Friday, December 30, 2011

Song of the week - Kottagaa Rekkalochena - Swarnakamalam

కొత్తగా రెక్కలోచ్చెనా 
ముందు మాట : Instead of posting same matter every time, providing the link to one of the earlier posts. ( What inspired me to write this series)


ఇక ఈ వారం పాట:
కొత్తగా రెక్కలోచ్చెనా - స్వర్ణ కమలం 
Youtube Video Link for the Song
Movie       -     Swarna Kamalam
Director    -     Kasinadhuni Viswanath
Producer  -     Usha Kiron Movies
Music Director - Maestro Ilayaraja
Lyrics -             Sirivennela Seetarama Sastry
Singer (s)          - S.P.Balasubrahmanyam and S. Janaki

Song Lyrics
కొత్తగా రెక్కలొచ్చెనా గూటిలోని గువ్వపిల్లకీ 
మెత్తగా రేకు విచ్చెనా మెత్తగా రేకు విచ్చెనా
కొమ్మచాటువున్న కన్నెమల్లెకి కొమ్మచాటువున్న కన్నెమల్లెకి
కొత్తగా రెక్కలొచ్చెనా మెత్తగా రేకు విచ్చెనా

కొండదారి మార్చింది కొంటె వాగు జోరు
కులుకులెన్నో నేర్చింది కలికి యేటి నీరు  
(2) 
బండరాళ్ళ హోరుమారి పంటచేల పాటలూరి  (2)
మేఘాల రాగాల మాగాని వూగెలా సిరిచిందు లేసింది కనువిందు చేసింది  
|| కొత్తగా || 

వెదురులోకి వొదిగింది కుదురులేని గాలి
ఎదురులేక యెదిగింది మధురగాన కేలి 
 (2) 
భాషలోన రాయలేని రాసలీల రేయిలోని 
 
అబ్బ... భాషలోన రాయలేని రాసలీల రేయిలోని
యమునా తరంగాల కమనీయ శ్రుంగార కళలెన్నో చూపింది కలలెన్నో రేపింది 
|| కొత్తగా || 

పాటకి ముందు వచ్చే scenes
విశ్వనాద్ గారి సినిమాలలో చాల వాటిల్లో సూక్ష్మంగా ఒక సందేశం ఉంటుంది, అదేమిటంటే మనసు పెట్టి ఏదైనా కళని ఆరాధిస్తే, అనుభవించి ఆ కళలో అంతర్లీనమిత మనిషికి వచ్చే ఆనందం వర్ణనాతీతం. అదే మాట అయన సినిమాల్లో అనేక పాత్రల చేత చెప్పిస్తారు.  ఈ సినిమా ఒక అత్యద్బుతమైన కళా సంపద, ప్రక్రుతి ప్రసాదించిన అందం, ఉన్న ఒక అమ్మాయి తన తండ్రి ప్రసాదించిన విద్యని తృణీకరించి, ఆ విద్య గొప్పతనం తెలియక వేరే ఆనందాల కోసం వెంపర్లాడితే, కళ విలువ తెలిసి, ఆ అమ్మాయి విద్య, గొప్పతనం తెల్సిన కథానాయకుడు, ఆ అమ్మాయికి నాట్యం విలువ, తద్వారా వచ్చే ఆత్మానందాన్నితెలియచేసి ఆ అమ్మాయిని సరియిన దారిలో పెట్టి, ఆ అమ్మాయిని స్వర్ణ కమలంగా మార్చిన కథ ఇది.

ఈ సినిమాలో అనేక సన్నివేశాలు కొన్ని హాస్యం కలుగ చేస్తే, ఇంకొన్ని మనల్ని అందులో involve అయ్యేటట్టు చేస్తాయి. కొన్ని హృద్యంగా ఉండి ఎక్కడో బలం గా తాకుతాయి. అందులో ఒకటి, త్యాగరాజ జయంతి నాడు హీరోయిన్ తండ్రి జట్కా బండి లో వెళ్తుంటే మిగితా ప్రపంచం అంతా అత్యంత వేగంగా వెళ్తుంటే హీరోయిన్ అనే మాట ఈ సినిమాలో హీరోయిన్ ఆలోచన విధానం ఏమిటో తెలియచేస్తుంది. కళల పట్ల తగ్గుతున్న ఆదరణ, ప్రస్తుత పరిస్తితుల్ని గురించి హెచ్చరిస్తుంది.
పాట సందర్భం 
హీరోయిన్ చేత బలవంతం గా నాట్య ప్రదర్సన చేయిస్తే, ఆమె చేసిన మూర్ఖత్వం వల్ల తండ్రిని కోల్పోతుంది, ఐన ఆమె మారదు. చివరికి ఆమె కోరుకున్నట్లే ఒక హోటల్ లో ఉద్యోగం ఇప్పిస్తాడు హీరో. అక్కడ అనుకోని పరిస్తితుల్లో నాట్యం చెయ్యాల్సి వస్తుంది. ఆ నాట్యం నచ్చక నాట్య కళ అభ్యసిస్తున్న ఒక విదేశి వనిత లేచి వెళ్ళిపోతుంది. ఆ తరువాత హీరో ని పిలిచి నాట్యం లో తప్పొప్పుల్ని తెలియచేస్తుంది. అంతే కాక ఒక నెలలో మరల వస్తాను, ఈ సారి సరిగ్గా ప్రదర్సన ఇస్తే అమెరికా తీసుకు వెళ్తాను అని ఇద్దరికీ చెప్తుంది. ఆ మాటలు విన్న హీరోయిన్ ఇంటికి వెళ్లి, తన అక్క, స్నేహితురాలు, హీరో, ఇలాగ అందరి మాటలు గుర్తుకు తెచుకొని ఆలోచలనలో పడి మనసు మార్చుకొని గజ్జెలు సంచి లో వేసుకొని సముద్రం ఒడ్డున నాట్య సాధన( విశ్వనాద్ గారు ప్రకృతికి చెందిన కళ ప్రక్రుతి తోనే ఎక్కువ సార్లు చూపిస్తారు తన సినిమాలలో, గానం చేసిన కాని, నాట్యం చేసిన కాని, బొమ్మ గీసిన గాని. ) మొదలు పెడ్తుండగా ఒక మూల నుంచి అద్బుతమైన గొంతు పాట పాడటం విని ఆగిపోయి, ఆశ్చర్యపోయి అటు వైపు చూస్తుంది.


పాట ప్రారంభం 
బాలసుబ్రహ్మణ్యం గారు ఈ పాట ఆలాపన చేసిన తీరు అత్యంత మధురం గా ఉంటుంది, అలాగే అమృతం లాగ ఉంటుంది అయన గొంతు వింటే, అయన పాటని అద్బుతం గా అరంబించిన అనేక పాటల్లో, "వేవేల వర్ణాల" ( సంకీర్తన ), "కీరవాణి" ( అన్వేషణ ),  "చైత్రము కుసుమాంజలి" (ఆనంద భైరవి) ఇలాగ ఎన్నో ఎన్నెన్నో.

ఇళయరాజా , బాలసుబ్రహ్మణ్యం వీరి  బంధం ఎన్నెన్ని జన్మలదో కాని, వారిద్దరూ సమకాలీనులు కావటం, వారిద్దరి సంగీతం వినగలగటం మనం చేసుకున్న పూర్వ జన్మ సుకృతం. ఇంక జానకి గారి భావప్రకటన గురించి ఏమని వర్ణించ గలం?  


ఇంకా పాటలోకి వెళ్తే
కొత్తగా రెక్కలొచ్చెనా గూటిలోని గువ్వపిల్లకీ 

ఈ పాటలో చాల ప్రయోగాలు సిరివెన్నెల చేసారు. అసలు పాట ప్రారంభమే అమోఘం. గువ్వ పిల్లకి కొత్తగా రెక్కలు రావటము అనే పద ప్రయోగంలో సినిమా మొత్తం చెప్పేసినట్టు ఉంటుంది. పక్షికి సహజంగా  రెక్కలు ఉంటాయి, ఆ పక్షి వాటితో ఎగురుతుంది, అది దాని లక్షణం. కాని ఆ పక్షి ఎగురకపోతే ఆ రెక్కలు ఉన్న లేనట్టే కదా. అలాగే హీరోయిన్ కి సహజంగా నాట్య కళ లభిస్తుంది, కాని ఆ కళని సంపన్నం చేసుకోలేదు, సార్థకత తీసుకు రాలేదు. ఇప్పుడు జరిగిన అనేక సంఘటనల ప్రభావమో కానీ, వచ్చిన  సదవకాశం ఉపయోగించుకొని అమెరికాకి ఎగిరి వెళ్ళాలనే తపన కాని,  ఏదైనా కారణం వల్ల కాని ఇప్పుడు ఆమె తనంతట తాను నాట్య సాధన కోసం గజ్జెలు తీసుకొని బయలు దేరిందంటే పక్షికి ఎగరటానికి రెక్కలు వచినట్లే ఇక్కడ హీరోయిన్ కి కూడా ఎగురటానికి రెక్కలు వచ్చినట్లే. రెక్కలు కొత్తగా రావటం అంటే, ఉన్న రెక్కలకి కొత్త శక్తి వచినట్లే. 

