ముందు మాట : Instead of posting same matter every time, providing the link to one of the earlier posts. ( What inspired me to write this series)
Album Name: శ్రీ రామ గానామృతం
అల నీల గగనమ్ము అరునారుణం ఆయే..
కులదైవం ముదయాద్రి కొలువుండ పయనించే
కొలను తామర లల్లి పులకించి విరిచినవి
నలినాబ్జ ఇక నీదు నయనాలు విడవలెను.. || మేలుకో శ్రీ రామ ||
మరల విశ్వామిత్ర మహర్షే మేల్కొలిపి
నరసార్దూల నిన్ను నందించ వలయునా..
తరుణీ సీతమ్మ తల్లి గృహ విధుల మునిగింది,
తిరిగి శయనిన్చేవు మర్యాద కాదయ్య... || మేలుకో శ్రీ రామ ||
పద యుగళి సేవించ ప్రణతులే యొనరించ
వదనార విన్దమ్ము ముదమార పరికించ
బంగారు వాకిళ్ళ పడిగాపులయి ఉన్న
భక్త కోటిని వేగ పాలించ లేవయ్య || మేలుకో శ్రీ రామ ||
పద యుగళి సేవించ ప్రణతులే యొనరించ
వదనార విన్దమ్ము ముదమార పరికించ
బంగారు వాకిళ్ళ పడిగాపులయి ఉన్న
భక్త కోటిని వేగ పాలించ లేవయ్య || మేలుకో శ్రీ రామ ||
Album Name: శ్రీ రామ గానామృతం
Song Name : మేలుకో శ్రీ రామ
Music Director: KV మహదేవన్
Singer(s): SP బాలసుబ్రహ్మణ్యం
Lyrics: ఆరుద్ర
మేలుకో మేలుకో మేలైన గుణ ధామ..అల నీల గగనమ్ము అరునారుణం ఆయే..
కులదైవం ముదయాద్రి కొలువుండ పయనించే
కొలను తామర లల్లి పులకించి విరిచినవి
నలినాబ్జ ఇక నీదు నయనాలు విడవలెను.. || మేలుకో శ్రీ రామ ||
మరల విశ్వామిత్ర మహర్షే మేల్కొలిపి
నరసార్దూల నిన్ను నందించ వలయునా..
తరుణీ సీతమ్మ తల్లి గృహ విధుల మునిగింది,
తిరిగి శయనిన్చేవు మర్యాద కాదయ్య... || మేలుకో శ్రీ రామ ||
పద యుగళి సేవించ ప్రణతులే యొనరించ
వదనార విన్దమ్ము ముదమార పరికించ
బంగారు వాకిళ్ళ పడిగాపులయి ఉన్న
భక్త కోటిని వేగ పాలించ లేవయ్య || మేలుకో శ్రీ రామ ||
ప్రక్రుతి లో అణువణువునా సంగీతం ఉంది. ఈ సంగీతం ఎవరిని ఎలా కదిలిస్తుందో ఎవరికీ తెలియదు. మేఘ ఘర్జన లో. వాన చినుకులో, సెలయేటి సందడి లో, వాగు హోరులో,, నది జోరులో, సముద్రపు అలల లో, ఇంకా ఆకు కదలిక లో, పక్షి గొంతులో, ఇలా చెప్పుకుంటే ఎన్నో లయ బద్దం గా మనిషిని అలరిస్తాయి. సంగీతంకు మనిషిని ఏదైనా చెయ్యగల శక్తి ఉంది. అలాగే పాట కూడా. మనిషిని ఉల్లాసపరుస్తుంది,, ఉత్సాహపరుస్తుంది,, బాధ కలిగిస్తుంది,, ఆవేశ పరుస్తుంది,, ఆలోచింపచేస్తుంది,, మనసు ,కరిగిస్తుంది గుండె నిండా అన్ని భావాలతో నింపేస్తుంది.. అంతటి శక్తి ఉన్న వేల పాటలలో కొన్ని పాటలు విన్న మరుక్షణం మనిషి జీవితం లో ఒక స్థానం సంపాదిస్తుంది.. అటువంటి పాటలలో "శ్రీరామ గానామృతం"" లోని మేలుకో శ్రీ రామ ఒకటి.. ఆ పాటకి ఉన్న శక్తి ఏమిటో అర్థం అయ్యేలా చెప్పటం చాల కష్టం, అనుభవిస్తే తప్ప. దేవ గానం చేస్తూ గందర్వులు దైవ లోకం లో ఉంటారని వింటాం కాని మనకి వాళ్ళ గొప్పతనం ఏమిటో, వాళ్ళ గొంతు ఎలాగా ఉంటుందో తెలియదు. అలాగే అమృతం అంటే ఎవరి ఆలోచనా శక్తికి తగ్గ అది ఎలాగ ఉంటుందో ఊహించటమే కాని దాని రుచి ఏమిటో ఎవరికీ తెలియదు. అందుకే అత్యుత్తమ లక్షణాలు కలిగి ఉండి మనకు అత్యంత ప్రీతి కలిగించే లక్షణం ఉన్న దాన్ని అమృతం అంటాం. ఈ పాటలకి గానా అమృతం అనటం ఎంత సమంజసమో అవి వింటే అర్థం అవుతుంది.
