Sunday, December 4, 2011

Ae nimishaniki VS. Gaali Ningi Neeru

ఏ నిమిషానికి ఏమి జరుగునో - లవ కుశ ( Singer/Composer - ఘంటసాల, Lyricist - సదాశివ బ్రహ్మం )
 

గాలి నింగి నీరు - శ్రీ రామరాజ్యం ( Singer - SPB, Composer - ఇళయరాజా , Lyricist - జొన్నవిత్తుల )
 

రామ నామము ఎన్ని సార్లు అన్న, రాముని చరితము ఎన్ని సార్లు చదివిన సారం తగ్గనిది. రామచరితం ఎన్ని సార్లు చదివినా, చదివిన కొద్ది రత్నాలు , మణులు మాణిక్యాలు దొరుకుతాయి. అటువంటి రామచరితాన్ని ఎందరో అనువదించారు, విశ్లేషించారు, శ్లాఘించారు. కొంతమంది దృశ్య కావ్యాలు తీసారు. ఇంకొంత మంది ఇంకొంచెం ముందుకెళ్ళి తమసొంత కథలు కల్పించి మెప్పించారు. లవకుశ జననం ఆ తరువాత కథ ఉత్తర రామాయణంగా అందరికి పరిచయమే, వాల్మికి ఇది రాయక పోయిన రాసిన వాళ్ళు అందులో వాల్మీకి పాత్ర సృష్టించి అది యదార్ధ గాధగా నిల్చేలా చేసారు.

కథ అందరికి తెల్సిందే!! కాని ఉత్తర రామాయణం లో అత్యంత క్లిష్టమైన ఘట్టం, అత్యంత ఉదాత్తమమైన ఘట్టం సీత పరిత్యాగం. చాకలి వాని అజ్ఞానాన్ని కూడా వదలక దాన్నే జనాభిప్రాయం గా తలచి, ఒక రాజుగా తన కర్తవ్య నిర్వహణ కోసం, సీతమ్మ వారికీ చెప్పకుండా లక్ష్మణుడికి చెప్పి అడవులలో విడిచి రమ్మనడం అనేది యుగాధర్మమేమో, రాజధర్మమో కానీ న్యాయం అయితే కాదు ఏ కోణంలో చూసిన సరే

సీతమ్మ వారు ఒక మహారాణి అందులో అన్ని కష్టాలు పడి వనవాసం చేసి రావణుని గుప్పెట్లోనుంచి బయటకి వచ్చి శీల పరీక్ష చేసి రాజధాని కి వచ్చిన తరువాత ఎవరైనా ఇటువంటి కష్టాన్నికోరుకోరు. అందులో రాముని అత్యంత ప్రీతి పాత్రమైన సీతని ఇటువంటి కష్టానికి గురిచెయ్యటం కూడా ఎవరు ఊహించరు.

సీతమ్మ వారు నదీ తీరం లోని మునులు ఋషుల సమక్ష్యంలో కొన్ని రోజులు గడపాలని కోరిక రావటం రాబోయే కాలానికి సూచనేమో .

రాముడు రాజు ఐనప్పుడు చేసిన ప్రమాణం, ప్రజల అభిష్టమే తన అభీష్టం, ప్రజా వాక్కే తన వాక్కు, ప్రజల కోసం తన కష్ట నష్టాలు, ఇష్ట అయిష్టాలు , తనవాళ్ళు ఇటువంటి వాణ్ణి వదులుకుంటాను అని ప్రమాణం చేస్తే అది ఇంక శాసనమే, అటువంటిది, తమ జంట మీద అంట పెద్ద కళంకం వస్తే ఇంకా ఏమైనా ఉందా, మునుపటి తరాలకి రాబోయే తరాల ప్రతిష్ట ఏమి కావాలి అని తీసుకున్న నిర్ణయం. ఇంతటి  కఠిన నిర్ణయం తీసుకున్నాడు కాబట్టే రాముడు దేవుడయ్యాడు.. ఆ రాముడి కి అండగా నిల్చింది కాబట్టే సీతమ్మ దేవత అయ్యింది.

