలిపెట్టి విలపిస్తే లోకాలన్నీ విలపించావా అని ఎంత చక్కగా చెప్పారో కవి ?

2nd stanza
రారే  మునులు  ఋషులు   ఏమైరి  వేదాంతులు  సాగే  ఈ  మౌనం  సరేనా?
కొండ  కోన  అడవి  సెలయేరు  సరయూ  నది  అడగండి  న్యాయం  ఇదేనా ?
అక్కడితో  అయిపోకుండా  ఇక్కడ  ఆ  ఇల్లాలే  రాక్కసివిధికి  చిక్కిందా? ఈ  లెక్కన  దైవం  ఉందా?
సుగుణంతో  సూర్యుని  వంశం  వెలిగించే  కులసతిని  ఆ  వెలుగే  వెలివేసింద? ఈ  జగమే  చీకటి  అయ్యిందా ?
ఏ తప్పు  లేని  ఈ  ముప్పు  ఏమి  కాపాడలేర? ఎవరైనా కాని నీమాటే  నీదా  వేరే  దారేది  లేదా 




అక్కడితో అయిపోవటం అంటే 14 ఏళ్ల కష్టనష్టాలు అనుభవించిన సీత సాధ్వి ఇక్కడ రెండోసారి తన తప్పు లేకుండా మళ్ళా బలి అయ్యింది, మంచి వాళ్ళకి మంచి జరగక పొతే, ఇంకా దైవం ఎందుకు? అందులో సూర్యవంశం నిలబెట్టే సీతని ఆ రాముడే వేలివేసాడే? లక్ష్మి లేని ఇల్లు చీకటి పాలే కదా, ఇది చాల చక్కని వర్ణన, ఈ తప్పు  లేకుండా సీతని బలిచేయ్యద్దు రామా నీ కర్తవ్యం నీ ధర్మం నీదేనా సీత కి వేరే దారి లేదా అని చెప్పకనే చెప్పారు..

Conclusion
మనిషి మనస్తత్వం ఎలాంటిదంటే,కష్టం రాబోతోంది అనికాని తనకు ఇష్టంలేని పని జరగబోతుందని తెలిస్తే అది జరిగేంతవరకు ఆపటానికి సాయశక్తుల ప్రయత్నిస్తాడు తనవల్ల కానప్పుడు నానావిధలుగా ప్రార్దిస్తాడు అది జరుగకుండా ఉండటానికి. అంతే కాని ఇది విధి రాసిన రాత అని నిస్పృహతో వోటమిని ఒప్పుకోడు అని అనుకుంటున్నాను, జొన్నవిత్తుల గారు ఈ "Psycology" తో  పాట రాసారు అని నాకు అనిపించింది. 


కాని సదాశివ బ్రహ్మం గారు లక్ష్మణుడికి ఉన్న పరిణితితో అలోచించి విధి ముందు ఎవరు ఏమి చెయ్యలేరు అని ఆలోచించే విధంగా రాసారు అనిపిస్తుంది, కాని కంచే చేను మేసింది అని ప్రస్తావించి సీతారాముల దంపత్యాన్ని సరిగ్గా చూపలేదేమో అని నా అభిప్రాయం. అలాగే విను వీదులలో విడ్డూరం గా చూడటం తప్ప ఏమి చెయ్యలేరు అని రాస్తే జొన్నవిత్తుల గారు అన్నిలోకలు శోకం లో మునిగిపోతారు అని రాసారు. ఇది చాల సత్యం. ఎవరు ఈ ఘోరాన్ని చూసిన శోకం లో మునిగిపోవటం ఖాయం. 
 

అందుకనే జొన్నవిత్తుల గారు రాసిన ఈ పాట ఆ సందర్భానికి ఎక్కువ దగ్గరగా ఉందని నా అభిప్రాయం మాత్రమే.  విజ్ఞులు ఎవరైనా  నా అభిప్రాయాన్ని సరి దిద్దితే అదే పది వేలు..