మెత్తగా రేకు విచ్చెనా మెత్తగా రేకు విచ్చెనా 
కొమ్మచాటువున్న కన్నెమల్లెకి కొమ్మచాటువున్న కన్నెమల్లెకి 

మల్లె రేకులు నెమ్మదిగా విచ్చుకుంటే , ఒక్కొక్క రేకు పరిమళం వెదజల్లుతుంది. ఆ మల్లె కొమ్మ చాటున ఉన్న లేక పోయిన పరిమళం ఇస్తుంది. కాని కొమ్మ చాటున ఉన్న మల్లెకి అందులో కన్నె మల్లెకి అంటే వాడని పువ్వుల పరిమళం అని ఎందుకన్నారంటే, హీరోయిన్ ఇప్పటివరకు నాట్య కళని కొమ్మ చాటున అంటే ఇంటి పట్టునే తనలోనే దాచుకుంది, మంకు పట్టు పట్టి ముడుచుకుని కళ యొక్క పరిమళాన్ని తనలోనే దాచేసుకుంది. అటువంటిది, ఇప్పుడు తనకు తానె రెక్కలు విచ్చుకొని నాట్య సాధనకు వస్తే వచ్చేది పరిమళమే, నటనాభినయ సుగంధమే.

ఇదే విశ్వనాధ్ గారు సంభాషణ రూపం లో చెప్పిస్తారు. పాట గొప్పతనం అందరికి అర్థం అయ్యేలా చెప్పటానికి.
హీరోయిన్: గూళ్ళు ఏమిటి, గువ్వలేమిటి కొత్తగా రెక్కలు  రావటమేమిటి? ఏమిటండి ?
హీరో: మీరు మనస్పూర్తిగా ఆ గజ్జెలు కాళ్ళకు కట్టుకున్టున్నారంటే గువ్వపిల్లకి  కొత్తగా రెక్కలోచినట్లే కదండి!!
హీరోయిన్: మీకు కవిత్వం కూడా వచ్చా?
హీరో: మీ  కాళ్ళని చూస్తుంటేనే కవిత్వం వచేస్తుంది (ఇక్కడ హీరోయిన్ కళ్ళు తిప్పటం ఆమె కళ్ళకున్న అందాన్ని, ఆ కళ్ళల్లో చిలిపితనం, కొంటెతనం  చూపించటానికేనేమో!!!)
మీరు గంధం చెక్కలాంటి వారు, నేనేమో రాయిలాంటి వాణ్ణి మంచి గంధం తీయాలంటే ఏమి చేస్తారు? రాయి మీద ఆరగ తీస్తారు ఇప్పుడు మీరు సాధన చెయ్యటానికి వచ్చారు  కదా, ఈ  రాతిని ఉపయోగించుకోండి, మీ అభినయం సుగంధాలు విరజిమ్ముతుంది


ఇళయరాజా గారి స్వర కల్పన నిజం గానే పక్షి ఎగురుతున్నంత భావం కలిగిస్తారు తన స్వరాలతో. పదాలకి న్యాయమే కాదు, సన్నివేశానికి ఇదే సరి ఐన పాట గా తన ముద్ర వేస్తారు.

చరణం 1
కొండదారి మార్చింది కొంటె వాగు జోరు
కులుకులెన్నో నేర్చింది కలికి యేటి నీరు  
 (2) 
బండరాళ్ళ హోరుమారి పంటచేల పాటలూరి  (2)
మేఘాల రాగాల మాగాని వూగెలా సిరిచిందు లేసింది కనువిందు చేసింది


జోరు మీద ఉన్న వాగు గమనం చూస్తే ఎవరికైనా ఒక అద్బుతమైన అనుభూతి కలుగుతుంది. దారిలో వచ్చే అడ్డంకుల్ని దాటుకుంటూ, పరవళ్ళు తొక్కి ప్రవహిస్తుంటే, ఆ వంకర టింకర ప్రవాహంలో ఆ వాగు చేసే కులుకులు చూడవలసిందే. నది వాగ లా మారి అలాగ శబ్దం చేస్తూ ప్రవహిస్తుంటే, ఆ వాగు నీటికి పంటలు పచ్చగా పెరిగి ఊగుతుంటే, ఆ పచ్చదనం చూసిన వాళ్ళకి కనువిందే కదా. పంటలు పెరిగితే ఇంట్లో లక్ష్మి కళకళ లాడుతుంది.  మేఘాల రాగం మల్ల ఈ పాట లో కూడా వాడారు సిరివెన్నెల గారు.  హీరోయిన్ చేసే నాట్యాన్ని ఇలాగ ఒక వర్ణన అద్భుతమైన ప్రయోగం. వాగు జోరు మీద ప్రవహిస్తే వచ్చే ఫలితం, ఆమె నాట్యం చేస్తే వచ్చే ఫలితం కూడా ఒక్కటే, అందరికి కనువిందు కలగటం. అది ఎంత చక్కగా వివరించారో?

విశ్వనాద్ గారు గజ్జెలకి చాల ప్రాధాన్యతని ఇస్తారు. సప్తపది లో కాళ్ళ పట్టీలకి నది జలంతో అభిషేకిస్తే, ఇక్కడ గజ్జేలని నదిలో కడిగించి హీరో చేత కాళ్ళకి కట్టిస్తారు. 

చరణం 2
వెదురులోకి వొదిగింది కుదురులేని గాలి
ఎదురులేక యెదిగింది మధురగాన కేలి 
  (2) 
భాషలోన రాయలేని రాసలీల రేయిలోని 
  
అబ్బ... భాషలోన రాయలేని రాసలీల రేయిలోని
యమునా తరంగాల కమనీయ శ్రుంగార కళలెన్నో చూపింది కలలెన్నో రేపింది 



ఇన్నాళ్ళు కుదురులేకుండా అటు ఇటు తిరుగుతున్న హీరోయిన్, ఇప్పుడు నాట్య సాధనకు కుదురుకుంది. ఆ పర్యవసానం ఎట్లా ఉంటుంది అంటే ఎలా చెప్పాలి? మళ్ళ ఇక్కడ వేణువునే వాడుకున్నారు. గాలి వెదురులోకి దూరితే వచ్చేది మధుర గానమే. ఆ రాగనుభూతి భాషకి అందని భావమే. ఇంతటి తో ఆగకుండా, హీరో/హీరోయిన్ ల మధ్య జరిగే భావాల్ని కూడా చెప్తారు. వాళ్ళలో రేగే ఆలోచనల ప్రతి రూపమే ఆ ముగింపు. హీరో మొదట గజ్జె కట్టి నాట్యం అభినయిస్తే, దాన్ని హీరోయిన్ సరిదిద్దుతుంది, ఆ సీన్ ఇక్కడ అక్కడ కంటే ఇక్కడ బాగుండేదేమో. లేకపోతె నన్ను ఉపయోగించు కొండి అన్న దానికి ముందు పెట్టారేమో, అతనిని సరిదిద్దుతూ తన నాట్య సాధనలోకి వెళ్ళిపోతుంది.


ఈ పాట సెలయేరు ప్రవాహం లాగ, కొంటె వాగు జోరు లాగ సాగుతుంది అనిపిస్తుంది, ఆ పద ప్రయోగం చూస్తే.  గాలి-కేళి,  జోరు-నీరు వెదురు-ఎదురు, ఒదిగింది-  ఎదిగింది,  మార్చింది- నేర్చింది, వాగు - యేరు ఈ పదాలు వింటుంటే ఇలాంటి పాటలు మరల రావేమో అనిపిస్తుంది. ఒక్కోసారి తెలుగు పాటా నీ ఆయుష్షు తీరిందా అని అడగాలనిపిస్తుంది .


ఆ ప్రశ్నవివరాలతో మరల వచ్చే వారం కలుద్దాం.

