Song of the week: Nee prasnalu neeve
Movie - కొత్త బంగారు లోకం
Director - శ్రీకాంత్ అడ్డాల
Production - దిల్ రాజు
Music Director - Mickey J Meyer
Lyrics - Sirivennela SeetaRama Sastry
Singer - S. P. Balasubrahmanyam
ఈ పాట నేను కొన్ని వందల సార్లు విని ఉంటాను, విన్నప్పుడల్లా అర్థం ఇది కాదేమో, పాట అర్థంతో మనసు సంతృప్తి చెందలేదు ఇంకో సారి వినాలి అనిపించేది. ఒక్కోసారి ఈ పాట, ఇందులో ఇంత అర్థం ఉందా అని ఆశ్చర్య పరిచేది. ఈ పాట సిరివెన్నెల గారు సినిమా కోసం రాసారో లేక అంతకు ముందు రాసుకున్న పాటని సినిమా కోసం మార్చి వాడుకున్నారో? నాకు రెండో చరణం తప్ప మిగితా పాట జీవితాన్ని చదివేసి అది వివరించే తపన లాగా కనిపిస్తుంది. ఈ పాట రాసిన సిరివెన్నెల గారు ఎంత దన్యులో ఈ పాట వినగలిన మన లాంటి వారెందరో కూడా అంత ధన్యులే. ఇంత చిన్న పాటలో అనంతమైన అర్థం చెప్పిన సిరివెన్నెల గారికి సహస్ర కోటి పాదాభి వందనాలు.
బాలు గారు పాడినట్టుగా ఈ పాట ఇంక ఎవ్వరు పాడలేరు, ఇది ఎవరు కాదనలేని సత్యం. మంచి గళం, అత్యద్బుతమైన పాట ఉంటె, దానికి ప్రాణం దానంతట అదే వస్తుందేమో. మిక్కీ జే మెయెర్ ఈ పాటకి స్వర కల్పన చెయ్యగలగటం ఆయనకి అయాచితం గా వచ్చిన వరం. ఆ వరాన్ని సద్వినియోగ పరచుకోవటం ఆయన పూర్వ జన్మ సుకృతం.
పాటకి ముందు వచ్చే scenes
ఈ పాటకి ముందు వచ్చే scenes లో ఒకటి హీరోయిన్ ఫోన్ లో మాట్లాడుతూ పారిపోదాము అని హీరో ని కోరుతుంది, రైల్వే స్టేషన్ లో 4:00 కి వెయిట్ చేస్తా వచ్చెయ్యి అంటూ టైం fix చేస్తుంది , ఇంక ఇల్లు వొదిలి శాశ్వతంగా వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంటుంది. అదే నిర్ణయం అమలు చెయ్యటానికి ఇద్దరు సమ్మతమవుతారు, కాని ఇద్దరి లో కొన్ని వేల ప్రశ్నలు, బిడియం, భయం ఆందోళన మొదలువుతుంది.
హీరోయిన్ ఫోన్ లో మాట్లాడి ముగించగానే, అప్పుడు ఆ సందర్భం లో dialogs అద్బుతం గా ఉంటాయి, "మన గదిలో లైట్ తీసేసే ముందు పక్క గదిలో లైట్ ఉందొ లేదో చూసుకోవటం తెలియదు కాని ఒక్కదానివి వెళ్లి ఆ కుర్రోడి కోసం వెయిట్తో చేద్దామనుకున్నావే?? పాపం మీ నాన్న నీ మనసుకే కాపలా కాయాలి అని అనుకుంటున్నాడు. మీ నాన్న చేసే అతి జాగ్రత్త వలన నువ్వెక్కడ నీ చిన్ని చిన్ని ఆనందాలని కోల్పోతావేమో అని నిన్ను హాస్టల్లో జాయిన్ చేయిస్తే, ఆ రోజు అది రైట్ అనుకున్నాను అది తప్పు అయిపొయింది. ఇవ్వాళ శాశ్వతంగా నువ్వు నీ ఆనందం కోల్పోతావని బయటకి వెళ్లి పోదామనుకున్నావు చూడు, నువ్వు రైట్ కావొచ్చు ఎందుకంటే, ఇవ్వాళ రైట్ అనుకున్నది రేపు తప్పు కావొచ్చు, ఇవ్వాళ తప్పు అనుకున్నది రేపు రైట్ అవుతుంది."
