Sunday, December 11, 2011

Song of the week - Repalliya yada jhalluna - Saptapadi

నా సంగీత ప్రపంచం లో కొన్ని వేల పాటలు విని ఉంటాను, అందులో చాల అలలు తాకినట్లు వెళ్ళిపోగా, మరి కొన్ని గాలి లాగ స్పృశించి వెళ్ళిపోయాయి.  కొన్ని హృదయానికి హత్తుకోగా కొన్ని మదిలో అలా నిలచిపోయాయి. వాటిలో కొన్ని పాటలు ఎన్ని సార్లు విన్నాఏదో కొత్తదనం వాటిల్లో కనిపిస్తుంది. అలాంటి పాటలు వారానికి ఒకటి కాలం అనుమతి ఇస్తే నిక్షిప్త పరచుకోవాలనే చిన్న ఆశ ఎప్పటినుంచో ఉంది కాని బ్లాగ్ రూపం దాల్చటానికి కుదురుతుంది అని ఎప్పుడు ఊహించలేదు. ఈ పాటల యొక్క వివరణ, విశ్లేషణ అంతా నా పరిమిత జ్ఞానం మాత్రమే. ఇది ఎటువంటి విమర్శా కాదు ఇటువంటి  ఆణిముత్యాలని ఇచ్చిన  పెద్దలని కించపరచాలని కాదు. ఏమైనా తప్పులుంటే పెద్ద మనస్సు తో మన్నించండి. ఇందులో వచ్చే పాటలు వరుస గొప్పతనానికి సూచన కాదు, ఇది నాకు వచ్చిన జ్ఞాపకం, ఈ టైం కి కుదిరిన వీలు మాత్రమే.

ఇక ఈ వారం పాట
రేపల్లియ  యద ఝల్లున  పొంగిన  రవళి -  song from the Telugu movie "సప్తపది".

You tube link

Movie: Saptapadi
Director: K.Viswanath
Music: K.V.Mahadevan
Lyrics: Veturi
Singers: S.P Balasubramanyam, P.Susheela
Flute: Nanjappa
Dance Master: Seshu
Asst. Dance Master: Kumari
Year of Release: 1981



ఒక పాట చిరకాలం నిల్చి పోవాలంటే చక్కటి సాహిత్యం ఆ సాహిత్యాన్ని పరిమలిమ్పచేసే సంగీతం మొదట తోడవ్వాలి, ఆ తరువాత అది ప్రేక్షకునికి చేర్చే అత్యంత ఆహ్లాదకరమైన, శ్రావ్యమైన కంఠం ఉండాలి, ఆ సంగీత ఝరిని చిత్రీకరించే ప్రదేశం , నిర్దేశించే దర్శకుడు ఆ మాటల్ని ఆ అందాన్ని దృశ్య కావ్యంగా మలచటానికి నటీ నటులు తోడయ్యి, వాళ్ళని నర్తిన్పచేసే నృత్యకారుడు మాల గా చుట్టి మెడలో వేస్తే అది ప్రేక్షకుడికి వీనుల విందు అవుతుంది. ఈ పాటకి అన్ని అలా సమకూరాయి కాబట్టే ఇది అజరామరం అయ్యింది. ఒక శృంగార కావ్యం గా నిల్చిపోయింది,

ఈ సినిమా మొత్తం మీద కథానాయకుడు, నాయిక కి మధ్యలో 4-5 dialogs మాత్రమే ఉంటాయి. వాళ్ళ మధ్య స్పర్స కూడా 1-2 సార్లు కూడా ఉండదేమో. కాని వాళ్ళ మధ్య అనిర్వచనీయమైన, అతీతమైన ప్రేమని చూపించటం లో దర్శకుడు సఫలీకృతం అయ్యాడు. అతీతం ఎందుకంటే ఇది  రెండు  శరీరాల కంటే రెండు కళల పట్ల ఏర్పడ్డ బంధం, రెండు ఆత్మల మధ్య ఏర్పడ్డ బంధం. నాయిక నర్తకి అయితే నాయకుడు మురళికారుడు. అందుకనేనేమో వేటూరి గారు వారిని ఇంత హృద్యంగా రాధ మాధవులని పోలుస్తూ రాయగలిగారు, ఆయనకి ఉన్న కల్పనా శక్తి అమోఘం. ఈ పాటలో ఆయన చేసిన పద ప్రయోగం ఒక ఇంద్రజాలం. బాలు సుశీల గార్ల గొంతు అమృతం. "Thats why it remains as one of the beautiful romantic song ever picturized in Telugu Film history."

ఈ పాట సందర్భం గూడ ఒక రాయబారం , ఉత్తర ప్రత్యుత్తరాల తరువాత మొదలు అవుతుంది, కృష్ణ నది కొండ ఎత్తునుంచి చూస్తూ camera నావ మీద నుంచి అలా వేణువు మీదకి ఫోకస్ అవుతుంది, అప్పుడు వేణువు లోంచి ఒక శ్రావ్యమైన ఆలాపన మొదలుఅవుతుంది, అత్యంత శ్రద్ధగా వింటూ నాయికా పాట పాడుతుంది ( ఒక పాట ఇంత అద్భుతం గా మొదలవ్వటం చాల తక్కువసార్లు చూస్తాం రేపల్లె కాదు మన గుండె కూడా ఝల్లుమంటుంది )
వ్రేపల్లియ ( రేపల్లియ) ఎద  ఝల్లున  పొంగిన  రవళి 
నవరస మురళి  ఆ నందన  మురళి ఇదేనా  ఆ  మురళి  మోహన  మురళి  ఇదేనా  ఆ  మురళి

ఇక్కడ వేటూరి గారి చమత్కారం మొదలు అవుతుంది, మురళిని అన్ని విధాలుగా వివరిస్తూనే, కథానాయిక కథానాయకుడిని పరిచయం చేసుకుంటున్నట్టు ఉంటుంది. రేపల్లె మొత్తం కృష్ణుని పిల్లనగ్రోవికి పాద దాసులయ్యారు అలాంటి మురళి ఇదేనా అంటూనే , కృష్ణుడితో పోల్చుకోవటం అనేది చాల సముచితం, సినిమాలో మహదేవన్ గారు మురళి ని అట్లాగే పలికిస్తారు కూడా.