రామ నామము భారత నాట అత్యంత తీయని నామముగా అందరికి సుపరిచితమే..రాముడు లాంటి ఒక మనిషి ఎప్పుడు పుట్టలేదు పుట్టబోడు ఎందుకంటే ఒక మనిషి ధర్మానుసారం ఎలా నడవాలో ఆచరించి చూపిన వ్యక్తి. అందుకే ఆ నామానికి ఆ వ్యక్తికీ అంతటి ఖ్యాతి. మనిషికి దేవుడు అనే వాడు ఒక ప్రశ్న. తమకి అంతు చిక్కని దేవుడిని దేవుడి లక్షణాలు ఉన్న వాళ్ళని దేవుడుగా భావిస్తాడు.. అందుకనే రాముడు దేవుడయ్యాడు. ఎందరో ఆ రాముని నామం జపిస్తూ తరించిన వారే.
పాట ఎటువంటిదైన సరిగ్గా పాడటం చాల కష్టం. ఎవరు పడితే వాళ్ళు పాడుకో వచ్చు కాని వేరే వాళ్ళు వినాలంటే పాటకి తగ్గ లక్షణాలు కావాలి. ఈ మధ్య అన్ని సినిమా పాటల్లో తప్పులు దొర్లటం ,చూస్తున్నాము అవి దురదృష్టకరమైనా క్షమించ దగ్గ తప్పులే వినటానికి ఇంపుగా ఉంటె వింటాము లేకపోతె వదిలేస్తాము.. కాని భక్తి పాటలు తప్పులు దొర్లటానికి వీలు లేని పాటలు.. అపశ్రుతి, ఉచ్చారణ దోషాలు, భావ దోషాలు ఏవి వీలు కాని పాటలు. ఈ పాటలు ఎవరు పడితే వాళ్ళు పాడితే ఆ భక్తీ భావం లేక పొతే ఆ పాత సాధారణ పాటగా మిగిలి పోతుంది.. భక్తి పాట భక్తున్ని పరవసింప చెయ్యాలి. అప్పుడే ఆ పాటకి సార్ధకత చేకూరుతుంది. అందులో మంత్రాలు పాటలుగా పాడితే అందులో ఉచ్చారణ దోషాలు ఉంటె మంత్రం వికటించే ప్రమాదం కూడా ఉంది.. అందుకే పాడేవాళ్ళు జాగ్రత్తగా పాడాలి. శంకర్ మహదేవన్ మంచి గాయకుడే కాని, తెలియక చేసినా తెలిసి చేసిన తప్పు తప్పే, గణేశ స్తుతి ( గణేశాయ ధీమహి ) పాడినప్పుడు అనేక ఉచ్చారణ దోషాలు ఉన్నాయి. బాల చంద్రాయ కి "భాల" చంద్రాయ అని పాడతాడు.. గీత కి ఘీత, గజేశానాయ కి గజేషానాయ అని పాడటం ఇలాగ చూస్తె చాల ఉన్నాయి. ఒక భక్తి పాట కళ్ళు మూసుకొని వింటే తన్మయత్వం చెందాలి.. ఇలాంటి తప్పులు మనసు కలుక్కు మానకూడదు. అందుకే తెలుగు/సంస్కృతం తెల్సిన వాళ్ళు, సరిగ్గా ఉచ్చారణ చేసేవాళ్ళు వాళ్ళు భక్తి పాటలు పాడితే అత్యంత సహజం గా ఉంది మనసులో హత్తుకు పోతాయి.. ఘంటసాల,, బాలు, బాల మురళి కృష్ణ లాంటి గాన గంధర్వులు పాడిన పాటలు వినగలగటం మన అదృష్టం..