ఇంక ప్రకాష్ రాజ్ కి హీరో ప్రేమ వ్యవహారం తెలుస్తుంది, అప్పుడు హీరో స్నేహితురాలి తో అన్నdialogs చాల ఆలోచింపచేస్తాయి. "ఇన్ని ఆలోచనలు మనసులో పెట్టుకొని ఎగ్జామ్స్ వాడు ఏమి రాసి ఉంటాడు? వాళ్ళ అమ్మ వాడి గురుంచి ఎన్ని కలలు కంది? వాడి చిన్నప్పుడు నేను కాల్చి పారేసిన cigarette వాడు కలిస్తే వాడిని కొట్టలేదమ్మ, నేనే cigarette మానేసాను. ఎందుకంటే పిల్లల్ని భయం తో కాకుండా ప్రేమతో పెంచాలనుకున్నాను, కానీ ఇప్పుడు అర్థం అవుతోంది, ప్రేమ తో పెంచిన భయం తో పెంచిన మీ హృదయాలని control చెయ్యలేము అని. ఇప్పుడు తిట్టాల? కొట్టాల ? ఇవేవి ది నాకు అందరిలాగా తెలియని పని, నాకు తెలిసినదల్ల ప్రేమించడమే, ఇంకా ప్రేమిస్తాను అప్పుడైనా వాడు తెలుసుకుంటాడో లేదో? "".
ఇంకో పక్క హీరోకి అలజడి మొదలు అవుతుంది, తన ఆలోచనలో తను ఉంటాడు, ఇంకో పక్క తండ్రి ఒక్క మాట కూడా అనడు, కానీ తండ్రిని చూస్తే ఏదో అలజడి. చెప్పాలని ఉన్న చెప్పలేని నిస్సహాయత, తండ్రి ఎగ్జామ్స్ పాస్ అవ్వాలని వాచ్ ఇస్తే, పరీక్షలు సరిగ్గా రాయలేదని వాచ్ తిరిగి ఇచ్చేయ్యలనుకుంటాడు, అప్పుడు హీరో, ప్రకాష్ రాజ్ మధ్య dialogs కూడా చాల బాగుంటాయి. తల్లి తండ్రులకి బిడ్డలు పాస్ అయిన ఫెయిల్ అయిన పిల్లలు పిల్లలే. అటువంటి వాళ్ళని వదిలేసి పిల్లలు ఎక్కడికో వెళ్లి ఏమి చేద్దామనో?
తండ్రిని స్టేషన్లో దింపి హీరో తన ప్రేమ ప్రయాణం గురించి ఆలోచిస్తూ నడుస్తుంటే వచ్చే పాట ఇది.,.
||ప|| |అతడు|
నీ ప్రశ్నలు నీవే ఎవ్వరో బదులివ్వరుగా
నీ చిక్కులు నీవే ఎవ్వరూ విడిపించరుగా
ఏ గాలో నిన్ను తరుముతుంటే అల్లరిగా
ఆగాలో లేదో తెలియదంటే చెల్లదుగా
పది నెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా
అపుడో ఇపుడో కననే కనను అంటుందా
ప్రతి కుసుమం తనదే అనదే విరిసే కొమ్మైనా
గుడికో జడకో సాగనంపక ఉంటుందా
బతుకుంటే బడి చదువా అనుకుంటే అతి సులువా
పొరబడినా పడినా జాలిపడదే కాలం మనలాగా
ఒక నిమిషం కూడా ఆగిపోదే నువ్వొచ్చేదాకా
||చ|| |అతడు|
అలలుండని కడలేదని అడిగేందుకె తెలివుందా
కలలుండని కనులేవని నిత్యం నిదరోమందా
గతముందని గమనించని నడిరేయికి రేపుందా
గతి తోచని గమనానికి గమ్యం అంటూ ఉందా
వలపేదో వల వేసింది వయసేమో అటు తోస్తుంది
గెలుపంటే ఏదో ఇంత వరకు వివరించే ఋజువేముంది
సుడిలో పడు ప్రతి నావ చెబుతున్నది వినలేదా
.