మధ్యలో వచ్చే interlude లో నాయకుడు నాయికా వాళ్ళ నాన్నగారి దగ్గరకి శిష్యరికం కోసం ( ఉద్యోగం ) రావటం, నాయిక గుమ్మం వరకు వచ్చి తనని చూసి బిడియం తో వెనక్కి వెళ్లి మైమరచి పోతుండగా చరణం మొదలవుతుంది,  ఇది విశ్వనాధ్ గారి ఉదాత్తతకు నిదర్శనం. చిన్న విషయాలు కూడా శ్రద్ధతో తీసే ఆయన ఆలోచన శక్తి అమోఘం.

చరణం 1
కాళింది మడుగున  కాళీయుని  పడగల 
ఆ  బాల  గోపాల మా  బాల  గోపాలుని 
అచ్చెరువున  అచ్చెరువున  విచ్చిన  కన్నుల   జూడ 
తాండవమాడిన  సరళి  గుండెలనూదిన  మురళి ఇదేనా  ఇదేనా  ఆ  మురళి 

వేటూరి గారిలాంటి మహానుభావుల కవిత్వం వినే అదృష్టం కలగటం మన అదృష్టం, సరళమైన పదాలతో ఏంటో అత్యున్నతమైన భావాన్ని అందచేసిన ఆయన జన్మ ధన్యం.  కాళీయుని  వృత్తాంతం ఎంత చక్కగా వివరించారో, ఆ రేపల్లి లో జనులందరు వయస్సు తో నిమిత్తం లేకుండా  ( ఆ బాల గోపాలులు ) ఆ చిన్ని కృష్ణుడు  ( బాల గోపలుడిని ) పాడగా మీద తాండవ నృత్యం చేస్తుంటే, ఆ చెరువున ( కాళింది నది ఒడ్డున ) ఆశ్చర్యం తో చూస్తుంటే వాయించిన మురళి ఇదేనా,,??? 

ఇక్కడ సబిత నృత్యం కూడా ఈ వివరణ ఇచ్చేలాగా ఉంటుంది, అచ్చెరువున అన్నప్పుడు కళ్ళు పెద్దవి చెయ్యటం,  ఆ బాల గోపాలులని చూపటం, తాండవ ముద్ర, విశ్వనాథ్ గారి కళా విజ్ఞతకు నిదర్శనం. 

 చరణం 2
అనగల   రాగమై  తొలుత  వీనుల  అలరించి 
అనలేని  రాగమై  మరల  వినిపించి  మరులే  కురిపించి 
జీవన రాగమై  బృందావన  గీతమై 
కన్నెల  కన్నుల  కలువల వెన్నెల దోచిన మురళి ఇదేనా ఇదేనా ఆ మురళి

ఇక్కడ మరొక్క చమత్కారం వేటూరి గారి పదంలో, అనగల రాగం, అనలేని రాగం  - ఒకటి, వీనులని అలరిస్తే, ఇంకోటి మరులు కురిపిస్తుంది అని చెప్పి కృష్ణుని లోని చిలిపితనం, కొంటెతనం చూపించారు, ఇంకా నాయికా పాటకి చివరగా, కన్నెల కన్నులని కాలువలు గా పోలుస్తూ కృష్ణుడు కన్నెల వలువలు దోచేస్తే, ఇక్కడ వెన్నెల దోచటం అనేది మనం మరలా వినటం సాధ్యం కాని వర్ణన,,  అటువంటి కృష్ణుడికి శక్తిని ఇచ్చిన మురళి ఇదేనా అని నాయిక పాడుకోవటం ఎంతో మధురాతి మధురం.

చరణం 3
వేణుగాన  లోలుని  మురిపించిన   రవళి నటనల  సరళి  ఆ  నందన  మురళి  ఇదేనా  ఇదేనా  ఆ  మురళి

ఇప్పుడు ఇంకా నాయకుని వంతు, నేనేమి తక్కువా అన్నట్టు నన్నునాట్యంతో మెప్పించిన రాధవి నువ్వేనా ఆంటాడు. ఈ సినిమాలో నాయికా నాట్యం చూసి ఆమె మీద అభిమానం పెంచుకున్న తరువాత అది ఆరాధనా గా మారుతుంది. అట్లాగే అతని వేణువుని ఆమె ఆరాధిస్తుంది. ఇట్లా ఇద్దరి సంగమం ఎట్లా ఉంటుంది అనేది వేటూరి గారి పాటలోని చివరి చరణం.

మధుర  నగరిలో  యమునా  లహరిలో 
ఆ  రాధా  ఆరాధనా  గీతి  పలికించి  (2)
సంగీత  నాట్యాల  సంగమ  సుఖ  వేణువై (2 )
రాసలీలకే  ఊపిరి  పోసిన  అందెల రవళి ఇదేనా  ఇదేనా  ఆ  మురళి 
ఈ సినిమా లో వేటూరి గారు రాసిన పాటలన్నీ అమోఘం, అత్యద్భుతం, ఆ రాధ ఆరాధన ని  పలికించిన ఆ వేణువు, సంగీత నాట్యాల సంగమం కాక ఏమవుతుంది? ఆ కలయిక రాసలీల కి ఊపిరి పోస్తే కృష్ణుడు ఆ గజ్జెలని పూజించకుండా ఉంటాడ?? ఇక్కడ విశ్వనాధ్ గారు హీరో తో హీరోయిన్ కట్టుకున్న కాలిని చేతి మీద తీసుకొని కడిగిస్తారు. ఆ అరధానని చూపిస్తారు. రచయిత, దర్శకుడు యొక్క భావాలు కలిస్తే ఇటువంటి ఆణి ముత్యాలు లభిస్తాయి అనటం లో సందేహం లేదు.