ఇంకా ఈ సందర్భానికొస్తే, అన్న ఆజ్ఞ జవదాటలేక, అట్లాగని ఇష్టం లేని పని చెయ్యాల్సి వచ్చిన లక్ష్మణుని పరిస్తితి ఎవరు కావాలని కోరుకోరు. తనకు అత్యంత ఇష్టమైన వదిన గారికి ఇంత అన్యాయం జరుగుతుంటే పడే ఆవేదన ఒక వైపు, ఈ ఆవేదన తన వదినగారికి కనిపించకుండా దాచటం ఇంకోవైపు, తన ఆలోచనలు గుర్రం లా పరిగెత్తుతుంటే మరొక వైపు సీతమ్మ వారిని అడవిలో వదిలే సందర్భం లో ఇద్దరి మధ్య మాటలు ఎలా ఉంటాయి? సినిమా లో ఈ సందర్భం లో పాట కంటే ఇంకో మాధ్యమం లేదు ఆ పరిస్తితి వివరించటానికి.

ఈ సన్నివేశంలో లవకుశలో పాట రాసిన ఇద్దరు మహారధుల కి సంబందించిన "Comparison" చేసేంత అర్హత అనుభవం, జ్ఞానం నాకు లేదు కాని పాటలు విన్న తరువాత లక్షణుడు ఏమి అలోచించి ఉండొచ్చుఅని కలిగిన ఆలోచన ఇద్దరు రచయితల ఆలోచన విధానం ఎలా ఉంటుంది అన్న విశ్లేషణ మాత్రమే ఇది.

ఏ నిమిషానికి ఏమి జరుగునో - లవ కుశ




ఏ  నిమిషానికి  ఏమి జరుగునో ఎవరూహించెదరూ                    
విధి  విధానమును  తప్పించుటకై ఎవరు సాహసించెదరూ

చిన్నప్పటినుంచి నా మదిలోను మనస్సులోను నిలచిపోయిన పాట ఇది, ఎప్పుడు ఏమి జరుగుతుందో, మన జీవితం ఏ గమ్యం ఏ మజిలి ఏ మలుపు తిరుగుతుందో మనకే తెలియదు అని నేర్పిన ఈ పాట ఇప్పటికి చేవులలోనే మారుమోగుతుంది. ఘంటసాల గారు స్వరపరచి పాడిన ఈ పాట ఆపాత మధురం.

కంచెయ నిజముగా చేనుమేసిన కాదనువారెవరు
రాదేయికి ( రాజే ఇది correct word) సాసనమని పలకిన ప్రతిఘటించువారెవరు                                        
  
ఇక్కడ చూస్తె కంచే చేను మేస్తే అంటే రాముడే సీతని పంపితే ఎవరు మాత్రం ఏమి చెయ్యగలరు అని లక్ష్మణుడు అనుకుంటాడు, దాన్ని విధి విలాసం గా భావిస్తాడు, ఈ సందర్భం లో ఇంతకన్నా ఏమి చెయ్యగలడు?ఎంతైనా అన్న, అన్నని దిక్కరించాతమే కాదు ఎదురు మాట ఎలా చెప్తాడు? అన్న మాటకి శాసనం ఇంకా దానికి తిరుగులేదు. కానీ ఈ పాటలో లక్ష్మణుని అసహాయత నేను ఏమి చెయ్యలేను అన్న సందేశం ఇస్తుంది.  
                                    
ఇంక తరువాత చరణం లోకి వెళ్తే

కరునామయులిది కాదనలేర, కఠిన కార్యమనబోర ??
సాద్వులకేప్పుడు వెతలేనా తీరని దుఖపు కథలేనా??

ఇనకులమున జనియించిన నృపదులు ఈ దారుణమును సాహించెదర ??
వినువీధిని రేనులుగా నిల్చి విడ్డురముగా చూసెదర ??