Tuesday, December 27, 2011

Song of the week - Nee prasnalu neeve - Kotta Bangaru lokam

Song of the week: Nee prasnalu neeve 
Movie -            కొత్త బంగారు లోకం
Director -          శ్రీకాంత్ అడ్డాల
Production -     దిల్ రాజు 
Music Director - Mickey J Meyer
Lyrics -             Sirivennela SeetaRama Sastry
Singer -            S. P. Balasubrahmanyam


ఈ పాట నేను కొన్ని వందల సార్లు విని ఉంటాను, విన్నప్పుడల్లా అర్థం ఇది కాదేమో, పాట అర్థంతో మనసు సంతృప్తి చెందలేదు ఇంకో సారి వినాలి అనిపించేది. ఒక్కోసారి ఈ  పాట, ఇందులో ఇంత అర్థం ఉందా అని ఆశ్చర్య పరిచేది. ఈ పాట సిరివెన్నెల గారు సినిమా కోసం రాసారో లేక అంతకు ముందు రాసుకున్న పాటని సినిమా కోసం మార్చి వాడుకున్నారో?  నాకు రెండో చరణం తప్ప మిగితా పాట జీవితాన్ని చదివేసి అది వివరించే తపన లాగా కనిపిస్తుంది. ఈ పాట రాసిన సిరివెన్నెల గారు ఎంత దన్యులో ఈ పాట వినగలిన మన లాంటి వారెందరో కూడా అంత ధన్యులే. ఇంత చిన్న పాటలో అనంతమైన అర్థం చెప్పిన సిరివెన్నెల గారికి సహస్ర కోటి పాదాభి వందనాలు. 

బాలు గారు పాడినట్టుగా ఈ పాట  ఇంక ఎవ్వరు పాడలేరు, ఇది ఎవరు కాదనలేని సత్యం. మంచి గళం, అత్యద్బుతమైన పాట ఉంటె, దానికి ప్రాణం దానంతట అదే వస్తుందేమో. మిక్కీ జే మెయెర్ ఈ పాటకి స్వర కల్పన చెయ్యగలగటం ఆయనకి అయాచితం గా వచ్చిన వరం. ఆ వరాన్ని సద్వినియోగ పరచుకోవటం ఆయన పూర్వ జన్మ సుకృతం.


పాటకి ముందు వచ్చే scenes
ఈ పాటకి ముందు వచ్చే scenes లో ఒకటి హీరోయిన్ ఫోన్ లో మాట్లాడుతూ పారిపోదాము అని హీరో ని కోరుతుంది, రైల్వే స్టేషన్ లో 4:00 కి వెయిట్ చేస్తా వచ్చెయ్యి  అంటూ టైం fix చేస్తుంది , ఇంక ఇల్లు వొదిలి శాశ్వతంగా వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంటుంది. అదే నిర్ణయం అమలు చెయ్యటానికి ఇద్దరు సమ్మతమవుతారు, కాని ఇద్దరి లో కొన్ని వేల ప్రశ్నలు, బిడియం, భయం ఆందోళన మొదలువుతుంది.  


హీరోయిన్ ఫోన్ లో మాట్లాడి ముగించగానే, అప్పుడు ఆ సందర్భం లో dialogs అద్బుతం గా ఉంటాయి, "మన గదిలో లైట్ తీసేసే ముందు పక్క గదిలో లైట్ ఉందొ లేదో చూసుకోవటం తెలియదు కాని ఒక్కదానివి వెళ్లి ఆ కుర్రోడి కోసం వెయిట్తో చేద్దామనుకున్నావే?? పాపం మీ నాన్న నీ మనసుకే కాపలా కాయాలి అని అనుకుంటున్నాడు. మీ నాన్న చేసే అతి జాగ్రత్త వలన నువ్వెక్కడ నీ చిన్ని చిన్ని ఆనందాలని కోల్పోతావేమో అని నిన్ను హాస్టల్లో జాయిన్ చేయిస్తే, ఆ రోజు అది రైట్ అనుకున్నాను అది తప్పు అయిపొయింది. ఇవ్వాళ శాశ్వతంగా నువ్వు నీ ఆనందం కోల్పోతావని బయటకి వెళ్లి పోదామనుకున్నావు చూడు, నువ్వు రైట్ కావొచ్చు ఎందుకంటే, ఇవ్వాళ రైట్ అనుకున్నది రేపు తప్పు కావొచ్చు, ఇవ్వాళ తప్పు అనుకున్నది రేపు రైట్ అవుతుంది."


ఇంక ప్రకాష్ రాజ్ కి హీరో ప్రేమ వ్యవహారం తెలుస్తుంది, అప్పుడు హీరో స్నేహితురాలి తో అన్నdialogs చాల   ఆలోచింపచేస్తాయి. "ఇన్ని ఆలోచనలు మనసులో పెట్టుకొని ఎగ్జామ్స్ వాడు ఏమి రాసి ఉంటాడు? వాళ్ళ అమ్మ వాడి గురుంచి ఎన్ని కలలు కంది? వాడి చిన్నప్పుడు నేను కాల్చి పారేసిన cigarette వాడు కలిస్తే వాడిని కొట్టలేదమ్మ, నేనే cigarette మానేసాను.  ఎందుకంటే పిల్లల్ని భయం తో కాకుండా ప్రేమతో పెంచాలనుకున్నాను, కానీ ఇప్పుడు అర్థం అవుతోంది, ప్రేమ తో పెంచిన భయం తో పెంచిన మీ హృదయాలని control చెయ్యలేము అని. ఇప్పుడు తిట్టాల? కొట్టాల ? ఇవేవి ది నాకు అందరిలాగా తెలియని పని, నాకు తెలిసినదల్ల ప్రేమించడమే, ఇంకా ప్రేమిస్తాను అప్పుడైనా వాడు తెలుసుకుంటాడో  లేదో? "".


ఇంకో పక్క హీరోకి అలజడి మొదలు అవుతుంది, తన ఆలోచనలో తను ఉంటాడు, ఇంకో పక్క తండ్రి ఒక్క మాట కూడా అనడు, కానీ తండ్రిని చూస్తే ఏదో అలజడి. చెప్పాలని ఉన్న చెప్పలేని నిస్సహాయత, తండ్రి ఎగ్జామ్స్ పాస్ అవ్వాలని వాచ్ ఇస్తే, పరీక్షలు సరిగ్గా రాయలేదని వాచ్ తిరిగి ఇచ్చేయ్యలనుకుంటాడు, అప్పుడు హీరో, ప్రకాష్ రాజ్ మధ్య dialogs కూడా చాల బాగుంటాయి. తల్లి తండ్రులకి బిడ్డలు పాస్ అయిన ఫెయిల్ అయిన పిల్లలు పిల్లలే. అటువంటి వాళ్ళని వదిలేసి పిల్లలు ఎక్కడికో వెళ్లి ఏమి చేద్దామనో?

తండ్రిని స్టేషన్లో దింపి హీరో తన ప్రేమ ప్రయాణం గురించి ఆలోచిస్తూ నడుస్తుంటే వచ్చే పాట ఇది.,.


||ప|| |అతడు|
       నీ ప్రశ్నలు నీవే ఎవ్వరో బదులివ్వరుగా
       నీ చిక్కులు నీవే ఎవ్వరూ విడిపించరుగా
       ఏ గాలో నిన్ను తరుముతుంటే అల్లరిగా
       ఆగాలో లేదో తెలియదంటే చెల్లదుగా
       పది నెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా
       అపుడో ఇపుడో కననే కనను అంటుందా
       ప్రతి కుసుమం తనదే అనదే విరిసే కొమ్మైనా
       గుడికో జడకో సాగనంపక ఉంటుందా
       బతుకుంటే బడి చదువా అనుకుంటే అతి సులువా
       పొరబడినా పడినా జాలిపడదే కాలం మనలాగా
       ఒక నిమిషం కూడా ఆగిపోదే నువ్వొచ్చేదాకా


||చ|| |అతడు|
       అలలుండని కడలేదని అడిగేందుకె తెలివుందా
       కలలుండని కనులేవని నిత్యం నిదరోమందా
       గతముందని గమనించని నడిరేయికి రేపుందా
       గతి తోచని గమనానికి గమ్యం అంటూ ఉందా
       వలపేదో వల వేసింది వయసేమో అటు తోస్తుంది
       గెలుపంటే ఏదో ఇంత వరకు వివరించే ఋజువేముంది
       సుడిలో పడు ప్రతి నావ చెబుతున్నది వినలేదా
.
||చ|| |అతడు|       

       పొరబాటున చేజారిన తరుణం తిరిగొస్తుందా
       ప్రతి పూటొక పుటగా తన పాఠం వివరిస్తుందా
       మన కోసమే తనలో తను రగిలే రవి తపనంతా

       కనుమూసిన తరువాతనే పెను చీకటి చెబుతుందా
       కడ తేరని పయనాలెన్ని పడదోసిన ప్రణయాలెన్ని
       అని తిరగేశాయా చరిత పుటలు వెనుజూడక ఉరికే వెతలు
       తమ ముందు తరాలకు స్మృతుల చితులు అందించాలా ప్రేమికులు
       ఇది కాదే విధి రాత అనుకోదేం ఎదురీత   || పది నెలలు || 



సాధారణం గా ప్రేమికులకి జీవితం లో చాల విషయాలు ఎలా చెయ్యాలో కూడా తెలియదు కాని, ఒకరి కోసం ఒకరు ఏది చేసుకొవటానికైన సిద్ధపడతారు. ప్రేమ కోసం, లేదా ప్రేమించివాళ్ళు కోల్పోతారు ఏమో అన్న భయమో ఏదో తెలియదు కాని, అందరిని మోసగించి, ఒకరిని ఒకరు పొందేవరకు, తమల్ని తాము మోసగించుకుంటూ బ్రతుకుతారు. ఆ సమయం లో చాల మందికి విజ్ఞత ఉండదు, సరి ఐన ఆలోచన ఉండదు, ఎంత సేపు తమ జీవితం ముఖ్యం, ఇంకేమి అక్కర్లేదు అన్నట్టు ఉంటారు.  ఆ ప్రేమకి  అడ్డు వచ్చిన వాళ్ళని శత్రువులు గా చూస్తారు. 