శ్రీ రామ గానామృతం భక్తి పాటలు షుమారు 40 సంవత్సరాల క్రితం KV మహదేవన్ గారి స్వర కల్పనలో ఆరుద్ర గారి పద రచన లో(అన్నమాచర్య కీర్తనలు 1-2మినహా), బాలు,, సుశీలగారు పాడగా తెలుగు నాట బాగా ప్రాచుర్యం పొందాయి. కాని ఇవి ఇప్పటి తరం లో ఎంతమందికి తెల్సో అనేది కొంచెం క్లిష్టమైన ప్రశ్న. కాని ఇందులోని పాటలు ఇప్పటికి ప్రాతః కాలం వింటే మనసుకి అదో ప్రసాంతత,, సంతృప్తి.. ఏదో తెలియని అనుభూతి,, ఎక్కడికో మనసుని పయనింప చేసే శక్తి. అందుకే,, ఇలాంటి పాటలు రాముడు ఉన్నంత వరకు జీవించి ఉంటాయి. మేలుకో శ్రీరామ అనేపాట మహదేవన్ గారు అత్యద్బుతం గా స్వరపరచిన పాట. ఆరుద్ర గారి ఊహా శక్తికి మించిన సరళమైన భావం తో రాముడిని ఉదయాన నిద్రలేపటం ఎంతో రమణీయం గా ఉంటుంది.మహదేవన్ గారు ఈ పాటలో,, వీణ, ఫ్లూట్, వయోలిన్, అత్యంత రమణీయంగా రామ నామానికి సరిగా తోడు అవుతాయి. గొప్ప సంగీత దర్శకులు శ్రోతల్ని పాటలోకి తీసుకెళతారు, వాళ్ళని ముందు గా తయారు చేస్తారు పాటలోకి లీనం అవ్వటానికి. అలాగే ఈ పాట కూడా. పల్లవి కి ముందు వచ్చే సంగీతం తో రాముణ్ణి మేల్కొలిపే విధం గా తయారు అవుతాడు శ్రోత.
ఇంకా ఆలస్యం దేనికి ఆ రామున్ని మనం కూడా మేల్కొలుపుదాము పదండి.
మేలుకో శ్రీరామ నీల నీరద శ్యామ
మేలుకో మేలుకో మేలైన గుణ ధామ..
భగవంతుడిని మేల్కొలపటం అనేది అనాది గా మనిషి/భక్తుడు చేస్తున్న ఆచారం. అనేక మంది తర తరాలు గా పద్యాలు పాటలు, కవిత్వాలు రాసారు, పాడారు. సుప్రభాతం అనేది మన భారతీయ సంస్కృతీ. జగమేలే పరమాత్మకి నిద్ర ఏమిటి, మెలుకువ ఏమిటి. పరమాత్మ అయిన రాముడు మనిషి గా జన్మించి మనిషి గా కష్టాలు అనుభవించాడు కాబట్టి మనం కూడా రాముడు నిద్రపోతాడు,, మేలుకొల్పుదాం తప్పు లేదు.. ఉదయాన భానుడు ఉదయించే వేల రాముడు ఇంకా పడుకున్నాడు. అటువంటి రాముడిని భక్తుడు ఎలా నిద్ర లేపుతాడో అంటే,, బుజ్జగించి,, పొగిడి,, గొప్పతనం తెలియచేసి,, చెయ్యవలసిన పనులు గుర్తు చేస్తూ,, చుట్టూ పక్కల ఏమి జరుగుతోందో,, దేనికి అలస్యమైపోతోందో అని తెలియచేయటం,, ఇలాగ అనేక విధాలుగా ఒకరిని నిద్ర లేపొచ్చు. అన్ని విషయాలు తెల్సిన దేవుడికి నిద్రలేవాలన్న విషయం తెల్వదా అంటే,, అది భక్తుని సరదా, తన సొంతమైన భగవంతుడిని ఎలాగైనా చెయ్యొచ్చు, అది భగవంతునికి ఇష్టమే. ఎందుకంటే భగవంతుడు, భక్తునికి దాసుడైతే, భక్తుడు భగవంతునికి దాసుడు.. ఒకరి మీద ఒకరికి ఆ చమత్కారాలు ఆడుకొనే అధికారం, చనువు, చొరవ ఉంటాయి. అందుకే భక్తుడి ఊహకి తగ్గట్టుగా భగవంతుడు ఉండటం భగవంతుడి లక్షణం. ఇటువంటి తర్కాలన్నీ పక్కన పెడితే, ఇక్కడ ఆరుద్రగారు ఏమేమి చమత్కారాలు చేస్తారో చూద్దాం.
