ముందు మాట : Instead of posting same matter every time, providing the link to one of the earlier posts. ( What inspired me to write this series)
Movie Name: సీతారామయ్యగారి మనవరాలు
Producer: V.M.C. Productions
Director: క్రాంతి కుమార్
Music Director: కీరవాణి MM
Singer(s): చిత్ర
Lyrics: వేటూరి సుందరరామ మూర్తి
Year of Release: 1991
కలవారి కోడలు కనకమాలక్ష్మి (కలికి)
అత్తమామల కొలుచు అందాల అతివ
పుట్టిల్లు ఎరుగని పసి పంకజాక్షి
మేనాలు తేలేని మేనకోడల్ని అడగవచ్చా మిమ్ము అడకుతుర్ని
వాల్మీకినే మించు వరస తాతయ్య మా ఇంటికంపించవయ్య మావయ్య ఆ ..ఆ ..(కలికి)
ఆ చేయి ఈ చేయి అత్త కోడలికి
ఆ మాట ఈ మాట పెద్ద కోడలికి
నేటి అత్తమ్మా నాటి కోడలివే
తెచ్చుకో మాయమ్మ నీవు ఆ తెలివి
తలలోని నాలికై తల్లిగా చూసే పూలల్లో దారమై పూజలే చేసే
నీ కంటిపాపలా కాపురం చేసే మా చంటి పాపను మన్నించి పంపు (కలికి)
మసకబడితే నీకు మల్లెపూదండ
తెలవారితే నీకు తేనే నేరెండ
ఎడుమల్లెలు తూగు నీకు ఇల్లాలు
ఏడు జన్మల పంట మా అత్త చాలు
పుట్టగానే పూవు పరిమళిస్తుంది పుట్టింటికే మనసు పరుగు తీస్తుంది తెలుసుకో తెలుసుకో తెలుసుకో తెలుసుకో తెలుసుకోమనసున్న మామ సయ్యోధ్యనేలేటి సాకేతరామా (కలికి)
గడచిన వారం సీతారామయ్య గారి మనవరాలు సినిమా లోని పూసింది పూసింది పున్నాగ గురించి రాయటం జరిగింది. ఈ సినిమా లో వేటూరి సుందరరామ మూర్తి గారు రాసిన అన్ని పాటలు మణి మాణిక్యాలే. అయన రాసిన ఈ "కలికి చిలకల కొలికి" పాట ఆడవాళ్ళ హృదయాలనే కాదు అందరి హృదయాలను కదిలుస్తుంది. ఆయన రాసిన తీరు చూస్తె అందరిని సున్నితం గా మందలించటమే కాదు, ఒక కోడలు ఎలా ఉంటుందో, ఆమె అత్త వారింట్లో పడే కష్టం, పుట్టింటి కోసం వాళ్ళు ఎప్పుడు ఎలా ఎదురు చూస్తారో తెలియచెప్తుంది. అంతే కాదు సీత ఎవరిని ఎలా అడగాలో, ఎలా అడిగితె తన అత్తయ్య ని తనతో పంపిస్తారో అలా అడిగిన విధానం మహాద్భుతం గా చెప్పటం జరుగుతుంది. ఇంతలా ఒక్కొక్కరిని కదిలించి రెండు కుటుంబాలు తిరిగి కలిసే లాగ చేస్తుంది. సినిమా లో సీత పాత్రని చాల గొప్పగా చూపించటానికి ఈ పాట చాల దోహద పడుతుంది. సీత సీతారామయ్యగారి మనవరాలి గా సాధించిన అనేక విజయాలలో ఇది ఉత్తమ స్థానం లో నిలిచి పోవటానికి దోహద పడుతుంది.