చాల మందికి బ్రతకటం కూడా రాదు కానీ ఒకరికోసం చావటానికి సిద్దపడతారు, ప్రేమించిన వారి కోసం తమల్ని ప్రేమించిన తల్లి తండ్రులను, స్నేహితులను వాళ్ళని కోల్పోవటానికి కూడా సిధపడతారు. కొంతమంది అడుగడున వాళ్ళు చేసేది తప్పో ఒప్పో అన్న సందేహాలతో సతమతమవుతుంటారు, వాళ్ళు తమముందు ఉన్న ప్రేమకోసం ఆలోచిస్తారు కాని దానికంటే పెద్దదైన జీవితం గురించి ఆలోచించరు. అటువంటి వాళ్ళకి ఒక హెచ్చరిక లాగ ఉంటుంది ఈ పాట. వాళ్ళని ప్రశ్నిస్తున్నట్టు కూడా ఉంటుంది.

అంతే కాకుండా, ప్రేమించే తల్లి తండ్రులని వదిలేసి తమ గమ్యం నిర్దేసిన్చుకున్న వాళ్ళకి జీవితం గురించి అర్థం 
అయ్యే లాగ చెప్తూ, మీరు వేసే ప్రతి అడుగు మీదే, దాని ఫలితం కూడా మీదే అనే మరో హెచ్చరిక కూడా ఉంటుంది ఈ పాటలో. 

అలాగే కాలం యొక్క మహిమ కూడా చెప్తారు, కాలం ఎవ్వరికోసం ఆగదు, ఒకరు గెల్చిన ఓడిన, కాలం పరిగెడుతూనే ఉంటుంది, మన వేసే తప్పటడుగులు సరిదిద్దుకోవటం కోసం మనకి కాలం సమయం ఇవ్వదు అందుకని మన జాగ్రత్త లో మనం ఉండాలి అనే మరో హెచ్చరిక కూడా ఇస్తారు సిరివెన్నెల,. 

అలాగే, మీ ప్రేమ సఫలం కావొచ్చు లేక విఫలం కావొచ్చు, మీరు వేసే ప్రతి అడుగు, మీ జీవితం ముందు తరాలకి ఒక ఉదాహరణ కావొచ్చు కాక పోవొచ్చు, దానికి మీరే భాద్యులు అన్న మరో హెచ్చరిక.

ఇక్కడ సిరివెన్నెల గారు ప్రేమ గురించి విశ్లేషణ చెయ్యలేదు, అది మంచిదో చెడ్డదో అన్న వివరణ కూడా ఇవ్వలేదు, కాని ఆ ప్రయాణం చేస్తున్న వాళ్ళకి అడుగడుగునా వివరిస్తారు, ఆ దరి ఎలా ఉంటుందో అని. 

అందుకనేనేమో సినిమా లో హీరో తన తండ్రిని అడ్డ దారిలో రైల్వే స్టేషన్ కి తీసుకెళ్తుంటే జాగ్రత్త రా చూసుకొని వెళ్ళు అనటం చూపిస్తారు తండ్రి ఆ దారిలో ఆటంకాలు సరియిన దారి కాదు అనే హెచ్చరిక లో వివరిస్తారు. 

ఇంక పాట లోకి వస్తే 

నీ ప్రశ్నలు నీవే ఎవ్వరో బదులివ్వరుగా, నీ చిక్కులు నీవే ఎవ్వరూ విడిపించరుగా

ఈ పాటకి ముందు  జరుగుతున్న సందర్భాల్ని చూస్తే, హీరో మానసిక సంఘర్షణ తెలుస్తుంది. తను చేస్తున్నది తప్పా లేక ఒప్పా అనే సమస్య తో కొట్టు మిట్టాడుతూ ఉంటాడు, సాధారణం గా చూసిన కూడా ఈ వాఖ్యం అంతులేని అర్థం కలది. మనం ఈ జీవితం లో ఒంటరిగా వస్తాం, ఒంటరి గా వెళ్ళిపోతాం. అడుగడుగునా మనకి ప్రతి సారి అనేక ధర్మ సంకటాలు కల్గుతాయి, అనేక సార్లు మనం ఒక నిర్ణయం తీసుకొని వెళ్తూ ఉండాలి ఈ జీవిత గమ్యం లో, మన కష్టాలు వేరే వాళ్ళు తీసుకోరు, మన చిక్కులు వేరే వాళ్ళు విడతీయారు. ఇది మనం మన కాళ్ళ మీద నిలబడ్డ తరువాత, తల్లి తండ్రులు మనల్ని రక్షిస్తున్నంత కాలం మనకి అన్ని వల్లే చేస్తారు, కానీ వాళ్ళని కాదనుకున్నాక కాని మనం రెక్కలోచి ఎగిరిపోయిన కాని మన జీవితం మనదే. ఇంత పెద్ద వేదాంతం, ఒక చిన్న వాఖ్యం తో మొదలు పెడతారు సిరివెన్నెల,. అలాగే సినిమాలో హీరో, హీరోయిన్ డిసైడ్ చేసుకుంటారు ఇల్లు విడిచి వెళ్లి పోవాలి అని, వాళ్ళకి ముందు గా ఒక హెచ్చరిక చూసారా ఇంకా మీ ప్రశ్నలు, మీ చిక్కు ముడులు మీవే, మీరు మీరు సృష్టించుకున్న వన్ని మీవే. ఇన్నాళ్ళు మిమ్మల్ని ప్రేమించి కాపాడిన తల్లి తండ్రులు మీకు ఉండరు అన్న సందేశం కూడా ఉందేమో,,

ఏ గాలో నిన్ను తరుముతుంటే అల్లరిగా, ఆగాలో లేదో తెలియదంటే చెల్లదుగా

గాలి తరమటం అంటే వయసు తరమటమే, అల్లరి వయస్సు తొందరపడి తరుముతుంది, ఏదో చేసెయ్యమని ఒకరిని ఒకరు కలసుకోమని, ఇప్పుడు ఏమి చెయ్యాలో తెలియదు అంటే కుదరదు గా, అంటే కలిసి పారిపోడం అని డిసైడ్ చేసిన తరువాత మళ్ళ దాని గురించి అలోచించి ఏమి చెయ్యాలో తెలియదంటే చెల్లదుగా అని భావం


పది నెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా, అపుడో ఇపుడో కననే కనను అంటుందా
ప్రతి కుసుమం తనదే అనదే విరిసే కొమ్మైనా, గుడికో జడకో సాగనంపక ఉంటుందా

ఇక్కడ సిరివెన్నెల గారి పదజాలం సమ్మోహనం. ప్రకృతిని వాటి ధర్మాన్ని అత్యాద్బుతం గా వివరిస్తారు, అల వివరిస్తూనే గొప్ప సందేశం ఇస్తారు, ఈ ప్రేమికులు పారిపోవటానికి సిద్దపడితే అది ఎందుకు తొందరపడతారు, మీ వయసు ఎంత? అని ప్రశ్నిస్తున్నట్టు ఉంటుంది. ( సినిమా లో హీరో హీరోయిన్, under graduates కూడా కాదు , మైనారిటీ కూడా తీరదు ). అమ్మ పది నెలలు మోస్తుంది బిడ్డని ఒక్కోసారి. అంటే పూర్ణ గర్భిని బిడ్డని మోసే సమయాన్ని తొమ్మిది అనకుండా పది అంటారు సిరివెన్నెల. ఇక్కడే అయన ఆలోచన శక్తి మనకు తెలుస్తుంది. అన్ని నెలలు మోస్తున్న కదా నేను బిడ్డను కనను దాచేసుకుంటాను అని అనదు కదా, బిడ్డని కనే తీరుతుంది, అది ప్రక్రుతి ధర్మం. అలాగే, కొమ్మకి పూలు పూస్తాయి, వాటిని కూడా కొమ్మదాచేసుకుంటాను అని అనదు కదా. పూలు మనకి సాధారణం గా గుడి కో, ఎవరి జడలోకో వెళ్తాయి, అంటే అమ్మాయిని కూడా అలాగే అత్తవారింటికి పంపకుండా తల్లి తండ్రులు ఆగిపోరు కదా, మీకు ఎందుకు తొందర అనే ప్రశ్న ఉంటుంది. మీరు నిర్ణయం తీసుకునేంత తొందర ఎందుకు వచ్చింది?