రాముడు లోకాభిరాముడు, నీల మేఘ శ్యాముడు. రాముడి శరీర ఛాయ నీల మేఘం రంగు. అందుకే ఆయనని నీల మేఘ శ్యాముడు అన్నారు. నీరద అంటే కూడా మేఘమే. ఎటువంటి మేఘం అంటే నీటితో నిండిన మేఘం. ఆ మేఘం వర్షిస్తే ఎంత వాన పడుతుందో, రాముడు కూడా కరుణిస్తే, అంటే ప్రేమ కురుస్తుంది. అటువంటి రాముడు మేల్కొని ఉంటె అందరికి మేలు జరుగుతుంది, ఎన్నో సుగుణాలు కలిగిన రాముడు అన్ని మేలైన గుణాలే ఉన్న వాడు. మేలైన గుణాలు ఉన్నవాళ్లు మేల్కొని ఉంటె చాల పనులు అవుతాయి. అందుకనే ఓ రామ తొందరగా మేలుకో..బాలు గారి గొంతులో మాధుర్యం చరణం పాడినప్పుడు అర్థం అవుతుంది. ధన్య జీవి బాలు గారు. ఎన్ని జన్మల ఫలమో ఆ వరం.!!!
అల నీల గగనమ్ము అరునారుణం ఆయే..
కులదైవం ముదయాద్రి కొలువుండ పయనించే
కొలను తామర లల్లి పులకించి విరిచినవి
నలినాబ్జ ఇక నీదు నయనాలు విడవలెను.. || మేలుకో శ్రీ రామ ||
పల్లవి లో నీల నీరదం, చరణం లో నీల గగనం అదే పద చమత్కారం. రాముడు నీల రంగులో ఉంటాడు. అందుకే బాపు గారు శ్రీ రామ రాజ్యం లో రాముణ్ణి అలాగే చూపించారు. కాని మనకి రామున్ని వేరే రంగులో ఊహించుకోవటం వాళ్ళ రామున్ని అలా చూడటం చాల మందికి నచ్చలేదు. రాముడు అలాగే ఉంటాడు కాబట్టి బాపు గారు ఏమాత్రం వేరు గా చూపలేదు. స్వచ్చమైన ఆకాశం నీలం రంగులో ఉంటుంది, కాని ఉదయాన సాయం సంధ్యలో ఆకాశం అరుణకిరణం తో ఎర్రగా ఉంటుంది. ప్రతి కవి తను రాసే ముందు చాల కష్టపడతాడు, చాల విషయాలు తెల్సుకొని దానికి అనుగుణం గా తన కవితలు కాని పాటలలో కాని వాడుకుంటాడు. అందుకనే కవి పాట బట్టి కవి ప్రతిభ చెప్పొచ్చు.ఓ రామ సూర్య కాంతి తో ఆకాశం ఎర్ర గా మారింది. రాముని కులదైవం సూర్యుడు. ఆ సూర్యుడు ఉదయాన కొలువుండే కొండ, ఉదయాద్రి. అలాగే సాయంత్రం అస్తమించే టప్పుడు కొలువుండే కొండ అస్త అద్రి. సూర్యుడు తన పని చేస్తున్నాడు, తను ఉదయ కాంతితో కొలను లోని తామరలు పులకించి పోయి ఆనందం తో విచ్చుకొని విరబూస్తున్నాయి. తామర కన్నులున్న ఓ రామ మూసిన కళ్ళు తెరచి మేలుకోవయ్యా మమ్మేలుకోవయ్య.
మరల విశ్వామిత్ర మహర్షే మేల్కొలిపి
నరసార్దూల నిన్ను నందించ వలయునా..