||చ|| |అతడు|
పొరబాటున చేజారిన తరుణం తిరిగొస్తుందా
ప్రతి పూటొక పుటగా తన పాఠం వివరిస్తుందా
మన కోసమే తనలో తను రగిలే రవి తపనంతా
కనుమూసిన తరువాతనే పెను చీకటి చెబుతుందా
కడ తేరని పయనాలెన్ని పడదోసిన ప్రణయాలెన్ని
అని తిరగేశాయా చరిత పుటలు వెనుజూడక ఉరికే వెతలు
తమ ముందు తరాలకు స్మృతుల చితులు అందించాలా ప్రేమికులు
ఇది కాదే విధి రాత అనుకోదేం ఎదురీత || పది నెలలు ||
సాధారణం గా ప్రేమికులకి జీవితం లో చాల విషయాలు ఎలా చెయ్యాలో కూడా తెలియదు కాని, ఒకరి కోసం ఒకరు ఏది చేసుకొవటానికైన సిద్ధపడతారు. ప్రేమ కోసం, లేదా ప్రేమించివాళ్ళు కోల్పోతారు ఏమో అన్న భయమో ఏదో తెలియదు కాని, అందరిని మోసగించి, ఒకరిని ఒకరు పొందేవరకు, తమల్ని తాము మోసగించుకుంటూ బ్రతుకుతారు. ఆ సమయం లో చాల మందికి విజ్ఞత ఉండదు, సరి ఐన ఆలోచన ఉండదు, ఎంత సేపు తమ జీవితం ముఖ్యం, ఇంకేమి అక్కర్లేదు అన్నట్టు ఉంటారు. ఆ ప్రేమకి అడ్డు వచ్చిన వాళ్ళని శత్రువులు గా చూస్తారు.
చాల మందికి బ్రతకటం కూడా రాదు కానీ ఒకరికోసం చావటానికి సిద్దపడతారు, ప్రేమించిన వారి కోసం తమల్ని ప్రేమించిన తల్లి తండ్రులను, స్నేహితులను వాళ్ళని కోల్పోవటానికి కూడా సిధపడతారు. కొంతమంది అడుగడున వాళ్ళు చేసేది తప్పో ఒప్పో అన్న సందేహాలతో సతమతమవుతుంటారు, వాళ్ళు తమముందు ఉన్న ప్రేమకోసం ఆలోచిస్తారు కాని దానికంటే పెద్దదైన జీవితం గురించి ఆలోచించరు. అటువంటి వాళ్ళకి ఒక హెచ్చరిక లాగ ఉంటుంది ఈ పాట. వాళ్ళని ప్రశ్నిస్తున్నట్టు కూడా ఉంటుంది.
అంతే కాకుండా, ప్రేమించే తల్లి తండ్రులని వదిలేసి తమ గమ్యం నిర్దేసిన్చుకున్న వాళ్ళకి జీవితం గురించి అర్థం
అయ్యే లాగ చెప్తూ, మీరు వేసే ప్రతి అడుగు మీదే, దాని ఫలితం కూడా మీదే అనే మరో హెచ్చరిక కూడా ఉంటుంది ఈ పాటలో.
