శ్రీరామ రాజ్యం సినిమా పాటలు
శ్రీ రామ రాజ్యం సినిమా గురించి మొదట విన్నప్పుడు ఆ సినిమా ఏమిటో కథ కథనం ఏంటో తెలియదు. ఈ సినిమా ఆడియో విడుదల చెయ్యకముందే చాల రోజుల క్రితం "జగదానంద కారక" పాటను విడుదల చెయ్యటం జరిగింది. బాలు గారు పాడిన ఆ పాట విన్న తరువాత సంగీత సాగరగమనం లో కోల్పోయిన సంగీత ప్రియులకి ఒక చుక్కాని లాగ కనిపించింది, ఎడారి లో దాహంతో కొట్టు మిట్టాడుతున్న ప్రయాణికులకి ఒక ఒయాసిస్సు మాత్రమే కాదు దాహం తీర్చటానికి ఒక నది ప్రత్యక్షం అయినంత ఆనందం కలిగించింది. సంగీత సాగర గర్భం లో రత్నాలు వెతికే వాళ్లకి మణి మాణిక్యాలు, వజ్ర వైడూర్యాలు దొరికినట్టు అయ్యింది.
ఆ ఆనందం లో మునిగి తేలుతున్న వారికి ఆ సినిమా వివరాలు ఇంకొన్ని ఆసక్తి కలిగించే విశేషాలు తెలిసాయి. ఈ చిత్రానికి బాపు/రమణ గార్లు దర్సకత్వం, కథనం చేసారు అని. వీళ్ళు ఇద్దరు తెలుగు తనానికి ప్రతీక. "ముత్యమంత పసుపు ముఖమెంతో చాయ" అన్న వాళ్ళు తెలుగు సినిమా మరల చేస్తున్నారంటే అంతకంటే తెలుగు వాళ్ళకి సుకృతం ఏముంటుంది.
ఇంకో గొప్ప విశేషం, ఆ సినిమా కి ఇళయరాజా సంగీత సారధ్యం వహిస్తున్నారని. ఆయన సంగీతం విని పెరిగిన వాళ్ళకి ఎప్పటికి ఆ సంగీతం తనివి తీర్చదు. ఎందుకంటే ఆయన సంగీతం తల్లి పెట్టే భోజనం లాంటిది. ఎన్ని సార్లు తిన్నా ఇంకో సారి వడ్డిస్తే తినాలి అనిపిస్తుంది. ఆయన ఇంకో సినిమాకి ఎప్పుడు సంగీతం సమకూరుస్తారో అని వేచి చూసే వాళ్ళే అయన అభిమానులు.దాదాపు వెయ్యి సినిమాలకి సంగీతం సమకూర్చిన ఇంకా ఇంకా అంటుంది అభిమానుల మనసు. అది తెలుగు సినిమాకి స్వయం గా సంగీతం సమకూర్చటం.
ఇంక బాలసుబ్రహ్మణ్యం గారు, ఆయనేమో గాన గంధర్వుడాయే. ఆయనకైన వయసు మీరుతుందేమో కాని ఆయన గాత్రానికి కాదు. అందుకే అయన గంధర్వుడయ్యాడు. ఈ మధ్య కాలంలో బాలు గారి పాట పది సినిమాల్లో ఒకటో రెండో ఉంటె ఈ సినిమా లో ఏకం గా నాలుగు పాటలు పాడటం. ఇన్ని సుగుణాలున్న ఈ సినిమా కి అన్నిటికంటే ఇంకో పెద్ద వరం ఈ సినిమా లవకుశ సినిమా అవ్వటం. ఈ విషయం ఆడియో విడుదల అయినంత వరకు తెలియక పోయిన, రామ కథ అన్న తరువాత రాముని సుగుణాలు అన్ని కలపోసి విడుదల అయ్యింది. రామ నామం, ఎన్ని సార్లు అన్న ఎన్ని సార్లు విన్న తనివి తీరనిది. తిరగేసి మరగేసి, విడగొట్టి పడగొట్టి అన్న రామ నామం యొక్క తియ్యదనం పోదు, కరిగి పోదు. అలాగే రామ కథ, ఎవరు ఎన్ని రకాలుగా అన్న, ఎన్ని రకాలుగా రాసిన, ఎన్ని రకాలుగా విన్న అది అమృతమే. ఇంతటి సుగుణాలున్న సినిమా ఆడియో విడుదలయ్యింది.
