ముందు మాట : Instead of posting same matter every time, providing the link to one of the earlier posts. ( What inspired me to write this series)
Movie Name: Peddarikam
Producer/Director: AM Ratnam
Music Director: Raaj-Koti
Singer(s): KJ Yesudas, Swarnalata
Lyrics: Bhuvanachandra
Year of Release: 1992
ఇదేలే తరతరాల చరితం
జ్వలించే జీవితాల కధనం ||ఇదేలే ||
పగేమో ప్రాణమయ్యేనా
ప్రేమలే దూరమయ్యేనా
నిరాశే నింగికెగసేనా
ఆశలే రాలిపోయేనా ఇదేలే ||
ఒడిలో పెరిగిన చిన్నారిని
ఎరగా చేసినదా ద్వేషము
కధ మారదా ఈ బలి ఆగదా
మనిషే పశువుగా మారితే
కసిగా శిశువుని కుమ్మితే(2)ఆభమో శుభమో
ఎరుగని వలపులు ఓడిపోయేనా ||ఇదేలే ||
విరిసి విరియని పూదోటలో
రగిలే మంటలు చల్లరవా
అర్పేదెలా ఓదార్చేదెలా
నీరే నిప్పుగ మారితే
వెలుగే చీకటి రువ్వితే(2)పొగలో సెగలో
మమతల పూవులు కాలిపోయేనా ||ఇదేలే ||
జ్వలించే జీవితాల కధనం ||ఇదేలే ||
పగేమో ప్రాణమయ్యేనా
ప్రేమలే దూరమయ్యేనా
నిరాశే నింగికెగసేనా
ఆశలే రాలిపోయేనా ఇదేలే ||
ఒడిలో పెరిగిన చిన్నారిని
ఎరగా చేసినదా ద్వేషము
కధ మారదా ఈ బలి ఆగదా
మనిషే పశువుగా మారితే
కసిగా శిశువుని కుమ్మితే(2)ఆభమో శుభమో
ఎరుగని వలపులు ఓడిపోయేనా ||ఇదేలే ||
విరిసి విరియని పూదోటలో
రగిలే మంటలు చల్లరవా
అర్పేదెలా ఓదార్చేదెలా
నీరే నిప్పుగ మారితే
వెలుగే చీకటి రువ్వితే(2)పొగలో సెగలో
మమతల పూవులు కాలిపోయేనా ||ఇదేలే ||
సంగీతం శబ్దం అవుతున్న వేళ పాట మాటగా మారుతోంది. ఈ మధ్య కాలం లో
సంగీతం, పాట వింత పోకడలు పోతోంది, సంగీతం అంటే కీబోర్డ్ నుంచి వస్తోంది అనే
వాళ్ళు సంగీత దర్శకులు అవుతున్నారు, పాట అంటే ప్రాస కోసం తయ్యారం, కంగారం
అని రాసే వాళ్ళు పాటల రచయితలు గా పసిద్ది చెందుతున్నారు, అవార్డ్స్
పొందుతున్నారు. శబ్ద ఘోష లో మాట కరువవుతోంది. ఇంక గాయకులూ వాళ్ళు ఏమి
పాడుతున్నారో వాళ్ళకే తెలియదు, పాటలో ఏమి రాసుందో వాళ్ళకి అనవసరం. ఇంక
పాటకి కావాల్సిన భావం లేక మాట, శబ్దం గా మారుతోంది. పెను తుఫాను తలొంచి
చూసే తోలి నిప్పు కణం అతడే అన్న హీరో గురించి రాసిన పాట ఆ పాత్రని ఎంత
ఎత్తుకి తీసుకు వెళ్తుందో మనం చూసాం కాని, ఫాన్స్ కోసం వాళ్ళకి నచ్చే
విధంగా హీరో కి వీలు అయినన్ని
నక్షత్రాలు ఇచ్చెయ్యటం చూస్తున్నాం. పాట అంటే కథలోని కథానాయకుని పాత్రని ఉన్నత స్థితికి తీసుకు వెళ్ళాలి కాని అది నటించే నటున్ని కాదు అన్న నిజం మనవాళ్ళు ఎప్పుడు తెల్సుకుంటారో? ఇటువంటి వింత లక్షణాలు పాటలో చోటు
చేస్కుంటున్న వేళల్లో ఇటువంటి పాటలు వింటే పాట అంటే ఏంటో అర్థం అవుతుంది.