అలాగే కాలం యొక్క మహిమ కూడా చెప్తారు, కాలం ఎవ్వరికోసం ఆగదు, ఒకరు గెల్చిన ఓడిన, కాలం పరిగెడుతూనే ఉంటుంది, మన వేసే తప్పటడుగులు సరిదిద్దుకోవటం కోసం మనకి కాలం సమయం ఇవ్వదు అందుకని మన జాగ్రత్త లో మనం ఉండాలి అనే మరో హెచ్చరిక కూడా ఇస్తారు సిరివెన్నెల,.
అలాగే, మీ ప్రేమ సఫలం కావొచ్చు లేక విఫలం కావొచ్చు, మీరు వేసే ప్రతి అడుగు, మీ జీవితం ముందు తరాలకి ఒక ఉదాహరణ కావొచ్చు కాక పోవొచ్చు, దానికి మీరే భాద్యులు అన్న మరో హెచ్చరిక.
ఇక్కడ సిరివెన్నెల గారు ప్రేమ గురించి విశ్లేషణ చెయ్యలేదు, అది మంచిదో చెడ్డదో అన్న వివరణ కూడా ఇవ్వలేదు, కాని ఆ ప్రయాణం చేస్తున్న వాళ్ళకి అడుగడుగునా వివరిస్తారు, ఆ దరి ఎలా ఉంటుందో అని.
అందుకనేనేమో సినిమా లో హీరో తన తండ్రిని అడ్డ దారిలో రైల్వే స్టేషన్ కి తీసుకెళ్తుంటే జాగ్రత్త రా చూసుకొని వెళ్ళు అనటం చూపిస్తారు తండ్రి ఆ దారిలో ఆటంకాలు సరియిన దారి కాదు అనే హెచ్చరిక లో వివరిస్తారు.
ఇంక పాట లోకి వస్తే
నీ ప్రశ్నలు నీవే ఎవ్వరో బదులివ్వరుగా, నీ చిక్కులు నీవే ఎవ్వరూ విడిపించరుగా
ఈ పాటకి ముందు జరుగుతున్న సందర్భాల్ని చూస్తే, హీరో మానసిక సంఘర్షణ తెలుస్తుంది. తను చేస్తున్నది తప్పా లేక ఒప్పా అనే సమస్య తో కొట్టు మిట్టాడుతూ ఉంటాడు, సాధారణం గా చూసిన కూడా ఈ వాఖ్యం అంతులేని అర్థం కలది. మనం ఈ జీవితం లో ఒంటరిగా వస్తాం, ఒంటరి గా వెళ్ళిపోతాం. అడుగడుగునా మనకి ప్రతి సారి అనేక ధర్మ సంకటాలు కల్గుతాయి, అనేక సార్లు మనం ఒక నిర్ణయం తీసుకొని వెళ్తూ ఉండాలి ఈ జీవిత గమ్యం లో, మన కష్టాలు వేరే వాళ్ళు తీసుకోరు, మన చిక్కులు వేరే వాళ్ళు విడతీయారు. ఇది మనం మన కాళ్ళ మీద నిలబడ్డ తరువాత, తల్లి తండ్రులు మనల్ని రక్షిస్తున్నంత కాలం మనకి అన్ని వల్లే చేస్తారు, కానీ వాళ్ళని కాదనుకున్నాక కాని మనం రెక్కలోచి ఎగిరిపోయిన కాని మన జీవితం మనదే. ఇంత పెద్ద వేదాంతం, ఒక చిన్న వాఖ్యం తో మొదలు పెడతారు సిరివెన్నెల,. అలాగే సినిమాలో హీరో, హీరోయిన్ డిసైడ్ చేసుకుంటారు ఇల్లు విడిచి వెళ్లి పోవాలి అని, వాళ్ళకి ముందు గా ఒక హెచ్చరిక చూసారా ఇంకా మీ ప్రశ్నలు, మీ చిక్కు ముడులు మీవే, మీరు మీరు సృష్టించుకున్న వన్ని మీవే. ఇన్నాళ్ళు మిమ్మల్ని ప్రేమించి కాపాడిన తల్లి తండ్రులు మీకు ఉండరు అన్న సందేశం కూడా ఉందేమో,,
ఏ గాలో నిన్ను తరుముతుంటే అల్లరిగా, ఆగాలో లేదో తెలియదంటే చెల్లదుగా
గాలి తరమటం అంటే వయసు తరమటమే, అల్లరి వయస్సు తొందరపడి తరుముతుంది, ఏదో చేసెయ్యమని ఒకరిని ఒకరు కలసుకోమని, ఇప్పుడు ఏమి చెయ్యాలో తెలియదు అంటే కుదరదు గా, అంటే కలిసి పారిపోడం అని డిసైడ్ చేసిన తరువాత మళ్ళ దాని గురించి అలోచించి ఏమి చెయ్యాలో తెలియదంటే చెల్లదుగా అని భావం
పది నెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా, అపుడో ఇపుడో కననే కనను అంటుందా
ప్రతి కుసుమం తనదే అనదే విరిసే కొమ్మైనా, గుడికో జడకో సాగనంపక ఉంటుందా
ఇక్కడ సిరివెన్నెల గారి పదజాలం సమ్మోహనం. ప్రకృతిని వాటి ధర్మాన్ని అత్యాద్బుతం గా వివరిస్తారు, అల వివరిస్తూనే గొప్ప సందేశం ఇస్తారు, ఈ ప్రేమికులు పారిపోవటానికి సిద్దపడితే అది ఎందుకు తొందరపడతారు, మీ వయసు ఎంత? అని ప్రశ్నిస్తున్నట్టు ఉంటుంది. ( సినిమా లో హీరో హీరోయిన్, under graduates కూడా కాదు , మైనారిటీ కూడా తీరదు ). అమ్మ పది నెలలు మోస్తుంది బిడ్డని ఒక్కోసారి. అంటే పూర్ణ గర్భిని బిడ్డని మోసే సమయాన్ని తొమ్మిది అనకుండా పది అంటారు సిరివెన్నెల. ఇక్కడే అయన ఆలోచన శక్తి మనకు తెలుస్తుంది. అన్ని నెలలు మోస్తున్న కదా నేను బిడ్డను కనను దాచేసుకుంటాను అని అనదు కదా, బిడ్డని కనే తీరుతుంది, అది ప్రక్రుతి ధర్మం. అలాగే, కొమ్మకి పూలు పూస్తాయి, వాటిని కూడా కొమ్మదాచేసుకుంటాను అని అనదు కదా. పూలు మనకి సాధారణం గా గుడి కో, ఎవరి జడలోకో వెళ్తాయి, అంటే అమ్మాయిని కూడా అలాగే అత్తవారింటికి పంపకుండా తల్లి తండ్రులు ఆగిపోరు కదా, మీకు ఎందుకు తొందర అనే ప్రశ్న ఉంటుంది. మీరు నిర్ణయం తీసుకునేంత తొందర ఎందుకు వచ్చింది?