ఇక్కడ లక్ష్మణుడు ముందుగా తనగురించి ఆలోచిస్తాడు అనుకుంట, తను చేసే కార్యం కటినమైనిదిగా భావిచడం లో తప్పు లేదు ఎందుకంటే రాముడు అత్యంత కష్టతరమైన పని అప్పచెప్పాడు కాబట్టి. సాధ్వుల కెప్పుడు కష్టాలు అని ఇక్కడ సాధ్వి అంటే ముందుగా తనగురించి చెప్తున్నాడు కాబట్టి తనకి ఇంతటి కష్టాలు అని కూడా అనుకొవొచ్చు, నాకు ఎందుకు ఇన్ని కష్టాలు వచ్చాయి అని రాముని కోసం అష్ట కష్టాలు పడ్డ లక్ష్మణుడు ఇలాగ ఆలోచించటం విచిత్రమే, ఇక్కడ అందరు ఈ జరుగుతున్న దారుణం సహించి విడ్డూరంగా  చూస్తారా అని అనుకోవటం నిస్పృహ గా తోస్తుంది.

The meaning I thought initially was the following however didn't publish because the analysis was more towards Lakshmana's mind set,


సీతమ్మ వారిని పరిత్యజించటం అనేది కష్టతరమైన పని, అందులో నిండు చూలల్ని అడవి లో వదిలేసి రమ్మనటం రామునికి అత్యంత కటినమైనది, ఇది ఎవ్వరు విభేదించలేరు. సీత లేకుండా రాముడు సంతోషంగా  ఉండడటం అనేది జరగని పని. సీతారాములు సాద్వులు, వారు ఎన్ని కష్టాలకి గురి అయ్యారో అందరికి తెల్సు, 

ఇక్కడ అందరు ఈ జరుగుతున్న దారుణం సహించి విడ్డూరంగా  చూస్తారా అని అనుకోవటం నిస్పృహ గా తోస్తుంది.

ఎండకన్ను ఎరుగని ఇల్లాలికి ఎందుకో ఈ వనవాసాలు? 
తరచి  చుసిన  భోదపడవులే దైవ చిద్విలాసాలు 
అగ్నిపరీక్షకే నిల్చిన సాద్విని అనుమానించుట న్యాయమా 
అల్పుని మాటయే జనవాక్యమ్మని అనుసరించుటే  ధర్మమా 

 


ఇక్కడ జనం అంటే అందరు వస్తారు , రాజుకి ప్రతి పౌరుడు తన బిడ్డే,.అతను అల్పుడైన మేధావి ఐన. కాబట్టి అల్పుని మాట అని అనటం సమంజసమో కాదో తెలియదు. బిడ్డ ఎవరైనా కాని అభిప్రాయం మటుకు మార్చలేనిది, సీత ఆగి పరీక్ష చేసిన, అది ఎంతమందికి తెల్సు? కాబట్టి ఆ అభిప్రాయం నిజాలు తెలియని  జనాల్లోంచి పోదు. అందుకే రాముడు ఆ అభిప్రాయాన్ని సీతని త్యజించటం ద్వార జనల్లోని ఆ కాస్త సందేహం కూడా కలుగకుండా చేసాడు, ఎందుకంటే చరిత్ర మార్చలేడు కాబట్టి.

సీతమ్మ మహారాణి కాబట్టి ఎండకన్ను ఎరుగదు అని అనటం సమంజసం, కానీ 14 ఏళ్ళు వనవాసం చేసిన సీతకి ఎండ కొత్తేమి కాదు కష్టాలు కొత్తేమి కాదు కదా, అగ్ని పరీక్ష చేసింది లంక లో, కాని అనుమానించింది ఒక సాధారణ పౌరుడు, ఇక్కడ ఈ విషయం అందరికి ఎందుకు తెలియదో పక్కన పెడితే, రాముడు కాబట్టి సీతను స్వీకరించాడు, నేను ఎందుకు చెయ్యాలి అనే ప్రశ్నకి సమాధానం ఉండదు.

మొత్తానికి ఈ పాట లకష్మణుడి అస్తిర భావం, అసహాయత ని ఎక్కువ చెప్తుంది. లక్ష్మణుడి ఆలోచన విధానం లో ఎక్కువ స్పష్టత లేదు అనిపిస్తుంది. 

ఇక ఇదే సందర్భం లో శ్రీ రామరాజ్యం లో పాట ఎలా ఉందొ చూద్దాం.