పెద్దరికం సినిమాకి ఈ పాట తలమానిక. పాట మనసులని కదిలించి కరిగిస్తుంది
అంటారు, ఈ పాట ఆ కోవలోకి చెందుతుంది. ఏసుదాస్ గారి గురించి చెప్పాలంటే
అర్హత ఉండాలి, ఆయన ఈ పాటకి ప్రాణం పోసారు, మన హృదయాన్ని ద్రవింప చేస్తారు. ఇంక ఈ పాటకి ఏసుదాస్ గారు న్యాయం చేసినట్టు ఎవరు చెయ్యలేరు. అలాగే స్వర్ణలత మంచి సహకారం అందించారు. భావ యుక్తమైన పాటలు పాడటం లో పాత తరం వాళ్ళ దగ్గర ఈ తరం వాళ్ళు ఎంతైనా నేర్చుకోవాలి. ఒక పాట మళ్ళి మళ్ళి ఒక శ్రోత వినాలంటే ఏమేమి కావాలో ఈ తరం వాళ్ళ రాదు, తెలియదు.
పాట అంటే అభిమానుల కోసమో లేక ఎవరినో సంతృప్తి పరచటానికో కాదు. కథలో ఇమడి పోవాలి, కథకి బలం చేకూరాలి, ప్రేక్షకులు ఆ పాటని అనుభవించాలి అప్పుడే ఆ పాటకి ప్రాణం వస్తుంది. ఆ పాటకి సంగీత దర్శకులు, గాయకులు న్యాయం చేకూరిస్తే ఆ పాటకి ఆయుషు పోసినట్టు అవుతుంది. అప్పడే అది ప్రేక్షకులకి చేరుతుంది. ఈ సినిమాలో అన్ని పాటలు అత్యంత మనోహరమైనవి. రాజ్-కోటి ద్వయం చేసిన సినిమాలలో ఉన్నత స్థానం కలిగిన సినిమాలలో ఒకటి గా నిలుస్తుంది. మిగితా పాటలు "ప్రియతమా ప్రియతమా", " ముద్దుల జానకి" అద్భుతమైన పాటలు. ఎన్ని సార్లు విన్న మరల వినాలనిపించే పాటలు.
ఈ సినిమా కథకి వస్తే మలయాళ సినిమా "గాడ్ ఫాదర్" అనే సినిమా ఆధారం గా తీసిన సినిమా. ఇందులో నటించిన పాత్రలు అన్ని కలకాలం నిలిచి పోయే పాత్రలు. ఈ సినిమాలో నటించిన వాళ్లకి ఒక జీవితానికి సరిపోయే గుర్తింపు తెచ్చిన సినిమా. ఒక చిన్న సంఘటన వల్ల ఇద్దరు వ్యక్తుల మధ్య చెలరేగిన పగ ఆ రెండు కుటుంబాలు మధ్య పచ్చ గడ్డి వేస్తె భగ్గు మనే స్తాయికి చేరి, ఒకరి నీడ ఇంకొకళ్ళ మీద పడకుండా చూసుకుంటారు. అడుగడుగునా అవతలి వారి మీద పగ ఎలా తీర్చుకోవల అని చూస్తూ ఉంటారు. ఒక కుటుంబానికి పెద్ద బసవ పున్నమ్మ కాగ ఇంకో కుటుంబానికి పర్వతనేని పరసురామయ్య. పరసురామయ్య ఇంట్లో స్త్రీ కి ప్రవేశం లేకుండా చేసుకుంటాడు ఎక్కడ స్త్రీ కుటుంబాన్ని విడగోద్తుందో అని. ఉన్న నలుగురు తనయులకి పెళ్లి చెయ్యకుండా పెంచుతాడు. వీళ్ళ కుటుంబాన్ని ఎలాగైనా చేదించాలి అని బసవపున్నమ్మ తన మనువరాలు జానకి ని కృష్ణ మోహన్ (కథానాయకుని) మీదకి ప్రేమ నటించి తద్వారా అతను ప్రేమలో పడితే వాళ్ళ కుటుంబం మీద ఆధిపత్యం లభిస్తుంది కదా అని తన మనుమరాలిని ఉసి కోల్పుతుంది,. కాని జానకి నిజం గా కృష్ణమోహన్ ప్రేమ లో పడుతుంది. అప్పుడు జరిగిన గొడవల నేపధ్యం లో ఈ పాత వస్తుంది. ఆ తరువాత వాళ్ళ ద్వేషాలు, పగలు ఏమవుతాయి, వాళ్ళ ప్రేమ ఏమవుతుంది అన్నది కథ. సినిమా చూసి ఆనందించ వలసినదే. హాస్యం, డ్రామా కలిపి వచ్చిన కుటుంబ కథా చిత్రం అందరిని ఆహ్లాద పరచింది ఈ సినిమా.