బతుకుంటే బడి చదువా అనుకుంటే అతి సులువా
పొరబడినా పడినా జాలిపడదే కాలం మనలాగా
ఒక నిమిషం కూడా ఆగిపోదే నువ్వొచ్చేదాకా

ఇక్కడ కొంచెం బోధిస్తున్నట్టు ఉంటుంది పాటలో. బడి చదువంటే, ఎంతో కొంత చదవటం, చదివింది పరీక్షలాగ  రాయటం పాస్ అవ్వటం. సాదారణం గా కొంచెం ప్రయత్నం చేస్తే అందరు పాస్ అవుతారు. ప్రతి సంవత్సరం పాట్య అంశాలు ఉంటాయి, అది చదివి పాస్ అవ్వటమే బడి చదువు. ఇక్కడ నాయిక నాయికలు ఇంకా బడి చదువే కాబట్టి దానితో పోల్చారేమో. కానీ జీవితం ఎప్పుడు ఏ పరీక్షా పెడ్తుందో తెలియదు, జీవితం బడి చదువంటే తేలిక కాదు, అలాగా అనుకొంటే పొరపడినట్టే అని హెచ్చరించినట్టు. అసలు జీవితం అంటే ఏంటి అనుకోని మీరు ఈ నిర్ణయం తీసుకున్నారు అని అడుగుతున్నట్టు కూడా అనుకోవచ్చు. ఇంక కొంచెం ముందుకి వెళ్లి కాలం యొక్క విలువని , జీవితం యొక్క విలువని చెప్పటం జరుగుతుంది. ఒక తప్పటడుగు చాలు జీవితం లో చాల కోల్పోవటానికి, మనం ఏమి చేసిన కాలం ఆగదు, చేసే పొరపాట్లని దిద్దుకోవటానికి అవకాశం ఇవ్వదు, ఎందుకంటే మనం చేసిన తప్పులు మనం వేసే తప్పటడుగులు దిద్దుకొని మళ్ళ జీవితం మొదలు పెట్టేదాకా ఒక్క నిమిషం కూడా ఆగదు. అంటే ఆలోచనలేని ఒక్క అడుగు వేసిన జీవితాంతం అనుభవించాల్సిందే, ఎందుకంటే కాలానికి జాలి ఉండదు. అంత పెద్ద నిర్ణయం అంత సులువుగా తీసేసుకున్నారు, జాగ్రత్త అనే హెచ్చరిక కనిపిస్తుంది. సినిమాలో అందుకనే వాచ్ హీరో కి ఇవ్వటం, దాని విలువ తెల్సుకోలేకపోయాను అని తిరిగి ఇచ్చెయ్యటం తరువాత అది హీరో పెట్టుకొని ప్రయాణం గమ్యం మార్చుకోవటం ఇవ్వన్ని తెల్సుకున్నతరువతనేమో.


అలలుండని కడలేదని అడిగేందుకె తెలివుందా
కలలుండని కనులేవని నిత్యం నిదరోమందా
గతముందని గమనించని నడిరేయికి రేపుందా
గతి తోచని గమనానికి గమ్యం అంటూ ఉందా


ఇంక మరల ప్రశ్నలకి వచ్చేస్తారు సిరివెన్నెల, సముద్రం అలలకి ఉన్న సంబంధం అందరికి తెల్సిందే, సముద్రానికి అలలు ఉండవు అనుకోవటం ఎంత మూర్ఖత్వమో, అలంటి ప్రశ్న కలగటం కూడా అంటే మూర్ఖత్వం. మానవునికి తెలివి ఉన్నది అర్థం లేని ప్రశ్నలు వెయ్యటానికి కాదు, మనకి తెలివి ఇచింది, మన జీవితం సుకృతం అయ్యే ప్రశ్నలు వేసుకోవటానికో లేక జీవన గమ్యానికి ఉపయోగ పడే ప్రశ్నలు వేసుకోవటానికే కాని ఇలా పనికి మాలిన ప్రశ్నలు అడగటానికి కాదు. హీరోయిన్ బెదురు చూపులు, హీరో గుడి ముందు బిత్తర చూపులతో దండం పెట్టుకోవటం గతి తోచని గమ్యానికి సూచనలు గా చూపిస్తారు సినిమాలో. అలాగే సముద్రం లోంచి అలలు ఎలా వస్తాయో అలాగే మనిషి ఆలోచనలు కూడా వస్తాయి ఆ ఆలోచనల లోంచే ప్రశ్నలు వస్తాయి., అంతే కాని అలలు లేని సముద్రం, ఆలోచనలు లేని మనిషి ఉండడు. మరల కన్నులు , కలలు , నిద్ర వీటికి కూడా ఇదే logic apply అవుతుంది.



వలపేదో వల వేసింది వయసేమో అటు తోస్తుంది
గెలుపంటే ఏదో ఇంత వరకు వివరించే ఋజువేముంది
సుడిలో పడు ప్రతి నావ చెబుతున్నది వినలేదా


హీరో హీరోయిన్కి నిజం గానే ప్రేమ వల వేస్తుంది, ఇంకానేమో దానికి వయసు తోడయ్యి వాళ్ళు ఆ నిర్ణయం తీసుకునేటట్టు చేస్తుంది, ఇక్కడ నిక్కచ్చి గా అడుగుతున్నట్టు ఉంటుంది, ఏమి సాధిద్దామని మీరు ఈ నిర్ణయం తీసుకున్నారు, ఎవరి మీద గెలుపు పొందుదామని మీరు ఇది చేస్తున్నారు, అసలు మీ గెలుపుకి ఒక అర్థం అంటూ ఉందా?? ఇప్పుడు వెళ్ళిపోయి గెలిచాం అనేదాన్ని వివరించే రుజువేమి లేదు కదా, మీ ప్రియునితో, (ప్రియురాలితో) శాస్వతమైన సుఖం కోల్పోతున్నాం అన్న ఆలోచనలో అందరిని వదిలేసి ఏమి గెలుద్దామని మీరు మీ ప్రయాణం మొదలు పెట్టారు? దశ, దిశ లేని ప్రయాణం సుడి లో కొట్టుకొని పోయే నావ మనకు రుజువు చేస్తోంది కదా అది మీరు వినలేదా అన్న ప్రశ్న కనపడుతుంది. అది తెల్సి కూడా ఏమి గెలుద్దామని ప్రయత్నిస్తున్నారు అన్న ప్రశ్న కలుగుతుంది. సినిమాలో ఇద్దరు పిల్లలు హోలీ ఆడుకుంటే షర్టు గుర్తుకువచ్చి అది తేలేదని మర్చిపోయానని తనని నిందించుకుంటూ తిరిగి ఇంటికి వెళ్తాడు, అప్పుడు తన ఒక ఊహించని సంఘటన జరుగుతుంది.


పొరబాటున చేజారిన తరుణం తిరిగొస్తుందా
ప్రతి పూటొక పుటగా తన పాఠం వివరిస్తుందా

ఒక చిన్న తప్పటడుగు వాళ్ళ కోల్పోయిన అవకాశాలు తిరిగి రావు అలాగే మనం కోల్పోయిన అవకాశాలు మల్ల మనకి అడుగడుగునా గుర్తుకు రావు, కాలం గుర్తు చెయ్యదు, ప్రతి పూట ఒక పేజిలా, పాఠం లాగా వివరించదు అని మరల హెచ్చరిస్తారు.

మన కోసమే తనలో తను రగిలే రవి తపనంతా
కనుమూసిన తరువాతనే పెను చీకటి చెబుతుందా

సూర్యుడు అందరికి వెలుగునివ్వటానికి  ఎంత కష్టపడతాడో మనకి చీకటిని చూస్తే కాని అర్థం కాదు. సిరివెన్నెల గారికి  సూర్యుడు అంటే అత్యంత ప్రీతి, కవి ని సూర్యుడిని పోలుస్తూ "జగమంత కుటుంబం" పాట రాసారు, అలాగే చాల పాటల్లో సూర్యుడి గురించి వింటాం. ఇక్కడ సినిమాలో హీరో తండ్రి చనిపోవటం, తండ్రిని సూర్యునితో పోలుస్తున్నరేమో ఇక్కడ. కొడుకు కోసం తండ్రి పడే తపన, అతని కోసం అహర్నిశలు పనిచేసి చివరకు కన్ను మూస్తే, కొడుకు బ్రతుకు చీకటి మయం అయ్యి కొడుకుకు తండ్రి విలువేంటో, ఇంక తను చెయ్యవలసిన పనులేంటో హీరో కి తెలుస్తుంది అని ఈ వాఖ్యలకి వివరణ గా చూసుకోవచ్చు. అందుకనే తల్లి ఆ మాటలు అంటుంది " దేవుడు చాల గోప్పవాడనుకుంటున్నాడు, మీ నాన్నని తీసుకు వెళ్లి పోయాను అని సంబర పడిపోతున్నాడు, నువ్వు లేవ నాకు?" 