సినిమా లో ఈ పాట ముందు జరిగిన సన్నివేశాలు చూస్తె, సీతారామయ్యగారికి, ఆయన వియ్యంకుడికి ఏదో స్థలం విషయం లో వివాదం మొదలు అవుతుంది. గ్రామ పెద్దగా ఆ స్థలం ఇవ్వటానికి సిద్ధపడరు సీతారామయ్య గారు. కాని అదే కావాలని మంకు పట్టు పట్టిన వియ్యంకుడు గర్భవతి అయిన తన కోడలు, సీతారామయ్యగారి అమ్మాయిని తన ఇంటికి తీసుకువెల్లిపోవటానికి సిధపడతాడు. అప్పుడు ఆ అమ్మాయిని ఆపకుండా, పెళ్లి అయిన తరువాత ఎవరు ఎక్కడ ఉండాలో అక్కడ ఉండటమే సమంజసం అని పంపించేస్తారు సీతారామయ్య gaaru. ఆ మాట పట్టింపుతో రెండు కుటుంబాలు ఒకరి ఇంటికి ఇంకొకరు వెళ్ళకుండా ఉండి పోతారు. అమ్మాయిని కూడా తన పుట్టింటికి వెళ్ళకుండా కట్టడి చేస్తారు. ఈ విషయలేమి తెలియని సీత వాళ్ళింటికి వెళ్ళటానికి సీతారామయ్య గారి అనుమతి తీసుకొని కాశితో కారులో బయలుదేరుతుంది. దారిలో ఈ విషయాలన్నీ సీతకి చెప్తాడు కాశి. ఆ ఇంట్లో అందరి తోనూ కలసి పోయి సరదాగా మాట్లాడుతూ తన అత్తయ్య తో పెళ్ళికి ఎందుకు రాలేదు అని అడుగుతుంది సీత, ఆ ప్రశ్నకి బాధతో నాకు రావాలనే ఉందమ్మ, కాని అత్త మామలు అంటూ సమాధానం చెప్పకుండా దాటేస్తుంది అత్తయ్య. కాని విషయం తెలిసిన సీత ఆ ఇంట్లో అందరిని అత్తయ్యని తన ఇంటికి పంపమని కోరుతూ పాట ఆరంభిస్తుంది.
కీరవాణి గారికి చాల పేరు తెచ్చిన సినిమా ఇది. అలాగే చిత్ర కి కూడా. సినిమా లో పాత్ర నిజం గా పాడుతున్నట్టు ఒదిగిపోతుంది ఆమె గాత్రం. ఈ పాటకి చిత్ర కి రాష్ట్ర పురస్కారం లభించింది. ఈ పాట లో చిత్ర గారు పాడిన విధానం చాల అద్భుతం. అందుకనేనేమో సినిమాలో అన్ని పాత్రలు కరిగి కోడలిని పుట్టింటికి పంపించేస్తారు. ఇంక ఈ పాట ని చిత్రీకరించటం లో సఫలం అవుతారు దర్శకులు. పాటకి దగ్గరగా ఉంటుంది ఈ చిత్రీకరణ.
ఈ పాటను చిత్రీకరించిన ఇల్లు చూస్తె తెలుగు వారి ఇంటికి ప్రతీక. అందుకే ఈ పాట ఎప్పుడు చూసిన అందరికి ఏవో అనుభూతులు తిరిగి గుర్తు రాకుండా ఉండవు. ఒకరికి ఒకరు జడలు వెయ్యటం, రోట్లో దంచటం, వేలు నలిగితే నోట్లో పెట్టుకోవటం, పూలు దారం తో మాలగా చెయ్యటం, మండవా లోగిలి, స్తంబాలు, ముఖ్యం గా ఊయల. తెలుగు తనం అడుగడుగునా నిండి ఉన్న పాట. పాట పక్కన పెడితే ఇప్పుడు ఇవ్వన్ని ఏమయిపోతున్నాయో అనే ఆలోచన మిగిల్చే పాట.

ఇంక పాటలోకి వెళ్తే వేటూరి గారు వేసిన పాటల పందిరి లో మనం కూడా కొంచెం సేపు అటు ఇటు నడిచి కొంత ఆహ్లాదం పొందుదాము.