ఇంక అప్పటి లవకుశ సినిమాలోని పాటలు ఇంకా మనకి మారుమ్రోగుతూనే ఉన్నాయి. ఆ పాటలు విన్న వాళ్ళకి ఆ పాటలు మాటలు ఇంకా గుర్తు ఉన్నాయి. పద్య భరితమైన అప్పటి సినిమా కి ఏ మాత్రం తీసిపోకుండా ఇప్పటి కాలానుగుణం కోసం సరళమైన భాషలో అందరికి అర్థం అయ్యేలా అద్బుతం గా రాసారు జొన్నవిత్తుల. "గాలి నింగి నీరు" ఆ పాట ఎలా ఉందొ అంతకుముంది రాయటం జరిగింది.
ఈ ఆడియో విడుదలయ్యి ఇన్ని నెలలు ఐన తరువాత ఇప్పుడు దీనిగురించి రాయటమేమిటి అనుకుంటే అది పాటల లోకి వెళ్తే తెలుస్తుంది. మనిషికి తనకు ఏదైనా లభించకపోతే అందులో కొంత లభించినా ఆనందపడతాడు, ఆ తరువాత ఆ లభించిన దానిని విశ్లేషించి చివరకు ఇంతేనా అని పెదవి విరుస్తాడు, ఇంతేనా నాకు లభించింది అని నిరాశ చెంది మల్ల తనకు లభించిన దానితో సంతృప్తి చెందక తన అన్వేషణ మరల మొదలు పెడతాడు. ఈ సినిమా లో ఇన్ని సుగుణాలు ఉన్న చివరకు నిరాశ మిగుల్తుంది ఎందుకో అది చూద్దాం.
ఈ సినిమా పాటలు మనకి తెలుగు పాట గురించి మనకి కొన్ని చేదునిజాలు చెప్తాయి, అవి ఏమిటంటే, తెలుగు పాట ఎంత దుస్థితి లో ఉందొ అని. లవకుశ సినిమాలో పాటలు ఇన్ని ఏళ్ళు ఏ కారణాల వాళ్ళ నిలబడ్డాయో అందరికి తెల్సిందే. కాని ఈ సినిమా లో పాటలు కొన్ని కారణాల వాళ్ళ తెరమరుగు అయిపోతాయి. రుచికరమైన విందు భోజనం వడ్డించిన వారందరూ అన్నం లో రాళ్ళూ మిగిల్చారు. అందుకనే అవి కలుక్కు మని పంటికి తగిలి రుచికరమైన భోజనం కంటే రాళ్ళ వల్ల కలిగిన నొప్పి మిగిలిపోతుంది. అందరు కలిసి చిలికి అమృతం లాంటి పాయసం అందించే ముందు అందులో చిన్న ఉప్పు రాయి కలిపితే పాలు ఎలా విరిగిపోతాయో అలాగే అయ్యాయి కొన్ని పాటలు.
దానికి కారణం గాయనీ మణుల ఉచ్చారణ దోషాలు. ఇంత గొప్ప సినిమా లో ఆ సినిమాలో పాటల లో ఏ మాత్రం అంగీకరించలేని దోషాలు ఇవి. మన తెలుగు వాళ్ళ మనసు గొప్పది, అందరిని అంగీకరిస్తాం అలాగే వాళ్ళ తప్పులు కూడా. రామ నామం, రాముని పాటలు కళ్ళు మూసుకొని వినగలగాలి, కాని ఈ ఉచ్చారణ దోషాలు గుండెలో ఎక్కడో గుచ్చుకొని ఉలిక్కి పడి లేచేల చేస్తాయి. అటువంటి దౌర్భాగ్యపు స్థితిలో మనం ఉన్నామంటే అది మన తెలుగు వాళ్ళందరికీ సిగ్గు చేటు. సరిగ్గా తెలుగు పాడలేని వాళ్ళ చేత తెలుగు పాటలు పాడించే స్థితి లో ఉన్నాం అంటే తెలుగు సినిమా పరిశ్రమ ఆలోచించి ఆచరించ వలసిన పరిణామం. పాడేవాళ్ళ గొంతు ఎంతో శ్రావ్యం గా ఉండొచ్చు కాని తెలుగు సరిగ్గా ఉచ్చరించ లేనప్పుడు తెలుగు పాటలు పాడించటం ఎందుకు? ఇది పెద్దలు అందరు ఆలోచించ వలసిన అవసరం ఎంతైనా ఉంది. తెలుగుని నిలుపటానికి అవసరమైన శ్రమ చెయ్యకపోతే కొన్నాళ్ళకు తెలుగు పాట అంతరించి పోతుంది అనటం లో సందేహం లేదు.