బతుకుంటే బడి చదువా అనుకుంటే అతి సులువా
పొరబడినా పడినా జాలిపడదే కాలం మనలాగా
ఒక నిమిషం కూడా ఆగిపోదే నువ్వొచ్చేదాకా
ఇక్కడ కొంచెం బోధిస్తున్నట్టు ఉంటుంది పాటలో. బడి చదువంటే, ఎంతో కొంత చదవటం, చదివింది పరీక్షలాగ రాయటం పాస్ అవ్వటం. సాదారణం గా కొంచెం ప్రయత్నం చేస్తే అందరు పాస్ అవుతారు. ప్రతి సంవత్సరం పాట్య అంశాలు ఉంటాయి, అది చదివి పాస్ అవ్వటమే బడి చదువు. ఇక్కడ నాయిక నాయికలు ఇంకా బడి చదువే కాబట్టి దానితో పోల్చారేమో. కానీ జీవితం ఎప్పుడు ఏ పరీక్షా పెడ్తుందో తెలియదు, జీవితం బడి చదువంటే తేలిక కాదు, అలాగా అనుకొంటే పొరపడినట్టే అని హెచ్చరించినట్టు. అసలు జీవితం అంటే ఏంటి అనుకోని మీరు ఈ నిర్ణయం తీసుకున్నారు అని అడుగుతున్నట్టు కూడా అనుకోవచ్చు. ఇంక కొంచెం ముందుకి వెళ్లి కాలం యొక్క విలువని , జీవితం యొక్క విలువని చెప్పటం జరుగుతుంది. ఒక తప్పటడుగు చాలు జీవితం లో చాల కోల్పోవటానికి, మనం ఏమి చేసిన కాలం ఆగదు, చేసే పొరపాట్లని దిద్దుకోవటానికి అవకాశం ఇవ్వదు, ఎందుకంటే మనం చేసిన తప్పులు మనం వేసే తప్పటడుగులు దిద్దుకొని మళ్ళ జీవితం మొదలు పెట్టేదాకా ఒక్క నిమిషం కూడా ఆగదు. అంటే ఆలోచనలేని ఒక్క అడుగు వేసిన జీవితాంతం అనుభవించాల్సిందే, ఎందుకంటే కాలానికి జాలి ఉండదు. అంత పెద్ద నిర్ణయం అంత సులువుగా తీసేసుకున్నారు, జాగ్రత్త అనే హెచ్చరిక కనిపిస్తుంది. సినిమాలో అందుకనే వాచ్ హీరో కి ఇవ్వటం, దాని విలువ తెల్సుకోలేకపోయాను అని తిరిగి ఇచ్చెయ్యటం తరువాత అది హీరో పెట్టుకొని ప్రయాణం గమ్యం మార్చుకోవటం ఇవ్వన్ని తెల్సుకున్నతరువతనేమో.
అలలుండని కడలేదని అడిగేందుకె తెలివుందా
కలలుండని కనులేవని నిత్యం నిదరోమందా
గతముందని గమనించని నడిరేయికి రేపుందా
గతి తోచని గమనానికి గమ్యం అంటూ ఉందా
ఇంక మరల ప్రశ్నలకి వచ్చేస్తారు సిరివెన్నెల, సముద్రం అలలకి ఉన్న సంబంధం అందరికి తెల్సిందే, సముద్రానికి అలలు ఉండవు అనుకోవటం ఎంత మూర్ఖత్వమో, అలంటి ప్రశ్న కలగటం కూడా అంటే మూర్ఖత్వం. మానవునికి తెలివి ఉన్నది అర్థం లేని ప్రశ్నలు వెయ్యటానికి కాదు, మనకి తెలివి ఇచింది, మన జీవితం సుకృతం అయ్యే ప్రశ్నలు వేసుకోవటానికో లేక జీవన గమ్యానికి ఉపయోగ పడే ప్రశ్నలు వేసుకోవటానికే కాని ఇలా పనికి మాలిన ప్రశ్నలు అడగటానికి కాదు. హీరోయిన్ బెదురు చూపులు, హీరో గుడి ముందు బిత్తర చూపులతో దండం పెట్టుకోవటం గతి తోచని గమ్యానికి సూచనలు గా చూపిస్తారు సినిమాలో. అలాగే సముద్రం లోంచి అలలు ఎలా వస్తాయో అలాగే మనిషి ఆలోచనలు కూడా వస్తాయి ఆ ఆలోచనల లోంచే ప్రశ్నలు వస్తాయి., అంతే కాని అలలు లేని సముద్రం, ఆలోచనలు లేని మనిషి ఉండడు. మరల కన్నులు , కలలు , నిద్ర వీటికి కూడా ఇదే logic apply అవుతుంది.