నాకు SPB పాటలో  రెండవ భాగం వరకు పాడకుండా ఉంది, సగం లో పాట మొదలు పెట్టిన పాటలంటే చాల ఇష్టం, ఎందుకంటే బాలు గొంతు female voice తరువాత  వచినప్పుడు ఎంత మాధుర్యం గా ఉంటుందో చెప్పలేం. ఆ గొంతులో ఏదో దివ్యత్వం విన్పిస్తుంది.
ఉదాహరణలు "శ్రీరంగ రంగనాథుని - మహానది " సిరులోలికించే చిన్ని- యమలీల లాంటివెన్నో.













Tuesday, December 6, 2011

యథార్థ ప్రేమ గాథ - Music Review


Yadhartha Premakatha (2011)
Music: Sai Karthik

ఒక పాట ఎవరికీ ఎప్పుడు ఎందుకు నచుతుందో ఎవరికీ తెలియదు అనిత - అనిత అన్న పాత 2009 లో TV channels  మారు మ్రోగిపోయింది రక రకాలుగా కథలు వచ్చాయి, చాల హంగామా/సందడి తరువాత నేనే ఈ పాట రాసింది అని బయటకు వచ్చాడు ఈ నాగరాజు. అదే సందడి లో Female version కూడా బాగానే పొపులర్ అయ్యింది. చివరికి ఈ పాటకి Inspire అయ్యాను అని charanraaj announce చేస్తే వచ్చిన మూవీ ఇది. ఈ పాటకి commercial హంగులు అద్ది చివరికి సినిమా గా రాబోతోంది. ఈ మ్యూజిక్ ఆల్బం ఎలా ఉందో చూద్దాం. సాయి కార్తీక్ అంతకు ముందు చేసిన సినిమాలలో వర ప్రసాద్ - పొట్టి ప్రసాద్, మంగళ, బ్రహ్మానందం డ్రామా కంపెనీ లాంటి పెద్దగా పేరురాని సినిమాలు ఉన్నాయి. ఈ సినిమాతో వచ్చిన అవకాసం సద్వినియోగం చేసుకున్నాడా??

Mee Ammavadu  
Artist(s): NY. Charan Raj, Divija Karthik
Lyricist: Tada Raja

Seems like its an Item song in the movie. Sai Karthik did a fine job with this song, mass song had used the Tamil -telugu,, Many songs came with similar meanings, but adding Tamil tinge gave a new flavor to this song, will be catchy to masses. Singers didnt have problems with this song.

Manishi Chesina Bomma  
Artist(s): Tada Raja
Lyricist: Haranath Rao

One patho song, seems like Director/Music Director is following a formula regarding the format of the songs in a movie, Most of the names in this movie are brand new, Tada Raja singing has feel but lacks quality, Chorus had covered up for him. However the tune is pretty good, Sai Karthik seems to be promising.

Anitha O Anitha  
Artist(s): Nagaraju
Lyricist: Nagaraju

Will skip this song as everybody knows about this song.


Padinelalu  
Artist(s): Bindu
Lyricist: Tada Raja

A bit song not sure what it is all about..


Anitha 2  
Artist(s): Nagaraju
Lyricist: Surendhra Mittapalli

Not sure why the current age music directors are following this trend of false voice for singers, Does it sound variety or something? I think Harris Jayaraj started this, in between many attempted, Thaman continued and now this movie too. If not for this irritating voice this song would have been definetely hummable, I dont think this is sung by Nagaraju as mentioned.. I guess its Sai Charan who sang this song. The singer did a good job. Forceful breaking the words and sentences to bring accent was another issue, else this is a good song to hear. May be youth will embrace this song.

Chandamama  
Artist(s): Sai Charan, Bindu
Lyricist: Soori Pathipaka

One more song with the style of singing like before song, Seems like Charan Raj didnt get good technical team, however the lyricists did a decent job, the Music director fared well, Having a better singers would have added value, Bindu faded out in this song heard couple of places she lost of completely. The male singer  is saving grace to this song. The tune is really nice, a decent attempt by Music director.

Life Is So Beautiful  
Artist(s): Sai Charan, Tada Raja
Lyricist: Tada Raja

One tune has to be inspired, this is one of it. However this is peppy song, A movie on love and no song for youth, this satisfies it. Shadow voice or what is called I don't know has become an overdose.

Overall, this is a decent attempt by the team. How these songs will fare will depend upon the movie. For a new commer, ( since less than 10 movies ), I would say if he overcomes the small issues, the music director is promising and will have bright future. He stuck to the formula and delivered it to some extent.

Pick(s) of the album - Not considering Anita Anita ( original ) - Life is Beautiful, Ammavadu, Anita2

Sunday, December 4, 2011

Ae nimishaniki VS. Gaali Ningi Neeru

ఏ నిమిషానికి ఏమి జరుగునో - లవ కుశ ( Singer/Composer - ఘంటసాల, Lyricist - సదాశివ బ్రహ్మం )
 

గాలి నింగి నీరు - శ్రీ రామరాజ్యం ( Singer - SPB, Composer - ఇళయరాజా , Lyricist - జొన్నవిత్తుల )
 

రామ నామము ఎన్ని సార్లు అన్న, రాముని చరితము ఎన్ని సార్లు చదివిన సారం తగ్గనిది. రామచరితం ఎన్ని సార్లు చదివినా, చదివిన కొద్ది రత్నాలు , మణులు మాణిక్యాలు దొరుకుతాయి. అటువంటి రామచరితాన్ని ఎందరో అనువదించారు, విశ్లేషించారు, శ్లాఘించారు. కొంతమంది దృశ్య కావ్యాలు తీసారు. ఇంకొంత మంది ఇంకొంచెం ముందుకెళ్ళి తమసొంత కథలు కల్పించి మెప్పించారు. లవకుశ జననం ఆ తరువాత కథ ఉత్తర రామాయణంగా అందరికి పరిచయమే, వాల్మికి ఇది రాయక పోయిన రాసిన వాళ్ళు అందులో వాల్మీకి పాత్ర సృష్టించి అది యదార్ధ గాధగా నిల్చేలా చేసారు.