మామూలు సినిమా పాటలు రణ గొణ ధ్వనుల్లో తెలుగు మాటలు ఎలాగో వినపడవు, విన్న అర్థం కావు, కాని ఇటువంటి కలకాలం నిలిచి పోవాల్సిన పాటల్లో కొంత శ్రద్ధ తీసుకోవటానికి ఎందుకు కుదరలేదో. బాపు గారి సినిమాకే ఇన్ని కష్టాలు అంటే ఇంక ముందు కాలం లో తెలుగు పాటలు ఎలా ఉంటాయో ఊహించుకోవచ్చు.ఏ పాటకైన అందం వచ్చేది రచయిత/కవి చెప్పదల్చుకున్నది గాయని గాయకులూ సరిగ్గా చెప్పినప్పుడే, పదం సరి అయిన చోట సరిగ్గా పలుకక పొతే అర్థమే మారి పోతుంది., అర్థం మారి పొతే తెలుగు పాట పాడై పోతుంది, దానికి కారకులెవరైనా తెలుగు పాటకి అన్యాయం చేసిన వాళ్ళే. ఇప్పుడు ఎవరి ట్రాక్ వారు పాడుతున్న రోజులలో పక్కవారు ఏమి పాడారో చూసి పాడే ఛాన్స్ కూడా లేదు పోనీ వారు ఏమి పాడారో దాన్ని బట్టి పాడుదామంటే. బాలు గారి యుగళ గీతం ఇది స్పష్ట పరుస్తుంది. స, శ, ష తేడ తెలియని వాళ్ళు తెలుగు పాట పాడటం అనేది మింగుడు పడని విషయం, అందునా రాముని పాటలు.

ఉదాహరణకి కొన్ని తప్పులు చూద్దాం.
జగదానంద కారకా
- పాలన శ్రీకరమవుగాక --- పాటలో పాడిన విధానం ------- పాలన ష్రీకర మవుగాక
- శుభ స్వాగతం --- పాటలో పాడిన విధానం ------- షుభ ష్వాగతం (షుభ సాగతం, సుబ స్వాగతం)
- సుఖ శాంతులు --- పాటలో పాడిన విధానం ------- షుక షాంతులు ( సుక షాంతులు)
- దర్శనము --- పాటలో పాడిన విధానం ------- దర్షనం
శ్రీరామ లేరా ఓ రామ
ఈ పాట లో ఎక్కువ గా గాయని గాయకులు కలసి పాడటం వాళ్ళ తప్పులు తక్కువ వినిపిస్తాయి, అలాగని లేవు అని కాదు.
- శ్రీ రామ/ శ్రీ జానకి --- పాటలో పాడిన విధానం ------- ష్రీ రామ , ష్రీ జానకి
- హృదయాలను కరిగించి --- పాటలో పాడిన విధానం ------- రుదయాలను కరిగించి
- మేలు ఒసగును --- పాటలో పాడిన విధానం ------మేలు వసగును
- వైదేహి హృదయం --- పాటలో పాడిన విధానం -------వైదేహి రుదయం
దేవుళ్ళే మెచ్చింది
- శత్రుఘ్నులు --- పాటలో పాడిన విధానం ------- షత్రుఘ్నలు
- శివ ధనువు --- పాటలో పాడిన విధానం ------- షివ ధనువు
- సుఖ శాంతి --- పాటలో పాడిన విధానం ------- సుఖ షాoతి
- కౌశికుడు ఏతెంచెను --- పాటలో పాడిన విధానం ------- కౌషికుడే తెన్చెను ( తెంచటం ఏమిటో ?? )
- దసరధ భూపతి పసి రాముని ప్రేమలో --- పాడినప్పుడు కొంచెం విరామం లో పసి రాముడు ఏమిటా అని ఒక్కసారి అనిపిస్తుంది. పసి రాముడు ఏమిటో అంటే మొత్తం వినాలి అర్థం అవ్వాలి. ఫెళ ఫెళ అని కూడా సరిగ్గా అర్థం కాదు. ఇలాగ చాల ఉన్నాయి, హృదయం అని సరిగ్గా అన్న అక్కడ అనవసరమైన కష్టం తెలుస్తుంది పాడినప్పుడు.