కడ తేరని పయనాలెన్ని పడదోసిన ప్రణయాలెన్ని

అని తిరగేశాయా చరిత పుటలు వెనుజూడక ఉరికే వెతలు
తమ ముందు తరాలకు స్మృతుల చితులు అందించాలా ప్రేమికులు
ఇది కాదే విధి రాత అనుకోదేం ఎదురీత   || పది నెలలు || 


ఇంక చివరిగా ప్రేమ చరిత్ర గురించి విశ్లేషణ లో గమ్యం చేరని ప్రేమ వ్యవహారాలు ఎన్ని ఉన్నాయో, అలాగే పడదోసిన ప్రేమలు ఇవ్వన్ని లెక్కలు చూసి చరిత్రని చూసి ప్రేమించారు, అలాగే ముందడుగు వెయ్యరు కదా ప్రేమికులు, తమ ప్రేమ వ్యవహారం ఎవ్వరికి ఉదాహరణ కానక్కర్లేదు, తమ జీవితం తమదే కదా, ఇప్పుడు ఏమి చెయ్యాలి అని అనుకోవటం అర్థం లేదు ఎందుకంటే, ఒక అడుగు వేసి జరగబోయేదంత మన తలరాత అనుకోవటం కుదరదు అని నిక్కచ్చి గా చెప్తారు సిరివెన్నెల గారు. ఎదురీత అంటేనే ప్రవాహానికి ఎదురుగా వెళ్ళేది, అల వెళ్తూ ఇదంతా తన తలరాత అనుకోవటం కుదరదు కదా, అలాగే ప్రేమ జంటలు కాలానికి, ప్రకృతికి విరుద్దం గా తమకు తామే తమ గమనాన్ని నిర్దేసించుకొని ఇంక జరగబోయేది అంత తలరాత అనుకోవటం, ఏది జరిగితే అదే చేద్దాం అనే ఆలోచనని ఖండిస్తున్నట్టు ఉంటుంది.

ఒకటి  పొందలనుకుంటే ఇంకోటి కోల్పోవాలి అనే రీతిలో ఉంటారు ప్రేమికులు. తల్లి తండ్రులని కోల్పోతే కాని ప్రేమ దక్కదు, వాళ్ళే మొదటి అడ్డంకులు, మొదటి విలన్లు అనుకోవటమే ప్రేమ లో జరిగే చాల అనర్థాలకు కారణం. అది తప్పు అని వాళ్ళకి చాల కోల్పోయిన తరువాత అర్థం అవుతుంది. అది కాక పిల్లల ప్రేమ గురించి పెద్దలు మొదటి సారి ఎవ్వరి దగ్గరనుంచో వింటారు. అది కూడా పెద్దవాళ్ళకి నచ్చని పని.  ప్రేమికులు చేసే దొంగ చాటు గా కలయికలు, వాటి గురించి అందరితో ఆడే అబద్దాలు, వాళ్ళు చేసే ప్రతి పని ఎవరైనా చూస్తారో, చూసి ఇంట్లో చెప్తే ఏమవుతుంది అని భయపడుతూ, అన్ని విషయాలు దాస్తూ  చేసే పనులలో వాళ్లకి ఎంత ఆనందం ఉంటుందో తెలియదు కాని వాళ్ళు ఒకవేళ ప్రేమని పొంది జీవిత చక్రం లో పడితే ఆ ప్రేమ ఉంటుందా లేదా అన్నది వేరే విషయం. లేదంటే ఇన్ని ప్రేమ వివాహాలు బద్దలు కావు.  ఆకర్షణ తో చేసే  పని ఎలా ఉంటుందో చెప్పటానికి ఈ పాట అడుగడుగునా ఉపయోగపడుతుంది. అందుకనే సినిమా లో చివరిగా " వేసే ప్రతి అడుగు ఒకటికి పది సార్లు అలోచించి వెయ్యండి అనే సందేశం ఇస్తారు, అంటే కాక పిల్లలు పెద్దలు చివరకి కోరుకునేది ఆనందమే, అది మేము ఇవ్వగలం అని తల్లి తండ్రులు అనుకుంటే, వాళ్ళ ప్రేమలో నిజాయితీని పెద్దలు అర్థం చేసుకుంటే ప్రతి ఇల్లు ఒక కొత్త బంగారు లోకమే" అనే చక్కటి సందేశం తో సినిమా ముగుస్తుంది..

కొసమెరుపు: ఈ పాట రాసినందుకు సిరివెన్నెల గారికి కాని పాడినందుకు బాలు గారికి కాని నంది అవార్డు కూడా రాకపోవటం.

Saturday, December 24, 2011

Song of the week - Tolisari mimmalni - Srivaariki Premalekha


నా సంగీత ప్రపంచం లో కొన్ని వేల పాటలు విని ఉంటాను, అందులో చాల పాటలు అలలు ఒడ్డుని తాకినట్లు వెళ్ళిపోగా, మరి కొన్ని చిరు గాలి లాగ మెల్లగ పృశించి వెళ్ళిపోయాయి.  కొన్ని హృదయానికి హత్తుకోగా కొన్ని మదిలో అలా నిలచిపోయాయి. వాటిలో కొన్ని పాటలు ఎన్ని సార్లు విన్నాఏదో కొత్తదనం వాటిల్లో కనిపిస్తుంది. అలాంటి పాటలు వారానికి ఒకటి కాలం అనుమతి ఇస్తే నిక్షిప్త పరచుకోవాలనే చిన్న ఆశ ఎప్పటినుంచో ఉంది. కాని ఆ కోరిక ఇట్లా బ్లాగ్ రూపం దాల్చటానికి ఇలా వీలు కుదురుతుంది అని ఎప్పుడు ఊహించలేదు. 
 
ఈ పాటల యొక్క వివరణ, విశ్లేషణ అంతా నా పరిమిత జ్ఞానం మాత్రమే. ఇది ఎవరి మీద ఎటువంటి విమర్శా కాదు. అలాగే ఇటువంటి  ఆణిముత్యాలని ఇచ్చిన  పెద్దలని కించపరచాలని కూడా కాదు. ఏమైనా తప్పులుంటే పెద్ద మనస్సు తో మన్నించండి. ఇందులో వచ్చే పాటల యొక్క వరుస వాటి గొప్పతనానికి సూచన కాదు, ఇది నాకు వచ్చిన జ్ఞాపకం, ఈ సమయానికి కుదిరిన వీలు మాత్రమే.

ఇక ఈ వారం పాట
తొలిసారి మిమ్మల్ని  చూసింది మొదలు - శ్రీవారికి ప్రేమలేఖ.
 
 

Movie -            Srivaariki premalekha
Director -         Jandhyala Subramanya Sastry
Production -     Usha Kiron Movies
Music Director - Ramesh Naidu
Lyrics -             Veturi Sundara Rama murthy
Singer -            S. Janaki


ఒక్కోసారి తెలుగు సినిమా పరిశ్రమ కొంత మంది పట్ల చాల క్రూరంగా ప్రవర్తిస్తుంది. అలాంటి వారిలో జంధ్యాల ఒకరు. అయన సకలకళ వల్లభుడు, కానీ ఆయనని హాస్య బ్రహ్మ గా ముద్రించి పరిమితం చేసేసారు. కాని ఆయనకి ఉన్న సంగీత సాహిత్య అభిరుచి చాల తక్కువ మందికి దర్శకులకి ఉంది.  ఆయన హాస్యం అందిరికి సుపరిచయమే, కానీ ఆయనలో రచన కౌసల్యం కొందరికే పరిచయం. నా దృష్టి లో అయన లోని సంభాషణ రచయిత మొదటి స్థానం సంపాదిస్తాడు. ఆ తరువాత స్థానం కథ రచయిత,  ఆ తరువాతే ఆయనలోని హాస్య దర్శకుడు, ఆ తరువాత అయన చేసిన ఇంకా చాల చాల పాత్రలు


ఇంక ఈ పాట లోకి వస్తే, ఈ సినిమా "చతుర"  మాస పత్రిక లో వచ్చిన కథని సినిమాగా తీసారు జంధ్యాల గారు. ఒక "Blind Love Letter" చుట్టూ తిరిగే కథ. దానికి జంధ్యాల గారు తనదైన శైలి లో హస్యత్మకంగా , సందేశఆత్మకంగా  తీసారు. అనేక సన్నివేశాలు ఎంతలా నవ్విస్తాయో, కొన్ని సన్నివేశాలు అంతేల ఆలోచింపచేస్తాయి. 