 


గాలి  నింగి  నీరు  భూమి  నిప్పు  మీరు  రామా  వద్దనలేర  ఒక్కరూ
నేరం  చేసిందెవరు  దూరం  అవుతోందేవారు  ఘోరం  ఆపేదెవరు  ఎవరూ
రారే  మునులు  ఋషులు   ఏమైరి  వేదాంతులు  సాగే  ఈ  మౌనం  సరేనా?
కొండ  కోన  అడవి  సెలయేరు  సరయూ  నది  అడగండి  న్యాయం  ఇదేనా ?
 
లక్ష్మణుడు రధం మీద తీసుకెళ్తూ ఇంకా ఎక్కడో ఆశతో వెళ్తుంటాడు ఎవరైనా ఆపకపోతార అని. తనవల్ల కాలేదు, తమ అన్నదమ్ముల్ల వలన కాలేదు రాజమాతల వల్లన కాలేదు కనీసం మీరిన ఆపలేరా అని అక్రోసిస్తూ వెళ్తుంటాడు తనకు గుర్తుకు వచ్చిన వాళ్ళని దారిలో చూసిన వాళ్ళని అడుగుతాడు, మీరిన కనీసం "రామ ఈ పని వద్దు" అనండి అని,, ఎవరో నేరం చేస్తే తన అన్న వదిన ఎందుకు దూరం కావాలి అనే బాధ కనిపిస్తుంది, ఇది ఇప్పటి వాళ్ళ ఆలోచనకి సరిగ్గా సరిపోతుంది అని నా అభిప్రాయం, తనకి ఇది అన్యాయం అని తెల్సు కాని రాముని అడిగే ధైర్యం లేదు, అన్నగారి మాట జవదాటలేదు, అందుకని మౌనం గా ఉండటం సరి కాదు రామా ఇది ఆపు అని అడగటం లో లక్ష్మణుని బాధ ఉంది.




1st stanza
ముక్కోటి  దేవతలంతా  దీవించిన  ఈ  బంధం  ఇక్కడ  ఇప్పుడు  విడుతుంటే  ఎ  ఒక్కడు  కూడా  దిగిరార  ?
అందరికీ  ఆదర్శం  అని  కీర్తించే  ఈ  లోకం  రాముని  కోరగా  పోలేద  ఈ  రధముని  ఆపగలేదా ?
విదినైన  కాని  ఎదిరించేవాడే  విధి  లేక  నేడు  విలపించినాడే ఏడేడు  లోకాలకి  సోకేను  ఈ  శోకం

రంగ రంగ వైభవంగా జరిగిన సీతారాముల పెళ్లికి మూడు లోకాలు సాక్షులే. రావణ సంహారం కోసం ముక్కోటి దేవతలు దగ్గరగా వచ్చి దీవించి మరి పెళ్లి చేసారు, అటువంటిది, రావణ సంహారం అయిపోగానే ఇంకా ఈ బంధం తెగిపోతుంటే ఒక్కరు కూడా రాలేదా అని అడగటం చాల సమంజసం,అలాగే రావణ సంహారానికి అందరు సహకరించారు కాని సీతారాముల ఎడబాటుని ఒక్కళ్ళు కూడా ఆపలేకపోవటం శోచనీయం. లక్ష్మణుడు చేసే ప్రతి నిందలోను న్యాయం ఉంది, ఆదర్శం అని కీర్తిస్తే సరిపోదు, రధాన్ని ఆపి ఈ ఎడబాటుని మాపండి అని కవి ఎంతో చక్కగా చెప్తాడు.రాముడి శక్తి ముంది విధి కూడా తలవంచుతుంది అటువంటి వాడు సీతని త్యాగించి కన్నీరు మున్నీరు గా విలపించటం లక్ష్మణుడు దాన్ని గురించి బాద పడటం అనేది సందర్భోచితం. రాముడు నాకు ఈ రాజ్యాధికారం వల్లనే కదా సీతని త్యాగం చెయ్యాల్సి వచ్చింది నేను రాజ్య త్యాగం చేసి సీత తో నేను కూడా అడవులకి వెళ్ళిపోతాను అప్పుడు ఎటువంటి ఇబ్బంది ఉండదు అని అంటే ఎవరో ఒప్పుకోరు అందుకనే తన వంశం ఒక్క కీర్తి ప్రతిష్టల కోసం విధిలేక సీతని వదిలిపెట్టి విలపిస్తే లోకాలన్నీ విలపించావా అని ఎంత చక్కగా చెప్పారో కవి ?