కలికి చిలకల కొలికి మాకు మేనత్త
కలవారి కోడలు కనకమాలక్ష్మి (కలికి)
అత్తమామల కొలుచు అందాల అతివ
పుట్టిల్లు ఎరుగని పసి పంకజాక్షి
మేనాలు తేలేని మేనకోడల్ని అడగవచ్చా మిమ్ము అడకుతుర్ని
వాల్మీకినే మించు వరస తాతయ్య మా ఇంటికంపించవయ్య మావయ్య ఆ ..ఆ ..(కలికి)
ఎప్పుడైనా ఇంటికి పెద్ద తో మొదలు పెట్టటం సాంప్రదాయం. ఇంటికి పెద్ద ఎవరు, ఆ మామయ్య కి తండ్రి అయిన తన తాత గారు. కాబట్టి ఆయనతోనే మొదలు పెడితే సరి. కాని ఆయన్ని ఎలా అడిగేది? దానికి సమాధానం కూడా చెప్తారు వేటూరి గారు. తన అత్తయ్య ఎలాంటిదో ముందు ఆయనకి చెప్పి కొంచెం ఆయన్ని ఆకాశానికి ఎత్తేసి, మా అత్తయ్య కూడా తక్కువేమీ కాదు మా ఇంటికి పంపించవయ్య అనటం లో వేడుకోలు ఉంది, లాలిత్యం ఉంది, సున్నితత్వం ఉంది, పొగడ్త ఉంది. ఇన్ని కలబోసి మొదలు పెడతారు వేటూరి గారు. కలికి చిలకల కొలికి మాకు మేనత్త, అంటే తన అత్తయ్య వనితలకే తల మాణికం, అందునా మీ లాంటి కలవారి కోడలు, సీతారామయ్య గారి కూతురు సాక్షాత్తు లక్ష్మి దేవి, ఇంత మంచి ఉన్నతురాలైన అత్త మామలని దైవం గా కొలుస్తూ, అందరికి అణిగి మణిగి ఉంటూ ఆ ఇంటికే మహాలక్ష్మి అయిన అందమైన మా అత్త, పుట్టిల్లు ఎరుగదు. వేటూరి గారి పదాల అల్లిక ఎంత అందం గా మారుతుందో అత్తయ్య ని వివరించటానికి వాడిన పదాలు చూస్తె తెలుస్తుంది, కలికి చిలకల కొలికి, కనకమాలక్ష్మి, అందాల అతివ, పసి పంకజాక్షి. ఇంత ఉన్నతమైన స్త్రీ మీకు సేవ చేస్తోంది, ఐన మీరు ఆమెకి పుట్టిల్లు ఎరుగకుండా చేస్తున్నారు మీకు భావ్యమేనా అనే ప్రశ్న వేస్తున్నట్టు ఉంటుంది. ఇంక సీత అడుగుతోంది అత్తయ్య తరుపున, మీకు నేను ఏమి ఇచ్చుకోలేను, మేనాలు తేలేను, ఆడ కూతురిగా అడుగుతన్నాను ఆ ఇంటి కోడలి గా అడుగుతున్నాను, సీతమ్మ లాంటి మా అత్త మీ ఇంట్లో ఉంటోంది, వాల్మికినే మించిన వాడివి తాతయ్య, ఇంకా ఆ అమ్మని మా ఇంటికి పంపించవయ్యా,, అంత ఉదాత్తం గా అడుగుతుంటే ఎవరి గుండె కరుగదు? వేటూరి గారి కవిత్వానికి చలించని హృదయాలు ఉంటాయ? ఉండలేవు. ఇక్కడ వేటూరి గారు మేనకోడలి కోసం మేనాలు అని వాడారో, మేనాలు కోసం మేనకోడలిని వాడారో కాని ఎంతో అందం గా ఉంటుంది ఆ వాఖ్యం.