ఈ సినిమాలో కథానాయిక చాల చిలిపి, ఆత్మవిశ్వాసం, ఉన్నతమైన భావాలు కల అమ్మాయి. నలుగురు స్నేహితురాళ్ళు కలసి ఒకరినొకరు ఆటపట్టిన్చుకుంటూ ఉన్నప్పుడు ఆ సందర్భం లో "ఆడ పిల్ల ప్రేమలేఖ రాస్తే మురిసిపోని మగాడు ఉండడు, రాసే విధం లో రాస్తే ఎంతటి మొనగాడైన బొంగరాల్ల గిన్గరాలు తిరగాల్సిందే" అని    సరదాగా పందెం వేసుకొని, పేరు, ఊరు తెలియకుండా ఒకతనికి ప్రేమ సందేశం పంపిస్తే అతను వచ్చి తనకి జవాబు వచ్చి తీరుతుంది అని కథ నాయిక ప్రఘాడ నమ్మకం, తను రాసే ప్రేమలేఖ మీద, తన రచన కౌశల్యం మీద ఉన్న విశ్వాసం. అందులో మగాడి మనస్తత్వం పూర్తిగా చదివేసానన్న ఆత్మ విశ్వాసం. నేను ఉత్తరం రాసి మీకిస్తాను మీరు దాన్ని ఎవరికిష్టం వచ్చిన వాళ్ళకి పంపుతారో పంపుకోండి అని challenge చేసి ఉత్తరం రాయటం మొదలు పెడ్తుంది.
ఇటువంటి సన్నివేశానికి ఒక పాట రాయటం అంటే ఎంత కష్టమైనా పనో మనకి అర్థం అవుతుంది, ఎందుకంటే మొత్తం కథ అంత ఆ ఉత్తరం మీదే ఆధారపడి ఉంటుంది, వేటూరిగారు ఈ సన్నివేశం చెప్పినప్పుడు ఎన్ని రోజులు తీసుకున్నారో పాట రాయటానికి తెలియదు కాని పాట వింటే అయన శ్రమ అర్థం అవుతుంది, అయనకి ఉన్న ఒకే ఒక్క బలం ఒక పాటని వెయ్యి రకాలు గా రాయగలగటం అని సిరివెన్నెల అనేక సందర్భాల్లో చెప్తారు, సినిమాలో నాయికా రాసి పేజీలు చింపేసినట్టుగా  ఆయనకూడా జంధ్యలగారికి నచ్చేంత వరకు రాసేసి ఉంటారు. ఏది ఏమైనా ఒక అత్యంత అద్బుతమైన పాట వచ్చింది, ఆ పాట వింటే అబ్బాయే కాదు ఎవరైనా మనసు పారేసుకుంటారు.


ఇంక రమేష్ నాయుడు గారు, జానకి ఈ పాటకి ప్రాణం పొయ్యటమే కాదు, చిరాయువుని ఇచ్చారు. జానకి గారి గొంతులో సహజమైన లాలిత్యం, శృంగారం, సుకుమారత్వం, మాధుర్యం , విరహం, తాపం అన్ని కలగలిపి ఈ పాట పాడగా ఎన్ని సార్లు విన్న మళ్ళ వినాలనిపిస్తుంది. అటువంటి గాత్రం పొందిన ఆవిడ దైవ స్వరూపమే.
  
ఇంక వేటూరి గారి పాటలోకి వస్తే,
శ్రీమన్మహారాజ  మార్తాండ  తేజా ప్రియానంద  భోజా మీ శ్రీచరణామ్భోజములకు
ప్రేమతో  నమస్కరించి మిము  వరించి మీ గురించి ఎన్నో కలలుగన్న కన్నె బంగారు
భయముతో భక్తితో అనురక్తితో సాయంగల విన్నపములూ

అందరికి ఒక ప్రేమ లేఖ రాయాలంటే నిద్ర, ఆకలులు ఉండవు, కారణం ఏంటంటే ఎలా మొదలు పెట్టాలి అని, "First Impression is best impression"  అన్నట్టు ఎలా రాస్తే అవతలి వాళ్ళు మన గురించి ఆలోచిస్తారు, మనని అర్థం చేసుకుంటారు అని. ఇంక ఆ తరువాత ఎలా సంబోధించాలి? ఇక్కడ అవతలి వారు ఎవరో తెలియదు, ఏమి చేస్తారో తెలియదు, పేరు తెలియదు ఊరు తెలియదు, ఇంక ఎట్లా సంబోదించాలి? వేటూరి గారు ఆ కాల పరిస్తితులలో ఉత్తర ప్రత్యుత్తరాలకి అనుగుణంగా  అటు గ్రాంధికం గాను ఇటు వాచికం కాకుండా, మొదలు పెట్టారు ఆయన ప్రేమలేఖ అదే శ్రీవారికి ప్రేమ లేఖని. మహారాజశ్రీ, గౌరవనీయులు, చక్రవర్తి సమానులు అని మొదలు పెట్టటం 80's lo సామాన్యం. కానీ పల్లవిలోనే అయన మొత్తం రంగరించి పోసేసారు, మీ పాదాలకు నమస్కరించి, ఒక కన్నె పిల్ల ఎన్నో కలలు కంటూ వినయం తో విన్నపాలు చేస్తున్న అని మొదలు పెట్టారు, "సాయంగల" విన్నపములు అన్న ప్రయోగం గ్రందికం ఐన ఎంతో వన్నె తెస్తుంది. జంధ్యాల గారు ఈ పదాలకి అర్థం వివరించేలాగా అభినయిమ్పచేసారు. భయముతో అంటే హీరోయిన్ కన్నులు రెప్ప వెయ్యటం, పాదాలకి నమస్కరించటం ఇలాంటి చిత్రీకరణ పాటకి చక్కటి న్యాయం చెయ్యటమే.

సంధ్యారాగం చంద్రహారతి పడుతున్నవేళ
 మసక చీకటి మధ్యమావతి పాడుతున్న వేళ
ఓ  శుభ ముహూర్తాన 

వేటూరి గారు time and mood set  చేస్తున్నారు ఇక్కడ, "సంధ్య రాగం చంద్ర హారతి " అన్న ప్రయోగం ఎలా తట్టిందో వేటూరి గారికి, సంధ్య వేళలో మిమ్మల్ని చూసి మనసు పారేసుకున్నాను అని చెప్పటానికి ఇంతకన్నా అద్భుతమైన వివరణ ఉండదేమో.  జానకి గారి గొంతు లో ఈ రెండు వాఖ్యలు అమృతం లా వినిపిస్తాయి, మనసున్న వాళ్ళు ఎవరైనా దాన్ని పారేసుకుంటారు ఇలాంటి ప్రియురాలు ఉంటె. సరే ముహూర్తం చెప్పాం ఆ తరువాత ఏమి జరుగబోతోంది అన్న ఉత్సుకత కలిగిస్తుంది చదువుతున్న వారికి.

తొలిసారి  మిమ్మల్ని చూసింది  మొదలు
కదిలాయి  మదిలోన  ఎన్నెన్నో  కధలు ఎన్నేనేన్నో  కధలు
జో  అచ్యుతానంద  జో  జో  ముకుందా లాలి  పరమానంద  రామ  గోవిందా  జో  జో
ఇక్కడ వరకు వింటే ప్రేమలేఖలో జోల పాట ఏంటి అనుకుంటాం. అది వేటూరి గారి గొప్పతనం, మిమ్మల్ని చూసిన మొదలు నాకు కలవరం మొదలయ్యింది, ఇంక నిద్ర రావటం లేదు అన్నదాన్ని ఎంత అందం గా వివరించారో. ఎంత జోలపడుతున్న నిద్ర రావటం లేదు, మనసు మిమ్మల్ని కావాలని కోరుతోంది, దానికి తోడు వయసు చేస్తున్న తొందరని ఆపలేక ఇంక ఉండ బట్ట లేక రాసేస్తున్నా నావల్ల కాదు బాబు అంటూ నాయిక ఉన్న పరిస్థితిని అత్యద్భుతం గా వివరించారు వేటూరి గారు. ఇక్కడ రమేష్ నాయుడు గారు వేటూరి గారు రాసిన పాటకి ఎంతో గొప్పగా రాగం కట్టారు, జంధ్యాల గారు ఈ సన్నివేశాలకు చక్కటి న్యాయం చేసారు.

నిదుర  పోనీ కనుపాపలకు జోల పాడలేక ఈల  వేసి చంపుతున్న ఈడునాపలేక 
ఇన్నాళ్ళకు రాస్తున్నా హుహు  హుహు ప్రేమ లేఖ 

జంధ్యాల గారు వేకిలితనానికి, విసృనఖలానికి, విచ్చలవిడి తనానికి ఎక్కడ ఎప్పుడు తావునివ్వలేదు ఈడునాపలేక అన్నచోట్ల హావభావాలతో, కాలి కదలికలతో చెప్పిస్తారు. ఇటువంటి దర్శకులు తెలుగు సినిమాకి గర్వకారణం.