వలపేదో వల వేసింది వయసేమో అటు తోస్తుంది
గెలుపంటే ఏదో ఇంత వరకు వివరించే ఋజువేముంది
సుడిలో పడు ప్రతి నావ చెబుతున్నది వినలేదా
హీరో హీరోయిన్కి నిజం గానే ప్రేమ వల వేస్తుంది, ఇంకానేమో దానికి వయసు తోడయ్యి వాళ్ళు ఆ నిర్ణయం తీసుకునేటట్టు చేస్తుంది, ఇక్కడ నిక్కచ్చి గా అడుగుతున్నట్టు ఉంటుంది, ఏమి సాధిద్దామని మీరు ఈ నిర్ణయం తీసుకున్నారు, ఎవరి మీద గెలుపు పొందుదామని మీరు ఇది చేస్తున్నారు, అసలు మీ గెలుపుకి ఒక అర్థం అంటూ ఉందా?? ఇప్పుడు వెళ్ళిపోయి గెలిచాం అనేదాన్ని వివరించే రుజువేమి లేదు కదా, మీ ప్రియునితో, (ప్రియురాలితో) శాస్వతమైన సుఖం కోల్పోతున్నాం అన్న ఆలోచనలో అందరిని వదిలేసి ఏమి గెలుద్దామని మీరు మీ ప్రయాణం మొదలు పెట్టారు? దశ, దిశ లేని ప్రయాణం సుడి లో కొట్టుకొని పోయే నావ మనకు రుజువు చేస్తోంది కదా అది మీరు వినలేదా అన్న ప్రశ్న కనపడుతుంది. అది తెల్సి కూడా ఏమి గెలుద్దామని ప్రయత్నిస్తున్నారు అన్న ప్రశ్న కలుగుతుంది. సినిమాలో ఇద్దరు పిల్లలు హోలీ ఆడుకుంటే షర్టు గుర్తుకువచ్చి అది తేలేదని మర్చిపోయానని తనని నిందించుకుంటూ తిరిగి ఇంటికి వెళ్తాడు, అప్పుడు తన ఒక ఊహించని సంఘటన జరుగుతుంది.
పొరబాటున చేజారిన తరుణం తిరిగొస్తుందా
ప్రతి పూటొక పుటగా తన పాఠం వివరిస్తుందా
ఒక చిన్న తప్పటడుగు వాళ్ళ కోల్పోయిన అవకాశాలు తిరిగి రావు అలాగే మనం కోల్పోయిన అవకాశాలు మల్ల మనకి అడుగడుగునా గుర్తుకు రావు, కాలం గుర్తు చెయ్యదు, ప్రతి పూట ఒక పేజిలా, పాఠం లాగా వివరించదు అని మరల హెచ్చరిస్తారు.
మన కోసమే తనలో తను రగిలే రవి తపనంతా
కనుమూసిన తరువాతనే పెను చీకటి చెబుతుందా
సూర్యుడు అందరికి వెలుగునివ్వటానికి ఎంత కష్టపడతాడో మనకి చీకటిని చూస్తే కాని అర్థం కాదు. సిరివెన్నెల గారికి సూర్యుడు అంటే అత్యంత ప్రీతి, కవి ని సూర్యుడిని పోలుస్తూ "జగమంత కుటుంబం" పాట రాసారు, అలాగే చాల పాటల్లో సూర్యుడి గురించి వింటాం. ఇక్కడ సినిమాలో హీరో తండ్రి చనిపోవటం, తండ్రిని సూర్యునితో పోలుస్తున్నరేమో ఇక్కడ. కొడుకు కోసం తండ్రి పడే తపన, అతని కోసం అహర్నిశలు పనిచేసి చివరకు కన్ను మూస్తే, కొడుకు బ్రతుకు చీకటి మయం అయ్యి కొడుకుకు తండ్రి విలువేంటో, ఇంక తను చెయ్యవలసిన పనులేంటో హీరో కి తెలుస్తుంది అని ఈ వాఖ్యలకి వివరణ గా చూసుకోవచ్చు. అందుకనే తల్లి ఆ మాటలు అంటుంది " దేవుడు చాల గోప్పవాడనుకుంటున్నాడు, మీ నాన్నని తీసుకు వెళ్లి పోయాను అని సంబర పడిపోతున్నాడు, నువ్వు లేవ నాకు?"