ఈ పాట గొప్పతనం ఏమిటంటే అంతులేని అర్థం ఉన్న సరళమైన సాహిత్యం. ఆ సాహిత్యానికి అత్యంత ఉన్నతమైన సంగీతం తోడు అవ్వటం. చిన్న చిన్న పదాలతో కథ మొత్తం చెప్పే పాట. ఎక్కడ గ్రాంధికం అయిన పదాలు కాని, కఠిన శబ్దాలు లేవు. కావి చివరికి ఒక శక్తిమంతమైన పాటగా మన ముందు ఉంటుంది. సంగీత ప్రియులకి ఇటువంటి పాటలు ఎదురయినప్పుడు ఇప్పుడు మనము ఏమి కోల్పోతున్నామో తెలుస్తుంది శబ్ద గోషలో పడి, కొత్తదనం అంటే ఏంటో తెలియకుండా ఆ కొత్తదనం కోసం వెంపర్లాడటం, తెలుగు పదాలు పలుకలేని వాళ్ళ చేత పాటలు పాడించటం ఇలాగ చెప్పుకుంటే పొతే అంతులేని తప్పులు చేస్తూ పోతున్నాం.
ఇంక మనం పాటలోకి వెళ్దాము.
ఇదేలే తరతరాల చరితం
జ్వలించే జీవితాల కధనం ||ఇదేలే ||
పగేమో ప్రాణమయ్యేనా
ప్రేమలే దూరమయ్యేనా
నిరాశే నింగికెగసేనా
ఆశలే రాలిపోయేనా
మన భారతీయ చరిత్ర చూస్తె ఎక్కడ చూసిన కుటుంబాల మధ్య మొదలుకొని గ్రామాలు, ఊర్లు రాజ్యాల ఇలాగ అనేక కథలు చూస్తాం వైరము, విద్వేషాలు, పగ ప్రతీకారాలతో అనేక జీవితాలు నష్టపోయిన సందర్భాలు .కొన్ని కుటుంబాల మధ్య పగలు చూస్తె, తర తరాల మధ్య అలాగా కొనసాగుతూనే ఉంటాయి. ఎందుకు మొదలవుతాయో ఎందుకు పెరిగి అలా కొనసాగుతూనే ఉంటాయో మనకి అర్థం కాదు.. సీమ పగలు ఇవ్వాల్టికి ప్రత్యక్షం గా చూస్తాం. దీని వల్ల అనేకమైన నష్టాలు కలుగుతాయి అని తెల్సిన కూడా పగ కొనసాగటం వాళ్ళ లక్ష్యం. అవతల వాళ్ళ కుటుంబం నష్టపోవటం కోసం ఏది చెయ్య టానికైన సిద్దపడటం అలాగే తమ వారసులని అదే దారిలో పెంచటం చూసాము,, చూస్తున్నాం. వీళ్ళ జీవితాలలో పగకి ఇచ్చిన ప్రాదాన్యం, ప్రేమ మీద ఉండదు, అలాగే వాళ్ళ జీవితాలు మాడి మసి అయిపోయిన వాళ్ళకి ఏమి అనిపించదు ఆ పగ సాదించటం కోసం జీవితాన్ని నాశనం చేసుకుంటారు. అటువంటి వీళ్ళ జీవితం నాలుగు మాటలో క్లుప్తం గా చెప్పటం ఈ పాట గొప్పతనం. ఈ సినిమాలో కూడా కొన్ని ఏళ్ళ చరిత్ర గల పగ బసవ పున్నమ్మ, పరసురామయ్య ల మధ్య చూస్తాం. అది వాళ్ళ జీవితాలను తగుల పెట్టి నాశనం చేసేసింది. అదే వీళ్ళిద్దరి చరిత్ర వాళ్ళ కథ. అవతల వాళ్ళ ఉనికినే సహించని వాళ్ళు తమ జీవితాలలో అనేకం కోల్పోయినా కూడా వాళ్ళకి పగ మీద ఉన్న ఆసక్తి, దాన్ని తమ వారసులలో పెంపొందించే ఆలోచనలతో సతమత మవుతు