2nd stanza
రారే  మునులు  ఋషులు   ఏమైరి  వేదాంతులు  సాగే  ఈ  మౌనం  సరేనా?
కొండ  కోన  అడవి  సెలయేరు  సరయూ  నది  అడగండి  న్యాయం  ఇదేనా ?
అక్కడితో  అయిపోకుండా  ఇక్కడ  ఆ  ఇల్లాలే  రాక్కసివిధికి  చిక్కిందా? ఈ  లెక్కన  దైవం  ఉందా?
సుగుణంతో  సూర్యుని  వంశం  వెలిగించే  కులసతిని  ఆ  వెలుగే  వెలివేసింద? ఈ  జగమే  చీకటి  అయ్యిందా ?
ఏ తప్పు  లేని  ఈ  ముప్పు  ఏమి  కాపాడలేర? ఎవరైనా కాని నీమాటే  నీదా  వేరే  దారేది  లేదా 




అక్కడితో అయిపోవటం అంటే 14 ఏళ్ల కష్టనష్టాలు అనుభవించిన సీత సాధ్వి ఇక్కడ రెండోసారి తన తప్పు లేకుండా మళ్ళా బలి అయ్యింది, మంచి వాళ్ళకి మంచి జరగక పొతే, ఇంకా దైవం ఎందుకు? అందులో సూర్యవంశం నిలబెట్టే సీతని ఆ రాముడే వేలివేసాడే? లక్ష్మి లేని ఇల్లు చీకటి పాలే కదా, ఇది చాల చక్కని వర్ణన, ఈ తప్పు  లేకుండా సీతని బలిచేయ్యద్దు రామా నీ కర్తవ్యం నీ ధర్మం నీదేనా సీత కి వేరే దారి లేదా అని చెప్పకనే చెప్పారు..

Conclusion
మనిషి మనస్తత్వం ఎలాంటిదంటే,కష్టం రాబోతోంది అనికాని తనకు ఇష్టంలేని పని జరగబోతుందని తెలిస్తే అది జరిగేంతవరకు ఆపటానికి సాయశక్తుల ప్రయత్నిస్తాడు తనవల్ల కానప్పుడు నానావిధలుగా ప్రార్దిస్తాడు అది జరుగకుండా ఉండటానికి. అంతే కాని ఇది విధి రాసిన రాత అని నిస్పృహతో వోటమిని ఒప్పుకోడు అని అనుకుంటున్నాను, జొన్నవిత్తుల గారు ఈ "Psycology" తో  పాట రాసారు అని నాకు అనిపించింది. 


కాని సదాశివ బ్రహ్మం గారు లక్ష్మణుడికి ఉన్న పరిణితితో అలోచించి విధి ముందు ఎవరు ఏమి చెయ్యలేరు అని ఆలోచించే విధంగా రాసారు అనిపిస్తుంది, కాని కంచే చేను మేసింది అని ప్రస్తావించి సీతారాముల దంపత్యాన్ని సరిగ్గా చూపలేదేమో అని నా అభిప్రాయం. అలాగే విను వీదులలో విడ్డూరం గా చూడటం తప్ప ఏమి చెయ్యలేరు అని రాస్తే జొన్నవిత్తుల గారు అన్నిలోకలు శోకం లో మునిగిపోతారు అని రాసారు. ఇది చాల సత్యం. ఎవరు ఈ ఘోరాన్ని చూసిన శోకం లో మునిగిపోవటం ఖాయం. 
 

అందుకనే జొన్నవిత్తుల గారు రాసిన ఈ పాట ఆ సందర్భానికి ఎక్కువ దగ్గరగా ఉందని నా అభిప్రాయం మాత్రమే.  విజ్ఞులు ఎవరైనా  నా అభిప్రాయాన్ని సరి దిద్దితే అదే పది వేలు..