ఆ చేయి ఈ చేయి అత్త కోడలికి
ఆ మాట ఈ మాట పెద్ద కోడలికి
నేటి అత్తమ్మా నాటి కోడలివే
తెచ్చుకో మాయమ్మ నీవు ఆ తెలివి
తలలోని నాలికై తల్లిగా చూసే పూలల్లో దారమై పూజలే చేసే
నీ కంటిపాపలా కాపురం చేసే మా చంటి పాపను మన్నించి పంపు (కలికి)
సరే తాత గారు అయ్యారు ఇంకా ఇంట్లో రెండొవ పెద్ద అత్తకి అత్తగారు, సరే ఇంక అక్కడికి వెళ్తారు వేటూరి గారు. దర్శకులు కూడా పాటకి అనుగుణంగా సాగుతారు. ఒక్క సారి ఇంట్లోకి కోడలు అడుగు పెడితే పని అంతా కోడలిది, పెత్తనం అంత అత్తగారిది. అప్పటి వరకు ఇంటికి కావాల్సినవి అన్ని చేసిన అత్త గారి పనులన్నీకోడలు చెయ్యటం మొదలు అవుతుంది. అలాగ అత్తగారి రెండు చేతులు అయి మసలుకుంటుంది కోడలు. కాని ఏ మాట వచ్చిన ముందు అనేది పెద్ద కోడలినే. చిన్న కోడళ్ళు ఉన్న వాళ్ళకి కొంచెం కనికరం ఉంటుంది. అందుకే పెద్ద కోడలు పని చాల కష్టం ఎవరింట్లో ఐన. మొత్తం కుటుంబం లో జరిగేవి అంత సుళువుగా చెప్పేస్తారు వేటూరి గారు. అలా చెప్తూ చిన్నగా మందలిస్తూ ఆలోచన రేకేత్తిస్తారు అత్తగారికి. ప్రపంచం లోని అత్త కోడళ్ళ మద్య ఉన్న కలహాలు కాని మనస్పర్థలు కాని, వేటూరి గారు చెప్పిన ఈ ఒక్క విషయం పాటిస్తే చాల తగ్గుతాయేమో. ఒక అత్త తను కోడలిగా ఎంత అనుభవించిందో అది గుర్తు ఎరిగి మసలు కుంటే, తర తరాలు మధ్య అంతరాలు తగ్గుతాయేమో. నేటి అత్తమ్మ నాటి కోడలివే, తెచుకో మాయమ్మ నీవు ఆ తెలివి అని ఎంత సున్నితం గా హేచ్చరిస్తారో ( ఇక్కడ దర్శకుడు ఆ పాత్ర ఆలోచన లో పడినట్టు చూపిస్తారు), అల అంటూనే మా అత్త నీ తలలో నాలిక లాగ ఉంది, అంటే అత్త మనసు ఎరిగి మెదిలే కోడలు మా అత్త, నీ ఆలోచనలని తన మాటలతో చేతలతో నిన్ను తల్లిలాగా చూసుకుంటోంది. అలాగే పూలు ఎన్ని ఉన్న దండ కావాల్సి వస్తే దారం కావాలి, ఇంక కుటుంబం లో ఎంత మంది ఉన్న ఆ కుటుంబం సవ్యం గా నడవాలి అంటే మా అత్త లాంటి కోడలు కావాలి, మా అత్త అంత కంటే సేవ చేస్తోంది మీ కుటుంబానికి. తన కాపురం చేసుకుంటున్న తన అత్త మమల్ని కంటికి రెప్పలాగా కాపాడుకుంటోంది, ఇంక మీకు ఏమి కావాలి, ఆ అత్త ఎంత ఎదిగిన మాకు ఇంకా మా ఇంటి పాపే, అలాగ ఇన్ని సుగుణాలున్న మా అత్తని ఇంకా ఏమైనా తప్పులుంటే మన్నించి మా ఇంటికి పంపించు అని హృద్యం గా అడుగుతుంది సీత.