ఏ తల్లి కుమారులో తెలియదుగాని ఎంతటి సుకుమారులో తెలుసు నాకు
ఎంతటి మగదీరులో తెలియలేదు గాని నా మనసును దోచిన చోరులు మీరు 
వలచి వచ్చిన వనితను చులకన చేయక తప్పులుంటే మన్నించి ఒప్పులుగా భావించి చప్పున బదులివ్వండి ||తొలిసారి ||

వేటూరి గారు ఇంక direct గా విషయం లోకి వచ్చేస్తారు. ఎవరైనా మనల్ని చాటు నుంచి గమనించి పొగడితే పడిపోకుండా ఉండలేము, ఇదే విషయం హీరోయిన్ ఈ పాటకి ముందు చెప్తుంది "ఏదైనా సరిగ్గా చెప్తే మనకి పడని
వాడు ఉండడు" అని. వేటూరి గారు, సరిగ్గా అదే చెప్తారు. అతనిని ఆకాశానికి ఎత్తేస్తారు. మీ గురించి కొంత తెలుసు గాని, ఆ తెలిసిన కొంత తోనే నన్ను మీ ప్రేమలో పడేసారు అని చెప్తే, ఇంక ఆ లేఖ చదివిన వాళ్ళు ప్రేమలో పడక ఏమి చేస్తారు. కవి ఎప్పుడు కాలాన్ని దృష్టి లో పెట్టుకొని రాస్తారు. అప్పట్లో అమ్మ్మాయి ప్రేమ విషయం లో చొరవ చూపించటం తక్కువే, అందుకని ఆ విషయం ప్రస్తావిస్తారు, అలాగే తప్పుల్ని మన్నించమని చెప్తూ, నేను మీకు అనుగుణం గానే ఉంటాను చప్పున బదులివ్వండి "reply at the earliest", అనే  request చేయిస్తారు  ఇక్కడ జంధ్యాల గారు హాస్యాన్ని కలగచేస్తారు సుత్తివేలు చేతిలో ఆ లేఖ పడితే వేలు చేసే చేష్టలతో. ఇంతటి చక్కని లేఖతో పరాచికాలు ఎంటా అనుకునేలోపల హీరో చేతిలో ఆ లేఖ పడేస్తారు, ఎంతైనా దర్శకుల ఆలోచనలు వేలకు వేలు...

తలలోన తురుముకున్న తుంటరి మల్లె తలపులలో ఎన్నెన్నో మంటలు రేపే || ఆహ్  అబ్బా ||
సూర్యుడి చుట్టూ తిరిగే  భూమికి మల్లె నా ఊర్పుల నిట్టూర్పుకు జాబిలి వాడే || ఆహ్ ఆహ్ ||
మీ  జతనే కోరుకుని లతలాగా అల్లుకునే నాకు మీరు మనసిస్తే ఇచ్చినట్టు మాటిస్తే 
ఇప్పుడే బదులివ్వండి ఇప్పుడే బదులివ్వండి ||తొలిసారి ||

ఒక్కోసారి కన్నె పిల్లైనా మల్లెని వదులుతుందేమో కానీ కవులు మల్లెని ఎప్పుడు విడువలేరు. తలలో మల్లెలు ఉంటె తుంటరి తలపులన్ని వస్తాయి, మల్లెకి ఉన్న శక్తి అటువంటిది, అప్పుడు కలిగే తాపంనుంచి వచ్చిన వేడిని, భూమి సూర్యుడి చుట్టూ భూమి తిరిగితే వచ్చే వేడితో పోలిక వేటూరి గారికి తప్ప వేరే వాళ్ళకి సాధ్యం కాదేమో, అలాగే సూర్యుని చుట్టూ తిరిగి వేడెక్కిన భూమికి చల్లతనం ఇచ్చే జాబిలితో అతనిని పోలిస్తే ఇంక అవతలి వాడు అక్కడికక్కడే జవాబు ఇవ్వక చస్తాడా,, మొదటి చరణం లో చప్పున బదులివ్వండి అన్న వేటూరి ఇక్కడ ఇప్పుడే ఇవ్వండి అంటారు. ఎందుకంటే ఈ చరణానికి ఉన్న మత్తు అలాంటిది.
ఇంక ఈ పాట తరువాత ఏమి జరుగుతుంది అంటే, ఈ సినిమా చూడాల్సిందే. ఇటువంటి అద్బుతమైన పాటని ఇచ్చిన అందరు అమరులు.
ఈ సినిమాలో అన్ని పాటలు ఒకదానికి ఒకటి పోటీ పడతాయి. మనస తుళ్ళి పడకే అన్న పాట వేటూరి గారి కలంనుంచి జారువాలిన ఇంకో ఆణి ముత్యం. వీలున్నప్పుడు ఆ పాటని కూడా ఒకసారి విరించాలనే కోరిక. ఎప్పుడైనా కుదురుతుంది అని ఆశిస్తున్న.
Other Songs in this movie
  1. Lipileni Kanti Baasa (Lyrics: Veturi Sundararama Murthy; Singers: S. P. Balasubramanyam and S. Janaki)
  2. Manasa Thullipadake (Lyrics: Veturi; Singer: S. Janaki)
  3. Pelladu Pelladu (Lyrics: Veturi; Singers: S. P. Balasubramanyam and S. P. Sailaja)
  4. Raghuvamsa Sudha (Lyrics: Veturi; Singers: S.P. Sailaja and S. P. Balasubramanyam)
  5. Sarigamapadani (Lyrics: Veturi; Singer: S. P. Balasubramanyam)

Thursday, December 22, 2011

The Businessman (2011) - Music Review

Mahesh took 3+ yrs for his Khaleja but took less than 6 months for his next movie after block buster Dookudu. End of this year he was able to get out the music of yet another movie with back to back chance to Thaman S as music director. Thaman is extremely lucky to grab this kind of opportunity when many music directors likes of Devi Sri Prasad still didn't get to work with Mahesh the way Thaman has worked.

What made Mahesh and Puri's team work with Thaman, whether Thaman met the requirements for the movie is what that needs to be looked into. Except one song all songs are less than 4 minutes, that shows the focus on the music is less for this movie. I guess Bhaskarabhatla's didn't have to put much effort to write lyrics as the situations of these songs didn't demand any such.
1. Aamchi Mumbai
Artist(s): Ranjith, Rahul Nambiar, Naveen, Aalap Raju
Lyricist: Bhaskarabhatla Ravikumar

Bhaskara bhatla mixed Hindi and telugu and wrote what ever he wanted. Thaman passion of his own music makes him uses them again and again, he tries to gives glimpses of them occasionally. If not these two, this song should go well with picturization and Mahesh's action scenes. Thaman gave good situational song. Seems like a power packed song which the tune goes along without any issues. Singers did all the justice to the song. Brought enough energy to elevate the song.
2. Bad Boyz
Artist(s): Priya Himesh, Geetha Madhuri
Lyricist: Bhaskarabhatla Ravikumar

Geeta Madhuri's start was not good, Thaman does all sound tricks to this song, Geeta Madhuri should try to sing natural, She sounds more artificial these days. Tune is nothing refreshing as similar songs are heard many times. Puri, Mahesh will save this song.
3. Businessman (Theme)
Artist(s): Mahesh Babu, Puri Jagannadh
Lyricist: Bhaskarabhatla Ravikumar

Typical Thaman way of starting a song, Mahesh lended his voice in this song, casual lyrics and typical dialogs of Puri. Purely for masses. Target 10 miles aithe aim 11 miles, kodte dimma tirigi povali, type of dialogs. Singers list is not complete I guess. Heard many voices in the song.

4. Chandamama Navve
Artist(s): Haricharan
Lyricist: Bhaskarabhatla Ravikumar

I keep complaining of this generation and their likes to music, chandamama annadantlo vetakaram ekkuva kanipistundi. Then thamans sound effects sometimes doesnt go well to my ears. Why cant he just let singers sing naturally. Keeping aside all these, this song was done well. Thaman will be successful in getting this song to get youth singing this song..

5. Pilla Chao
Artist(s): Rahul Nambiar
Lyricist: Bhaskarabhatla Ravikumar

This is a good attempt in this album. This song will get repeated hearing. Thaman has done this song cleverly to sound it different. Song goes smoothly. Mahesh and Puri will definetely try add to the song.

   
6. Sir Osthara
Artist(s): Suchitra, Thaman. S
Lyricist: Bhaskarabhatla Ravikumar

This song has lots of variations. The graph of the song is like a sine wave, the moment you think its going great, it goes down. The moment you write off, it strikes you good. The moment you thing its new, refreshing, you hear some familiar tunes in between. I don't know when Thaman will get off with this passion of the style of singing in falsetto and high pitch. If it would have sung normally without these variations, the song would have stood out. People who got used to this style of songs, will like it.

Pick(s) of the album: Pilla chao, Amchi Mumbai, Sir Osthara

One more average album from Thaman from music perspective, which is more than required for this movie. When Puri and Mahesh are involved in a project, music doesn't need to be outstanding. They both will take care of the movie. The music will not let down the movie, did exactly what is required.