కథ అందరికి తెల్సిందే!! కాని ఉత్తర రామాయణం లో అత్యంత క్లిష్టమైన ఘట్టం, అత్యంత ఉదాత్తమమైన ఘట్టం సీత పరిత్యాగం. చాకలి వాని అజ్ఞానాన్ని కూడా వదలక దాన్నే జనాభిప్రాయం గా తలచి, ఒక రాజుగా తన కర్తవ్య నిర్వహణ కోసం, సీతమ్మ వారికీ చెప్పకుండా లక్ష్మణుడికి చెప్పి అడవులలో విడిచి రమ్మనడం అనేది యుగాధర్మమేమో, రాజధర్మమో కానీ న్యాయం అయితే కాదు ఏ కోణంలో చూసిన సరే

సీతమ్మ వారు ఒక మహారాణి అందులో అన్ని కష్టాలు పడి వనవాసం చేసి రావణుని గుప్పెట్లోనుంచి బయటకి వచ్చి శీల పరీక్ష చేసి రాజధాని కి వచ్చిన తరువాత ఎవరైనా ఇటువంటి కష్టాన్నికోరుకోరు. అందులో రాముని అత్యంత ప్రీతి పాత్రమైన సీతని ఇటువంటి కష్టానికి గురిచెయ్యటం కూడా ఎవరు ఊహించరు.

సీతమ్మ వారు నదీ తీరం లోని మునులు ఋషుల సమక్ష్యంలో కొన్ని రోజులు గడపాలని కోరిక రావటం రాబోయే కాలానికి సూచనేమో .

రాముడు రాజు ఐనప్పుడు చేసిన ప్రమాణం, ప్రజల అభిష్టమే తన అభీష్టం, ప్రజా వాక్కే తన వాక్కు, ప్రజల కోసం తన కష్ట నష్టాలు, ఇష్ట అయిష్టాలు , తనవాళ్ళు ఇటువంటి వాణ్ణి వదులుకుంటాను అని ప్రమాణం చేస్తే అది ఇంక శాసనమే, అటువంటిది, తమ జంట మీద అంట పెద్ద కళంకం వస్తే ఇంకా ఏమైనా ఉందా, మునుపటి తరాలకి రాబోయే తరాల ప్రతిష్ట ఏమి కావాలి అని తీసుకున్న నిర్ణయం. ఇంతటి  కఠిన నిర్ణయం తీసుకున్నాడు కాబట్టే రాముడు దేవుడయ్యాడు.. ఆ రాముడి కి అండగా నిల్చింది కాబట్టే సీతమ్మ దేవత అయ్యింది.

ఇంకా ఈ సందర్భానికొస్తే, అన్న ఆజ్ఞ జవదాటలేక, అట్లాగని ఇష్టం లేని పని చెయ్యాల్సి వచ్చిన లక్ష్మణుని పరిస్తితి ఎవరు కావాలని కోరుకోరు. తనకు అత్యంత ఇష్టమైన వదిన గారికి ఇంత అన్యాయం జరుగుతుంటే పడే ఆవేదన ఒక వైపు, ఈ ఆవేదన తన వదినగారికి కనిపించకుండా దాచటం ఇంకోవైపు, తన ఆలోచనలు గుర్రం లా పరిగెత్తుతుంటే మరొక వైపు సీతమ్మ వారిని అడవిలో వదిలే సందర్భం లో ఇద్దరి మధ్య మాటలు ఎలా ఉంటాయి? సినిమా లో ఈ సందర్భం లో పాట కంటే ఇంకో మాధ్యమం లేదు ఆ పరిస్తితి వివరించటానికి.

ఈ సన్నివేశంలో లవకుశలో పాట రాసిన ఇద్దరు మహారధుల కి సంబందించిన "Comparison" చేసేంత అర్హత అనుభవం, జ్ఞానం నాకు లేదు కాని పాటలు విన్న తరువాత లక్షణుడు ఏమి అలోచించి ఉండొచ్చుఅని కలిగిన ఆలోచన ఇద్దరు రచయితల ఆలోచన విధానం ఎలా ఉంటుంది అన్న విశ్లేషణ మాత్రమే ఇది.

ఏ నిమిషానికి ఏమి జరుగునో - లవ కుశ




ఏ  నిమిషానికి  ఏమి జరుగునో ఎవరూహించెదరూ                    
విధి  విధానమును  తప్పించుటకై ఎవరు సాహసించెదరూ

చిన్నప్పటినుంచి నా మదిలోను మనస్సులోను నిలచిపోయిన పాట ఇది, ఎప్పుడు ఏమి జరుగుతుందో, మన జీవితం ఏ గమ్యం ఏ మజిలి ఏ మలుపు తిరుగుతుందో మనకే తెలియదు అని నేర్పిన ఈ పాట ఇప్పటికి చేవులలోనే మారుమోగుతుంది. ఘంటసాల గారు స్వరపరచి పాడిన ఈ పాట ఆపాత మధురం.

కంచెయ నిజముగా చేనుమేసిన కాదనువారెవరు
రాదేయికి ( రాజే ఇది correct word) సాసనమని పలకిన ప్రతిఘటించువారెవరు                                        
  
ఇక్కడ చూస్తె కంచే చేను మేస్తే అంటే రాముడే సీతని పంపితే ఎవరు మాత్రం ఏమి చెయ్యగలరు అని లక్ష్మణుడు అనుకుంటాడు, దాన్ని విధి విలాసం గా భావిస్తాడు, ఈ సందర్భం లో ఇంతకన్నా ఏమి చెయ్యగలడు?ఎంతైనా అన్న, అన్నని దిక్కరించాతమే కాదు ఎదురు మాట ఎలా చెప్తాడు? అన్న మాటకి శాసనం ఇంకా దానికి తిరుగులేదు. కానీ ఈ పాటలో లక్ష్మణుని అసహాయత నేను ఏమి చెయ్యలేను అన్న సందేశం ఇస్తుంది.  
                                    
ఇంక తరువాత చరణం లోకి వెళ్తే

కరునామయులిది కాదనలేర, కఠిన కార్యమనబోర ??
సాద్వులకేప్పుడు వెతలేనా తీరని దుఖపు కథలేనా??