జీవితం లో ఆనందం కోల్పోయిన పెద్దగా పట్టించుకోరు. ఎప్పుడు ఏదో కోల్పయిన నిరాశలో అందరిపట్ల ప్రేమ లేక బ్రతుకుతారు. ఈ విషయం వాళ్ళ పాత్రల ఔచిత్యం మనకి తెలియచెప్పటం లో సఫలీకృతం అవుతారు రచయిత. ఇక్కడవరకు చూస్తె మనం ఒకటి గమనించాలి పాటలో. ఏసుదాస్ గారి గళం లో ఉన్న మాధుర్యం, ఆ గొంతులో పలికిన భావం, ఆ తరువాత గాలానికి ఉన్న గాంభీర్యం అన్నింటికీ మించి మాటలో స్పష్టత. ఏ పదము ఎక్కడ వరకు పాడాలో ఎక్కడ ఆపాలో ఇవ్వన్ని చూస్తె ఈ పాత ఒక నిఘంటువు సంగీతం మీద ఆసక్తి ఉన్న వాళ్లకి, పాటలు పాడాలనే అభిలాష ఉన్నవాళ్ళకి. ఎక్కడ శబ్ద కాలుష్యం లేకుండా, సంగీత సహకారం అందిస్తారు రాజ్-కోటి. ఇటువంటి గాయకుల గొంతు వినే భాగ్యం మనకి లేదు అనే చెడు నిజం మనలోని నిరాశ ఆకాశానికి అంటుకుంటుంది ఒక్కోసారి.
ఒడిలో పెరిగిన చిన్నారిని
ఎరగా చేసినదా ద్వేషము
కధ మారదా ఈ బలి ఆగదా
మనిషే పశువుగా మారితే
కసిగా శిశువుని కుమ్మితే(2)ఆభమో శుభమో
ఎరుగని వలపులు ఓడిపోయేనా
విరిసి విరియని పూదోటలో
రగిలే మంటలు చల్లరవా
అర్పేదెలా ఓదార్చేదెలా
నీరే నిప్పుగ మారితే
వెలుగే చీకటి రువ్వితే(2)పొగలో సెగలో
మమతల పూవులు కాలిపోయేనా ||ఇదేలే ||
ప్రతి ఇల్లు ఒక పొదరిల్లె , ఒక పూదోటే . అందులోని చిన్న పిల్లలు విరిసి విరియని మొగ్గలె . అందమైన పొదరింటిలో కల్లోలం ఊహించలేము. అటువంటి ఇంటిలో ఈ మంటలు చల్లారక పోవటం అనేది బాధాకరమే. అందుకనే ఈ ఆలోచన కథానాయకుడు ఊహించటం పాట లో చూస్తాము. వీళ్ళిద్దరి ఆలోచనలు ఇక్కడ ఎంత చక్కగా రాస్తారో రచయిత. మనకి మంచి చేసి పెంచాల్సిన మన వాళ్ళే ఇలాగ మనకి అడ్డంకి గా మారితే ఈ సమస్యకి పరిష్కారం ఏమిటి? నీరు మంటలు ఆర్పుతుంది, చల్లదనం తెస్తుంది, అటు వంటిది నీరు నిప్పు రాజేస్తే ఆ మంటలు ఆర్పెదేలా? ఇంక వెలుగు జీవితం లో ఆనందం చేకూరుస్తుంది, కాని అది చీకటి గా మారితే మిగిలెడు నిరాశ , నిస్పృహలతో కూడిన దుఖం మిగుల్స్తుంది. ప్రేమ లో పడిన ఈ జంట పొదరింటిలో పరిమళం వెదజల్లే పువ్వులు, అటువంటి వాటిని ఈ పగ మంట, ద్వేషం అనే సెగ కాల్చేస్తే ఆ మంటల్ని ఎలాగా ఆపాలి, ఆ జంటని ఎలాగా ఓడర్చాలి ? ప్రేక్షకుడికి ఒక అద్భుతమైన అనుభూతి మిగిల్చి గుడ్నే కదిలించి కన్నీరు కారుస్తుంది ఈ పాట.