తరుణీ సీతమ్మ తల్లి గృహ విధుల మునిగింది,
తిరిగి శయనిన్చేవు మర్యాద కాదయ్య... || మేలుకో శ్రీ రామ ||
కౌసల్య సుప్రజా రామ, పూర్వా సంధ్య ప్రవర్తతే, ఉత్తిష్ఠ నరసార్దూల కర్తవ్యమ్ దైవ మాహ్నికం అని విశ్వామిత్ర మహర్షి రాముణ్ణి మేల్కొలపటానికి పాడిన సుప్రభాతం. వశిష్ట మహర్షి దసరద మాహారాజు కి రాజ గురువు. రామ లక్ష్మణ భారత శత్రుఘ్నులకు అన్ని నేర్పిన రాజ గురువు. కాని యుద్ద విద్యలు నేర్పింది విశ్వామిత్రుడే. దశరధుడు ఒక రోజు కొలువు తీరి ఉండగా వచ్చి వరం పొందుతాడు విశ్వామిత్రుడు. అప్పుడు విశ్వామిత్రుడు తనతో పాటు రామ లక్ష్మణలను తన యాగా సంరక్షణ కోసం పంపమని అడుగుతాడు. దశరధుడు భయపడినా, వశిష్ట మహర్షి అంగీకారం తో వాళ్ళను పంపుతాడు దశరధుడు. విశ్వామిత్రుడు అందుకు ప్రతిఫలం గా వాళ్ళకి యుద్ద విద్యలను నేర్పటానికి సంసిద్దుదవుతాడు. రామలక్ష్మణలను నిద్ర పోతుండగా చూసి రాముణ్ణి నిద్ర లేపటానికి సుప్రభాతం పాడతాడు. నరులలో శ్రేష్టి ఐన శ్రీ రామ ఆ విశ్వామిత్రుడిలాగ మరల నిన్ను లేపాలా? సీతమ్మ తల్లి అప్పుడు నిద్ర లేచి తన పనులలో మునిగి ఉంది, నువ్వు నిద్ర పోవటం సమంజసం కాదు మేలుకో శ్రీరామ మమ్మేలుకోవయ్య.!!!
వదనార విన్దమ్ము ముదమార పరికించ
బంగారు వాకిళ్ళ పడిగాపులయి ఉన్న
భక్త కోటిని వేగ పాలించ లేవయ్య || మేలుకో శ్రీ రామ ||
ఉదయాన్నే దైవ దర్సనం చేసుకోవటం అన్నిటిలో మిన్న. అందులో ప్రత్యక్ష దైవం అయితే ఇంక తిరుగు ఉండదు. చరణారవిందాల దర్సనం అయ్యి, పాదాలకు నమస్కరిస్తే ఆ రోజు అన్ని శుభాలే. అందుకే ప్రతి రోజు భగవత్పాద దర్సనం లో దినం ఆరంబిస్తే అత్యంత శుభం కల్గుతుంది. రాముడు కోసం కొన్ని వేల మంది ఆ మనోహర రూపం మనసార చూసి తరించటానికి వేచి ఉంటారు. రాజులకి ఒక్క వాకిలి కాదు కదా అనేకం ఉంటాయి. రాముడు ఎందుకు నిద్ర లేవాలి అంటే, మొదటి కారణం, ఆ రామ పాదాలకు దండం పెట్టటానికి, దివ్య రూప దర్సనానికి, ఆ తరువాత భక్తులని కాపాడటానికి వేచి ఉన్న వాళ్ళ కోసం శీఘ్రం మేలుకొని పాలించ వయ్యా రామ. శ్రీ రఘు రామ అని ఊహ కి అందని దివ్య మనోహర రూపం మన కళ్ళ ముందు ఉంచి అలాగా వదిలేస్తారు మహదేవన్ గారు, ఆరుద్ర గారు, బాలు గారు.
కొసమెరుపు: రామ గానామృతం లాంటి ఆడియోలు అరుదుగా వస్తాయి. అందులో ఎన్నో దశాబ్దాల క్రితం వచ్చినా ఇంకా మొదటి సారి విన్నప్పుడు కలిగిన అనుభూతి మిగుల్స్తుంది విన్న ప్రతి సారి. ఇటువంటి అరుదైన పాటలు ఇంక ముందు రావు రాబోవు. మొదట ఇటువంటి పాటలు అందించే వారే లేరు, ఒక వేళ వచ్చినా ఇటువంటి పాటలు ఆదరించే వారు లేరు. ఉదాహరణ శ్రీరామ రాజ్యం సినిమా అవార్డులకు కాని జనాదరణ కి కాని నోచుకోకపోవటం మారుతున్న జనాభిరుచికి, రాబోయే తరాలకి ప్రతీక.ఇటువంటి పాటలు విని ఆనందించే వాళ్ళకి పాత తరం అందించిన జీవితానికి సరిపడా పాటలు ఉన్నాయి కాబట్టి అవి వింటూ సంతృప్తి పడటం మినహా చెయ్యగలిగింది ఏమి లేదు. ఈ పాటలు వెబ్ ప్రపంచం లో కూడా అంతగా ఆదరణ లభించలేదు. దాదాపు దశాబ్దం క్రితం ఇవి ఇంటర్నెట్ లో కూడా ఎక్కడ దొరకలేదు. తెలుగు పాటల తీయ్యదనం, గొప్పతనం తెలియచేసే ఇటువంటి పాటలని ఆదరించే రోజు మరల వస్తుంది అని ఆశిద్దాం.