5 comments:

  1. మీ విశ్లేషన చాలా బాగుంది గురువు గారు.

    "కరునామయులిది కాదనలేర, కఠిన కార్యమనబోర ??
    సాద్వులకేప్పుడు వెతలేనా తీరని దుఖపు కథలేనా??

    ఇక్కడ లక్ష్మణుడు ముందుగా తనగురించి ఆలోచిస్తాడు అనుకుంట, తను చేసే కార్యం కటినమైనిదిగా భావిచడం లో తప్పు లేదు ఎందుకంటే రాముడు అత్యంత కష్టతరమైన పని అప్పచెప్పాడు కాబట్టి."

    నాకు ఇక్కడ లక్ష్మణుడు తన గురించి కాక రాముని గురించే అంటున్నాడు అనిపించింది. ఎందుకంటే ఆ తరువాతి వాఖ్యం చూస్తే లక్ష్మణుడు అన్నా వదినల గురించే అలోచిస్తున్నాడు అనిపిస్తుంది.

    ReplyDelete
  2. మీ విశ్లేషణ బానే ఉంది కాని.. కొన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు. లవకుశ పాటలో, ఆక్రోశం కన్నా, ఆరోపణ ఎక్కువ వుంది.

    కంచె అనేది చేను ని రక్షించటానికి. ఇక్కడ, భర్త గా సీతను సరిగా చూసుకోవాల్సిన బాధ్యత రాముడికి ఉంది. అలాంటి భర్త, భార్యను అడవుల పాలు చేయడం అంటే, కంచె చేను మెసినట్టు, రక్షించాల్సినవాడే శిక్షిస్తున్నాడు అని ఎత్తిపొడుపు. తర్వాత వాక్యం, రాధేయి కాదు. "రాజే ఇది శాశనమనిన" అంటే, ఆ శిక్షే శాశనం అని రాజు చెబితే, దానికి ఎదురు చెప్పే వాళ్ళెవరుంటారు... అని రాముడి చేసిన పనిని నిందిస్తున్నాడు.

    ఇక కరుణామయులిది...సాధ్వులకెపుడు.. అన్న చరణం కు మీరిచ్హ్చిన అర్థం పూర్తిగా తప్పు. ఈ పాట మొత్తం నిందారోపణం గా సాగుతుంది. కఠిన కార్యం అంటే... కష్టమైనది అనే కాదు, తప్పు అనే అర్థం లో ఇక్కడ ఉపయోగించబడింది. కరుణామయులు, ఇది తప్పని చెప్పకుండా ఉంటారా అని ప్రశ్నిస్తున్నాడు.

    సాధ్వీమణులుగా పొగడబడే, అనసూయ, సుమతి, సావిత్రి, మొదలైనవాళ్ళందరూ పరీక్షలకు గురి అయినారు. ఇక్కడ అప్రస్తుతం అయినా, ద్రౌపది కూడా, అవమానాలకు, కష్టాలకు గురి అయింది. అంచాత, సాద్వులు అంటే, వాళ్ళకు కష్టాలు తప్పవా అని ప్రశ్నిస్తున్నాడు.

    ప్రతిమాట, పదం, లక్ష్మణుని ఆక్రోశాన్ని, అరోపణలను, బాధను వ్యక్తం చేస్తుంది. సందేహం లేదు. జొన్నవిత్తుల వ్రాసింది కూడా అంతే... న్యాయం ఉందా? ఎవరూ ఆపరా?? ఇది సమంజసమేనా అని అడగడమే కదా... అక్కడైనా అదే కదా వ్రాసింది. స్పష్టతలో ఏం తేడా కనిపించింది.

    జొన్నవిత్తుల వ్రాసిన పాట బానే ఉంది కాని, దాన్ని చంకనెత్తుకోవడం కోసం, విపరీతార్థలు తీసి, లవకుశ పాటను తీసిపారేయకండి. ఆ పాటకు వంక పెట్టేంత గొప్పోళ్ళం కాము మను...