ఇనకులమున జనియించిన నృపదులు ఈ దారుణమును సాహించెదర ??
వినువీధిని రేనులుగా నిల్చి విడ్డురముగా చూసెదర ??

ఇక్కడ లక్ష్మణుడు ముందుగా తనగురించి ఆలోచిస్తాడు అనుకుంట, తను చేసే కార్యం కటినమైనిదిగా భావిచడం లో తప్పు లేదు ఎందుకంటే రాముడు అత్యంత కష్టతరమైన పని అప్పచెప్పాడు కాబట్టి. సాధ్వుల కెప్పుడు కష్టాలు అని ఇక్కడ సాధ్వి అంటే ముందుగా తనగురించి చెప్తున్నాడు కాబట్టి తనకి ఇంతటి కష్టాలు అని కూడా అనుకొవొచ్చు, నాకు ఎందుకు ఇన్ని కష్టాలు వచ్చాయి అని రాముని కోసం అష్ట కష్టాలు పడ్డ లక్ష్మణుడు ఇలాగ ఆలోచించటం విచిత్రమే, ఇక్కడ అందరు ఈ జరుగుతున్న దారుణం సహించి విడ్డూరంగా  చూస్తారా అని అనుకోవటం నిస్పృహ గా తోస్తుంది.

The meaning I thought initially was the following however didn't publish because the analysis was more towards Lakshmana's mind set,


సీతమ్మ వారిని పరిత్యజించటం అనేది కష్టతరమైన పని, అందులో నిండు చూలల్ని అడవి లో వదిలేసి రమ్మనటం రామునికి అత్యంత కటినమైనది, ఇది ఎవ్వరు విభేదించలేరు. సీత లేకుండా రాముడు సంతోషంగా  ఉండడటం అనేది జరగని పని. సీతారాములు సాద్వులు, వారు ఎన్ని కష్టాలకి గురి అయ్యారో అందరికి తెల్సు, 

ఇక్కడ అందరు ఈ జరుగుతున్న దారుణం సహించి విడ్డూరంగా  చూస్తారా అని అనుకోవటం నిస్పృహ గా తోస్తుంది.

ఎండకన్ను ఎరుగని ఇల్లాలికి ఎందుకో ఈ వనవాసాలు? 
తరచి  చుసిన  భోదపడవులే దైవ చిద్విలాసాలు 
అగ్నిపరీక్షకే నిల్చిన సాద్విని అనుమానించుట న్యాయమా 
అల్పుని మాటయే జనవాక్యమ్మని అనుసరించుటే  ధర్మమా 

 


ఇక్కడ జనం అంటే అందరు వస్తారు , రాజుకి ప్రతి పౌరుడు తన బిడ్డే,.అతను అల్పుడైన మేధావి ఐన. కాబట్టి అల్పుని మాట అని అనటం సమంజసమో కాదో తెలియదు. బిడ్డ ఎవరైనా కాని అభిప్రాయం మటుకు మార్చలేనిది, సీత ఆగి పరీక్ష చేసిన, అది ఎంతమందికి తెల్సు? కాబట్టి ఆ అభిప్రాయం నిజాలు తెలియని  జనాల్లోంచి పోదు. అందుకే రాముడు ఆ అభిప్రాయాన్ని సీతని త్యజించటం ద్వార జనల్లోని ఆ కాస్త సందేహం కూడా కలుగకుండా చేసాడు, ఎందుకంటే చరిత్ర మార్చలేడు కాబట్టి.

సీతమ్మ మహారాణి కాబట్టి ఎండకన్ను ఎరుగదు అని అనటం సమంజసం, కానీ 14 ఏళ్ళు వనవాసం చేసిన సీతకి ఎండ కొత్తేమి కాదు కష్టాలు కొత్తేమి కాదు కదా, అగ్ని పరీక్ష చేసింది లంక లో, కాని అనుమానించింది ఒక సాధారణ పౌరుడు, ఇక్కడ ఈ విషయం అందరికి ఎందుకు తెలియదో పక్కన పెడితే, రాముడు కాబట్టి సీతను స్వీకరించాడు, నేను ఎందుకు చెయ్యాలి అనే ప్రశ్నకి సమాధానం ఉండదు.

మొత్తానికి ఈ పాట లకష్మణుడి అస్తిర భావం, అసహాయత ని ఎక్కువ చెప్తుంది. లక్ష్మణుడి ఆలోచన విధానం లో ఎక్కువ స్పష్టత లేదు అనిపిస్తుంది. 

ఇక ఇదే సందర్భం లో శ్రీ రామరాజ్యం లో పాట ఎలా ఉందొ చూద్దాం.

 


గాలి  నింగి  నీరు  భూమి  నిప్పు  మీరు  రామా  వద్దనలేర  ఒక్కరూ
నేరం  చేసిందెవరు  దూరం  అవుతోందేవారు  ఘోరం  ఆపేదెవరు  ఎవరూ
రారే  మునులు  ఋషులు   ఏమైరి  వేదాంతులు  సాగే  ఈ  మౌనం  సరేనా?
కొండ  కోన  అడవి  సెలయేరు  సరయూ  నది  అడగండి  న్యాయం  ఇదేనా ?
 