సీతా సీమంతం
- సీతమ్మఅవుతోందే --- పాటలో పాడిన విధానం ------- సీత అమ్మ అవుతోందే అని ఉంటె బాగుండేదేమో
- చీరలిచ్చి సారేలిచ్చి --- పాటలో పాడిన విధానం ------- చేరలిచ్చి సారేలిచ్చి
- ముత్యమంత బొట్టు పెట్టి ????? దగ్గరయ్యేనే? --- పాటలో పాడిన విధానం ------ ముత్యమంత బొట్టు పెట్టి ????? దగ్గరయ్యేనే?
- కుంకుమ పువ్వే --- పాటలో పాడిన విధానం ------- కొంకుమ పువ్వే
- ?????? రాజ్యం --- పాటలో పాడిన విధానం ------- కరుణా ( space) టక మధ్యలో గ్యాప్ వలన ఆ రాజ్యమేమిటో ఎప్పుడు వినని రాజ్యమయ్యింది.
- పట్ట రాని --- పాటలో పాడిన విధానం ------- పట్టా రాణి
- ప్రేమ తోటి --- పాటలో పాడిన విధానం ------- ప్రేమా తోటి
- రామ నామ కీర్తనలు ---- పాటలో పాడిన విధానం ------- రామ నామ కీర్తనాలు
- ఆశీస్సులతో ------- పాటలో పాడిన విధానం -------- ఆషేస్సుల తో
రామ రామ అనే
- బాల రాముని --- పాటలో పాడిన విధానం ------- బాలా రాముని
- హద్దులు మీర --- పాటలో పాడిన విధానం ------- హదులూ మీర
రామ రామ అనే
- మల్లెల్లార --- పాటలో పాడిన విధానం ------- మల్లెలార ( ఇద్దరు కాబట్టి మల్లెల్లార అని ఉండాలేమో?? )
మంగళం
ఇక్కడ జానకి వాయ సినివాసునకు?? స్పష్టత లేదు??
ఇన్ని పాటలలో తేడాలుంటే, వినాలంటే కష్టమే, అత్యంత భక్తి శ్రద్ధలతో తీసిన సినిమా, అందరు చాల శ్రమ పడి తీసిన సినిమా ఇది. కాని పాటల విషయం లో ఎందుకింత అశ్రద్ధ చేసారో ఆ రామునికే తెలియాలి. జొన్న విత్తుల గారు పడ్డ శ్రమ అంత సీతమ్మ వారి కష్టం లాగ తన తప్పు లేకపోయినా బూడిదలో పోసిన పన్నీరు అయ్యింది. బాలు గారు లేకపోతే ఈ పాటలు ఏమయ్యేవో అని ఊహ ఒక భయంకరమైన దుస్స్వప్నం, తెలుగు సినిమా పాటకి.
Good write-up on sad state of telugu
ReplyDeleteGreat write-up indeed.
ReplyDeleteFor these very same reasons, I could not listen to these songs, despite being a big time fan of Ilayaraja and Bapu garu.
Also despite having great respect for Jonnavittula garu for songs like Chali champutunna (kshana kshanam), Lokaale gelavaga (Balu ABCDEFG)
Also, personally I feel ths album doesn't have the magical touch of Ilayaraja as Bapu garu must have insisted on "lyrics-first-tune-later" (like Rudra veena). Just my feeling - no offence meant.