కొసమెరుపు: ఈ సినిమా సుకన్య కి మొదటి సినిమా. అత్యంత పేరు ప్రఖ్యాతలు తెచిన సినిమా ఇది. ఇంక మళయాళ మాతృక అయినా రత్నం గారు తెలుగు తనానికి దగ్గరగా తీసి అందరిని ఆశ్చర్య పరిచారు. ఇంక పిళ్ళై గారు మళయాలం లోనే కాక తెలుగు లో కూడా అదే పాత్ర పోషించి అందరిని మెప్పించారు. జగపతి బాబు కి స్నేహితుడి గా నటించిన సుధాకర్ కి ఈ సినిమా ఒక మైలు రాయి. ఇలాగ అనేకమైన అలరించే లక్షణాలు కలిగిన ఈ సినిమా చిన్న సినిమా అయిన చాల పెద్ద విజయం సాధించింది. ఈ సినిమాకి పాటల రచయిత ఎవరో ఆ వివరాలు అందుబాటులో లేవు. ఎవరికైనా తెలిస్తే ఈ-మెయిల్ చెయ్యగలరు. ( Thanks to Manohar, updated the information)

ఇక్కడ రచయిత మాటల పొందిక అత్యద్బుతం మాటల గారడీ ఇంద్రజాలం. ఎక్కడ హంగులు ఆర్భాటాలు లేకుండా సరళ భాషలో అనంతమైన భావం నిండి ఉంటుంది. అందుకే ఇటువంటి భావ యుక్తమైన పాట మనకి తయారు అయ్యింది, బసపున్నమ్మ గారి అత్యంత గారాల పట్టి జానకి. తనే దగ్గర ఉండి పెంచుకున్న మనువరాలిని తన పగ కోసం ఎరగా వేసి తన శత్రువు కుటుంబం లోని వ్యక్తీ మీదకి ఉసి కోల్పుతుంది. అంటే కాని తన మనువరాలి మనసు ఏంటి, అది ఆమె మీద ఎటువంటి పర్యవసానం కలుగుతుంది, ఇవన్ని ఆలోచించదు, ఎందుకంటే ఆమెకి తన మనుమరాలు కంటే తన పేజి ముఖ్యం కాబట్టి. పల్లవి లో తర తరాల చరితం అన్న రచయిత ఈ కథలు మారావా అని ప్రశ్నిస్తారు ఎందుకంటే ఇది అనాది వస్తోంది కాబట్టి. పెద్దలు చిన్న పిల్లల్ని తమ పగ వైపు మరలించి వాళ్ళని అదే దారిలో పయనింప చేస్తారు కాబట్టి. ఇలాగ వాళ్ళ పగలు వాళ్లతో ఆపితే తమ పిల్లల్ని మార్చకపోతే ఈ చరిత్రలు ఇలాగ మారవు. ఈ కనువిప్పు ఎప్పటికి కలుగుతుందో జనాలకి. ఎంత తమ సొంతం ఐన, తమ పగ, ప్రతీకారం తమతోనే ఉంచితే ఎలాగ ఉంటుందో అందరు ఆలోచిస్తే అంతా సంతోషం గా ఉంటారు అనటం లో సందేహం లేదు. ఇంకా ఈ పాట కి ముందు అందరు కొట్టుకుంటూ ఉంటారు, మధ్యలో వచ్చి ఆపెంతవరకు. మనిషి వేరే మనిషి ని కొట్టాలి అంటే మానవత్వం మరియు విలక్షణ కోల్పోయి పశువుగా మారితే తప్ప వేరే మనిషినికి హాని చెయ్యలేడు. ఇక్కడ అంట పెద్ద గొడవ అందులో నడి రోడ్డు మీద వివేకం కోల్పోయి కొట్టుకుంటే పసువుకాక మరేమిటి ? అందుకనే ఈ పదం వాడారు రచయిత. ఇక్కడ శిశువు అంటే కథానాయకుడే. ఇంకా ప్రపంచానుభవం లేని వాళ్ళు శిశువులే. వీళ్ళ గొడవలకి వాళ్ళ ప్రేమ వొడి పోయింది కదా హత విధి,, ఈ క్షణం ప్రతి ప్రేక్షకుడి మనస్సు బాధ తో కలుక్కు మనటం సహజం