    --తెలుగోడు

    ReplyDelete
  3. ఇంకొక్క విషయం. మీ Analysis చూశి, నేను కూడా అదే ఫ్లో లో వెళ్ళిపోయాను. కాని, ఈ పాటలు రెండూ, లక్ష్మణుడు పాడేవి కావు. background లో వచ్చే పాటలు. ఆ సందర్భాన్ననుసరించి, పాత్రల వేధనలు ప్రతిబింబింప చేస్తూ, ఇంకెవరో పాడినట్టుండే పాటలు. of course, లక్ష్మణుడి వేధన అనుకోవచ్చు. అలా తీసుకున్న పక్షం లో కూడా, SRR పాటలో, లక్ష్మణుడు, అందర్నీ అర్థిస్తున్నట్టుంది. లవకుశ పాటలో, లక్ష్మణుడు, 'ఇలాంటి శిక్ష విధించడం న్యాయమా, అల్పుని వాక్యం జనవాక్యమని అనుసరించుటే ధర్మమా' ' అని రాముణ్ణి ప్రశ్నిస్తున్నటుంది. నిజానికి ఇలా పాటలను పోల్చడం సరికాదు. ఒకవేళ పోల్చాలంటే, ఎవరినో అర్థించడం కన్నా, అది తప్పు అని రాముణ్ణి నిందించడం, ఇలాంటి పనులుచేస్తే, నింగిలో అంతా లైన్ లో నిలబడి చూసి హర్షిస్తారనుకున్నావా అని హెచ్చరించడమే గొప్పగా అనిపిస్తుంది. (btw, రేనులు కాదు... శ్రేణులు)

    btw, I saw you have updated your post, but did not publish my comments :) if you want more discussion, you can contact me seemaputrudu@gmail.com

    ReplyDelete
  4. Sadasiva brahmam garu మీరన్నట్టు లక్ష్మణుడు రాముని నిందిస్తున్నట్టు గా చూపించారు, మంచి వాళ్ళకే కష్టాలు ఎందుకు వస్తున్నాయి అన్న ఆలోచనే చూపెట్టారు, ఆ సందర్భం లో అది సమంజసమే ,

    నేను అనుకున్నది లవకుశ లో నిరాశవాదం నిస్పృహ, నిందా చూపెడితే
    శ్రీరామ రాజ్యం లో ఆశావాదం, అన్నగారిని నిందిన్చకపోవటం, రావనసంహారం లో అడుగడున సహాయపడిన వాళ్ళెవరు ఇప్పుడు ఏమి చెయ్యకపోవటం వాళ్ళని ప్రశ్నించటం కనిపిస్తుంది, ఈ రెండిటిలోను ఎవరి పద్దతిలో వాళ్ళు చెప్పారు, లవకుశ పాట ఇన్నాళ్ళు నిల్చిందంటే అది వాళ్ళ గొప్పతనం

    కాని ఇప్పటి సమకాలీన ఆలోచన విధానం లో నాకు లక్ష్మణుడు నిస్పృహ చెందితే ఎట్లా అనిపించింది అంతే.. అంతే కాక లవకుశ లో రామలక్ష్మణుల సంవాదం చూపిస్తారు అప్పుడు రాముడు రాజ ధర్మం ప్రకారం తను చెయ్యవలిసిన కర్తవ్యం కూడా చెప్తాడు అది ఐన తరువాత కూడా రాముని నిందించటం తగదేమో అనిపించింది, ఇంకా రాముడు యాగం తలపెట్టినప్పుడు బంగారు సీత పక్కన పెట్టి చేయ్యోచు అని సలహా ఇచ్చి తరుణోపాయం చూపిన వాళ్ళు ఈ పరిస్తితి కి ఏదో ఒక తరుణోపాయం చెప్పరా అన్న ఆలోచన ఉంటుందేమో లక్ష్మణుడుకి అని నా అభిప్రాయం అది కాక అల్పుడు మాట ప్రజల మాట అని Ninda లక్ష్మణుడు చేస్తాడా అనిపించింది...

    ReplyDelete
  5. Sai garu

    నాకు ఆ రెండు లైన్స్ లో అనిపించినా అర్థం ముందు రాయలేదు, మీ కామెంట్ తరువాత Update చేశాను చూడండి

    ReplyDelete