లక్ష్మణుడు రధం మీద తీసుకెళ్తూ ఇంకా ఎక్కడో ఆశతో వెళ్తుంటాడు ఎవరైనా ఆపకపోతార అని. తనవల్ల కాలేదు, తమ అన్నదమ్ముల్ల వలన కాలేదు రాజమాతల వల్లన కాలేదు కనీసం మీరిన ఆపలేరా అని అక్రోసిస్తూ వెళ్తుంటాడు తనకు గుర్తుకు వచ్చిన వాళ్ళని దారిలో చూసిన వాళ్ళని అడుగుతాడు, మీరిన కనీసం "రామ ఈ పని వద్దు" అనండి అని,, ఎవరో నేరం చేస్తే తన అన్న వదిన ఎందుకు దూరం కావాలి అనే బాధ కనిపిస్తుంది, ఇది ఇప్పటి వాళ్ళ ఆలోచనకి సరిగ్గా సరిపోతుంది అని నా అభిప్రాయం, తనకి ఇది అన్యాయం అని తెల్సు కాని రాముని అడిగే ధైర్యం లేదు, అన్నగారి మాట జవదాటలేదు, అందుకని మౌనం గా ఉండటం సరి కాదు రామా ఇది ఆపు అని అడగటం లో లక్ష్మణుని బాధ ఉంది.




1st stanza
ముక్కోటి  దేవతలంతా  దీవించిన  ఈ  బంధం  ఇక్కడ  ఇప్పుడు  విడుతుంటే  ఎ  ఒక్కడు  కూడా  దిగిరార  ?
అందరికీ  ఆదర్శం  అని  కీర్తించే  ఈ  లోకం  రాముని  కోరగా  పోలేద  ఈ  రధముని  ఆపగలేదా ?
విదినైన  కాని  ఎదిరించేవాడే  విధి  లేక  నేడు  విలపించినాడే ఏడేడు  లోకాలకి  సోకేను  ఈ  శోకం

రంగ రంగ వైభవంగా జరిగిన సీతారాముల పెళ్లికి మూడు లోకాలు సాక్షులే. రావణ సంహారం కోసం ముక్కోటి దేవతలు దగ్గరగా వచ్చి దీవించి మరి పెళ్లి చేసారు, అటువంటిది, రావణ సంహారం అయిపోగానే ఇంకా ఈ బంధం తెగిపోతుంటే ఒక్కరు కూడా రాలేదా అని అడగటం చాల సమంజసం,అలాగే రావణ సంహారానికి అందరు సహకరించారు కాని సీతారాముల ఎడబాటుని ఒక్కళ్ళు కూడా ఆపలేకపోవటం శోచనీయం. లక్ష్మణుడు చేసే ప్రతి నిందలోను న్యాయం ఉంది, ఆదర్శం అని కీర్తిస్తే సరిపోదు, రధాన్ని ఆపి ఈ ఎడబాటుని మాపండి అని కవి ఎంతో చక్కగా చెప్తాడు.రాముడి శక్తి ముంది విధి కూడా తలవంచుతుంది అటువంటి వాడు సీతని త్యాగించి కన్నీరు మున్నీరు గా విలపించటం లక్ష్మణుడు దాన్ని గురించి బాద పడటం అనేది సందర్భోచితం. రాముడు నాకు ఈ రాజ్యాధికారం వల్లనే కదా సీతని త్యాగం చెయ్యాల్సి వచ్చింది నేను రాజ్య త్యాగం చేసి సీత తో నేను కూడా అడవులకి వెళ్ళిపోతాను అప్పుడు ఎటువంటి ఇబ్బంది ఉండదు అని అంటే ఎవరో ఒప్పుకోరు అందుకనే తన వంశం ఒక్క కీర్తి ప్రతిష్టల కోసం విధిలేక సీతని వదిలిపెట్టి విలపిస్తే లోకాలన్నీ విలపించావా అని ఎంత చక్కగా చెప్పారో కవి ?

2nd stanza
రారే  మునులు  ఋషులు   ఏమైరి  వేదాంతులు  సాగే  ఈ  మౌనం  సరేనా?
కొండ  కోన  అడవి  సెలయేరు  సరయూ  నది  అడగండి  న్యాయం  ఇదేనా ?
అక్కడితో  అయిపోకుండా  ఇక్కడ  ఆ  ఇల్లాలే  రాక్కసివిధికి  చిక్కిందా? ఈ  లెక్కన  దైవం  ఉందా?
సుగుణంతో  సూర్యుని  వంశం  వెలిగించే  కులసతిని  ఆ  వెలుగే  వెలివేసింద? ఈ  జగమే  చీకటి  అయ్యిందా ?
ఏ తప్పు  లేని  ఈ  ముప్పు  ఏమి  కాపాడలేర? ఎవరైనా కాని నీమాటే  నీదా  వేరే  దారేది  లేదా 




అక్కడితో అయిపోవటం అంటే 14 ఏళ్ల కష్టనష్టాలు అనుభవించిన సీత సాధ్వి ఇక్కడ రెండోసారి తన తప్పు లేకుండా మళ్ళా బలి అయ్యింది, మంచి వాళ్ళకి మంచి జరగక పొతే, ఇంకా దైవం ఎందుకు? అందులో సూర్యవంశం నిలబెట్టే సీతని ఆ రాముడే వేలివేసాడే? లక్ష్మి లేని ఇల్లు చీకటి పాలే కదా, ఇది చాల చక్కని వర్ణన, ఈ తప్పు  లేకుండా సీతని బలిచేయ్యద్దు రామా నీ కర్తవ్యం నీ ధర్మం నీదేనా సీత కి వేరే దారి లేదా అని చెప్పకనే చెప్పారు..

Conclusion
మనిషి మనస్తత్వం ఎలాంటిదంటే,కష్టం రాబోతోంది అనికాని తనకు ఇష్టంలేని పని జరగబోతుందని తెలిస్తే అది జరిగేంతవరకు ఆపటానికి సాయశక్తుల ప్రయత్నిస్తాడు తనవల్ల కానప్పుడు నానావిధలుగా ప్రార్దిస్తాడు అది జరుగకుండా ఉండటానికి. అంతే కాని ఇది విధి రాసిన రాత అని నిస్పృహతో వోటమిని ఒప్పుకోడు అని అనుకుంటున్నాను, జొన్నవిత్తుల గారు ఈ "Psycology" తో  పాట రాసారు అని నాకు అనిపించింది. 