పుట్టగానే
పూవు పరిమళిస్తుంది పుట్టింటికే మనసు పరుగు తీస్తుంది తెలుసుకో తెలుసుకో
తెలుసుకో తెలుసుకో తెలుసుకోమనసున్న మామ సయ్యోధ్యనేలేటి సాకేతరామా (కలికి)
ఇంక వేటూరి గారు మిగిలిన మామ దగ్గరకి వెళ్తారు, మనం కూడా వెళ్దాం, అడుగుదాం. ఏమని అంటే వేటూరి గారు ఏమంటే అదే. మగవాడు పగలు ఎంత బెట్టు చూపించినా ఎంత పట్టు చూపించిన చీకటి పడితే అంతా మారిపోతుంది. శృంగార విషయం సున్నితమైన, చాటుగా చెప్తారు, ఎంతైనా అల అడుగుతున్నది అమ్మాయి కదా, అందుకనే ఆ పదాలు, మల్లె పూదండ, తేనే నీరెండ వాడతారు. భార్యకి ఉన్నలక్షణాలు అన్ని మా అత్త లో ఉన్నాయి, ఏడు మల్లెలు సరి తూగుతుంది మా అత్త అంటే, అంత స్వచ్చమైన, సున్నితమైన మా అత్త, నీకు ఎన్నో జన్మల నోముల పంట. ఎంత పేరు తెచ్చుకున్న, ఆడదాని మనసు ఎప్పుడు పుట్టింటి కోసమే పరితపిస్తుంది. ఈ విషయం తెలుసుకో రాముడి లాంటి మామ, అనటం లో మా అత్త సీతమ్మ లాంటిదే అని చెప్పటమే. ఇంకో విషయం ఇక్కడ మామ కి సలహానే ఇస్తుంది కాని పంపించ మని అర్థించటం ఉండదు ఈ చరణం లో. అదే వేటూరి గారి చమత్కారం. ఒక కుటుంబం లో ఎవరిని ఎలా అడగాలో అన్న విషయం కూడా చెప్పినట్టు అయ్యింది. ఇంటికి పెద్దాయనని అడగొచ్చా అంటూనే అడుగుతారు, ఇంక అత్తగారిని మన్నించమని అడుగుతారు, చివరిగా మామకి సలహా మాత్రమె. ఇంతటి ఆలోచనలతో కూడిన పాటని రాయటానికి ఎంత సమయం తీసుకున్నారో? మొత్తం కథ, కథనం తెలిస్తే కాని, అది తెలిసి సందర్భోచితం గా రాయటం సామాన్యమైన విషయం కాదు.
ఇంతటి సందర్భోచితమైన పాట అందున ఇంతటి ఉన్నతమైన భావం, సరళమైన పదజాలం తో అందరిని ఆకట్టుకునేల చేయ్యగాలటం ఒక్క వేటూరి గారికే సాధ్యం అనిపిస్తుంది. వేటూరి గారు రాసిన కొన్ని పాటలతో ఆయనే మీద ఒక అభిప్రాయం ఏర్పరచుకున్న వాళ్ళు చాల మంది ఉన్నారు కాని, ఇలాంటి పాటలు వింటుంటే అందరు అనేది నిజమే, ఆయన కాలానికి అన్ని వైపులా పదునే. సిని విలాకాసంలో ఒక చంద్రుడే.
కొసమెరుపు
ఈ సినిమా లో ఇంక మిగితా పాటలు కూడా ఒకదానికి ఇంకోటి పోటి పడతాయి. వెలుగు రేఖల వారు, సమయానికి తగు పాట, కూడా ఎంతో అద్భుతం గా రాసారు. ఇంక మాయాబజారు లోని "సుందరి నీ వంటి" కి పెరోడి గా " సుందరి నీ వంటి స్వీటు స్వరూపము వేర్వేరు సెర్చిన లేదు కదా" అన్న కామెడీ పాట కూడా అదే సుందరం గా రాసి తన నామదేయానికి సార్థకత చేకూరుస్తారు వేటూరి సుందరరామమూర్తి గారు.