కాని సదాశివ బ్రహ్మం గారు లక్ష్మణుడికి ఉన్న పరిణితితో అలోచించి విధి ముందు ఎవరు ఏమి చెయ్యలేరు అని ఆలోచించే విధంగా రాసారు అనిపిస్తుంది, కాని కంచే చేను మేసింది అని ప్రస్తావించి సీతారాముల దంపత్యాన్ని సరిగ్గా చూపలేదేమో అని నా అభిప్రాయం. అలాగే విను వీదులలో విడ్డూరం గా చూడటం తప్ప ఏమి చెయ్యలేరు అని రాస్తే జొన్నవిత్తుల గారు అన్నిలోకలు శోకం లో మునిగిపోతారు అని రాసారు. ఇది చాల సత్యం. ఎవరు ఈ ఘోరాన్ని చూసిన శోకం లో మునిగిపోవటం ఖాయం. 
 

అందుకనే జొన్నవిత్తుల గారు రాసిన ఈ పాట ఆ సందర్భానికి ఎక్కువ దగ్గరగా ఉందని నా అభిప్రాయం మాత్రమే.  విజ్ఞులు ఎవరైనా  నా అభిప్రాయాన్ని సరి దిద్దితే అదే పది వేలు..

Friday, December 2, 2011

"Rajanna" Music Review

రాజన్న మూవీ is a Period Movie produced by Annapurna studios .
రాజన్న అనే ఒక అతను స్వాతంత్య్రం వచ్చిన తరువాత తన ఊరు నేలకొండపల్లి వస్తే అక్కడ ఉన్న పరిస్థితులు రజాకార్ల, దొరల దౌర్జన్యం చూసి తన పాటల ద్వార జనాల్ని ఉత్తేజపరిచి పోరాడేలాగా చేసి చివరకు మరణిస్తే, అతని కూతురు మల్లమ్మ ఆ పోరాటాన్ని కొనసాగించే కథ. ఆ మల్లమ్మ ఏమవుతుంది అనేది కథాంశం. ఇది ఒక కల్పితమైన కథ ఐన అప్పటి పరిస్థుతలని ప్రతిబింబించే కథ అవ్వటం వలన యదార్ధ గాధ లాగా ఉంటుందేమో తెర మీద.

ఆడియో రిలీజ్ ఫంక్షన్ లేకుండా ఆడియో రిలీజ్ చెయ్యటం విశేషం ఇవ్వాళ రేపు. అసలు పల్లెటూరి నైపధ్యం లో అందులో ఇటువంటి విప్లవ అంశాలు ఉన్న సినిమా కి సంగీతం సమకూర్చటం కత్తి మీద సాము వంటిదే. చాల శ్రమ, పరిశోధన చెయ్యాలి. అలాగే పాటలు రాసేవాళ్ళు కూడా సున్నితమైన పదాలతో అత్యంత powerful గా ఉండే మాటలతో పాటలు రాయటం అనేది క్లిష్టమైన పని. ఎందుకంటే పల్లె పదాలు అటువంటివి . సంగీతం సమకూర్చిన కీరవాణి పడిన శ్రమ చేసిన తపస్సు ప్రతి పాటలో స్పష్టం గా వినిపిస్తుంది. ఉచ్చారణ లోపాలు , ధ్వని ఎక్కువగా వినిపిస్తున్న ఈ కాలం లో విప్లవాత్మకమైన జానపదం విన్పించిన అందరికి ఈ సినిమా ఒక మైలురాయిగా నిలుస్తుంది.

ఇంకా పాటల విషయానికి వస్తే మొత్తం ఆడియో లో 13 పాటలు ఉన్నాయి, ఇవి కాక ఇంకో 2 ఉన్నాయి అని కీరవాణి గారు చెప్పారు. అమ్మ అవని అనే పాటకి  male version ఉంది. అది ఆడియో లో లేదు.

జానపదం/పల్లె పదం యొక్క గొప్పతనం అనుభవిస్తే కాని తెలియదు అది మనసుకి ఎంత హత్తుకుంటుందో, ఎంత మనసులో భావానికి దగ్గరగా ఉంటుందో. ఆ పదం పాడిన వాళ్ళకి శ్రమ ఎలా తెలియదో విన్నవాళ్ళకు కూడా అంటే హాయినిస్తుంది. ఇటువంటి సినిమాలని పాటలని ఆదరించే సమయం సందర్భం వచ్చినప్పుడల్లా చేస్తే పల్లె పదం బ్రతుకుతుంది, ఈ సాహసం చేసిన అన్నపూర్ణ studios ki hats off..


Gjijigadu     
Artist(s): Sanjeev Chimmalgi, Kaala Bhairava 
Lyricist: K Sivadatta 

ఈ మధ్య కలం లో ఇంతటి ఉదాత్తమైన సాహిత్యం వినలేదు, సూర్యుడిని మల్లమ్మ లేవలేదు తొందరగా రా అని మొదట్లో అడుగుతూనే, మల్లా మల్లమ్మకి వేడిగా ఉంది నీడ కోసం మబ్బుల చాటుకి వెళ్ళమని అడగటం చాల బాగుంది, పండక్కి  బండెక్కి , రమ్మని పాడటం కూడా చాల చక్కగా ఉంది,

Raa Ree Ro Rela     
Artist(s): Madhumita, Revanth, Shravana Bhargavi, K Sahiti, Amrithavarshini, B. Ramya  
Lyricist: Ananth Sriram 

ఈ పాట మల్లెమ్మ మీద అనుకుంట, అందరు పాడిన పాట. Ananth Sriram like every other lyricist, did wonders in this movie. 

Karakuraathi Gundello     
Artist(s): MM. Keeravani, Kailash Kher 
Lyricist: K Sivadatta 

కీరవాణి గారు పాడిన ఈ పాట అప్పటి పరిస్థితికి అద్దం పడ్తుంది, ఎంతో ఉదాత్తం గా పాడారు. హృదయానికి హత్తుకునే పాట, "చెయ్యాలని ఉన్న చెయ్యలేని వాళ్ళము, పెట్టాలని ఉన్న పెట్టలేని  వాళ్ళము" అంటూ ఈ ఊరిలో బ్రతికి ఏమి ఉపయోగం ఎక్కడికైనా ఎగిరి పోవమ్మ అని పాడుకున్నారు, అద్భుతమైన పాట. మధ్యలో వచ్చిన ఆలాపన, drums beats సరిగ్గా సరిపోయాయి.

Lachuvamma Lachuvamma     
Artist(s): Deepu, Shravana Bhargavi 
Lyricist: Suddala Ashokteja 

పల్లెటూర్లో ఆనందం వచ్చిన సందర్భాలలో అందరు సమకూడి ఎంత బాగా అనుభవిస్తారో అనేది ఈ పాట నిరూపిస్తుంది. పల్లె పదాల్లో ఉన్న సరసం, సున్నితత్వం, చిలిపితనం , సరదాతనం, కొంటెతనం ఈ పాటలో తెలుస్తుంది. "నడుముకి దిష్టి", "ముద్దుల గాజులు మొగిస్తన" "ఏక వీర బావికి"  "కందిపూల రైక" లాంటివి చాల ప్రయోగాలు ఉన్నాయి,  అక్కడక్కడ పాటలో మాట స్పష్టత లోపించిన పాట సరదాగా సాగిపోయి మంచి ఉషారు తెస్తుంది. చివర్లో వచ్చిన దరువు ఊపు అందరిని ఆడిస్తుంది. ఈ సినిమా లో తప్పకుండ ఈ పాట అందరు పాడుకునే పాట లాగ మిగిలిపోతుంది.
Chittiguvva     
Artist(s): Shivani, Venu, Sanjeev Chaimmalgi, Ramya 
Lyricist: Ananth Sriram 

అనంత శ్రీరామ్ మల్లా ఒక అద్బుతమైన పాట రాసారు. కీరవాణి అంబుల పొదలోంచి వచ్చిన ఇంకో బాణం, చాల హాయిగా సాగిపోతుంది 
Okka Kshanam     
Artist(s): Balaji, Deepu, Revanth, Rahul, Pridhvichandra 
Lyricist: Ananth Sriram 
A bit song, Ananth sriram has excelled in lyrics. keeravani and singers did great job. దేనికైనా ఒక్క క్షణం చాలు అంటూ అందరిని ఉత్తేజ పరిచే పాట లాగా ఉంది. Powerful orchestration provided by keeravani makes this   best for situation

Goodu chediri koila     
Artist(s): Mettapalli Surender, Chaitra 
Lyricist: K Sivadatta 

చైత్ర బాగానే పాడుతుంది, ఆశ కి ఆషా అని పాడటం లాంటి చిన్న తప్పులున్న, పాట రాసిన మెట్టుపల్లి surender భావం చెప్పటం చాల బాగుంది,  మల్లమ్మకి సాయపడమని వేడుకోలు ఈ పాట, అలాగని ఆ నడక ఏ అవాంతరాలకి ఆగాడు అని చెప్తూ, కళ్ళలో ఆశాజ్యోతి  ఏ గాలికి ఆరిపోదు అని చాల చక్కగా చెప్పారు. 
Kaaligajje     
Artist(s): Mettapalli Surender, Chaitra 
Lyricist: Mettapalli Surender 

ఇంకో పదం, నిద్రపోతున్న వాళ్ళని పరిగెత్తించే పాట, అదే పల్లెపదం గొప్పతనం,. కాలిగాజ్జి కే పల్లెతల్లి మేలుకొంతదో, డోలు డప్పు  గోల్లుమంటే ఊరు వాడ లేచి వస్తదో, గొంతేంటి పాడుతుంటే నిజం గా తెనేలూరుతాయి. Fantastic rendering and pleasant hearing. These kind of songs gets one fascinated towards villages.
Vey, Vey     
Artist(s): Revanth 
Lyricist: Suddala Ashokteja 

Revanth voice inta mature ayyindante really surprising, He brought all required essence to this song. Rajanna inspiring the villagers to fight by singing this song is the situation as said by Nagarjuna. This song shows how hard Keeravani worked for this movie. It is truly inspirational, revolutionary and Suddala ashok teja brought one of the fine lyrics. 

Dorasaani Koradaa     
Artist(s): Amrithavarshini 

Not sure what this song has a situation but its like singing before dorasani and getting torured. A small bit of a minute.
Melukove Chittitalli     
Artist(s): Sudarshini 
Lyricist: Chaitanya Prasad 

మల్లమ్మ ని మేల్కొలిపే పాట అనుకుంట . చైతన్య ప్రసాద్ లాంటి యువ రచయిత ఒక లాలి పాట రాసాడంటే అద్బుతమే. ఆ రచన  కోసం ఈ పాట వినొచ్చు . 
Amma Avanee     
Artist(s): Malavika 
Lyricist: K Sivadatta 

అమ్మ , పుట్టిన భూమి ఈ రెండు చూసినప్పుడే వొళ్ళు జలదరిస్తుంది, అది ఎన్ని సార్లైనా,. రాజన్న ఊరు వచ్చిన తరువాత పాడిన పాట ఇది, ఇదే పాట మల్లమ్మ కూడా పాడుతుంది, కనిపెంచిన ఒడిలోనే కళ్ళు మూసి మల్లా అక్కడే కళ్ళు మూయాలని, బాగా రాసారు..


ఈ మధ్యన ఇంతగా హ్రిదయానికి హత్తుకున్న పాటలు వినలేదు, శ్రీరామ రాజ్యం, వెంటనే ఈ సినిమా ఒకే సంవత్సరం రావటం సంగీత ప్రియులకి వీనుల విందు,, Album is worth to buy and listen,

Pick(s): Entire Album.