కడ తేరని పయనాలెన్ని పడదోసిన ప్రణయాలెన్ని
అని తిరగేశాయా చరిత పుటలు వెనుజూడక ఉరికే వెతలు
తమ ముందు తరాలకు స్మృతుల చితులు అందించాలా ప్రేమికులు
ఇది కాదే విధి రాత అనుకోదేం ఎదురీత || పది నెలలు ||
ఇంక చివరిగా ప్రేమ చరిత్ర గురించి విశ్లేషణ లో గమ్యం చేరని ప్రేమ వ్యవహారాలు ఎన్ని ఉన్నాయో, అలాగే పడదోసిన ప్రేమలు ఇవ్వన్ని లెక్కలు చూసి చరిత్రని చూసి ప్రేమించారు, అలాగే ముందడుగు వెయ్యరు కదా ప్రేమికులు, తమ ప్రేమ వ్యవహారం ఎవ్వరికి ఉదాహరణ కానక్కర్లేదు, తమ జీవితం తమదే కదా, ఇప్పుడు ఏమి చెయ్యాలి అని అనుకోవటం అర్థం లేదు ఎందుకంటే, ఒక అడుగు వేసి జరగబోయేదంత మన తలరాత అనుకోవటం కుదరదు అని నిక్కచ్చి గా చెప్తారు సిరివెన్నెల గారు. ఎదురీత అంటేనే ప్రవాహానికి ఎదురుగా వెళ్ళేది, అల వెళ్తూ ఇదంతా తన తలరాత అనుకోవటం కుదరదు కదా, అలాగే ప్రేమ జంటలు కాలానికి, ప్రకృతికి విరుద్దం గా తమకు తామే తమ గమనాన్ని నిర్దేసించుకొని ఇంక జరగబోయేది అంత తలరాత అనుకోవటం, ఏది జరిగితే అదే చేద్దాం అనే ఆలోచనని ఖండిస్తున్నట్టు ఉంటుంది.
ఒకటి పొందలనుకుంటే ఇంకోటి కోల్పోవాలి అనే రీతిలో ఉంటారు ప్రేమికులు. తల్లి తండ్రులని కోల్పోతే కాని ప్రేమ దక్కదు, వాళ్ళే మొదటి అడ్డంకులు, మొదటి విలన్లు అనుకోవటమే ప్రేమ లో జరిగే చాల అనర్థాలకు కారణం. అది తప్పు అని వాళ్ళకి చాల కోల్పోయిన తరువాత అర్థం అవుతుంది. అది కాక పిల్లల ప్రేమ గురించి పెద్దలు మొదటి సారి ఎవ్వరి దగ్గరనుంచో వింటారు. అది కూడా పెద్దవాళ్ళకి నచ్చని పని. ప్రేమికులు చేసే దొంగ చాటు గా కలయికలు, వాటి గురించి అందరితో ఆడే అబద్దాలు, వాళ్ళు చేసే ప్రతి పని ఎవరైనా చూస్తారో, చూసి ఇంట్లో చెప్తే ఏమవుతుంది అని భయపడుతూ, అన్ని విషయాలు దాస్తూ చేసే పనులలో వాళ్లకి ఎంత ఆనందం ఉంటుందో తెలియదు కాని వాళ్ళు ఒకవేళ ప్రేమని పొంది జీవిత చక్రం లో పడితే ఆ ప్రేమ ఉంటుందా లేదా అన్నది వేరే విషయం. లేదంటే ఇన్ని ప్రేమ వివాహాలు బద్దలు కావు. ఆకర్షణ తో చేసే పని ఎలా ఉంటుందో చెప్పటానికి ఈ పాట అడుగడుగునా ఉపయోగపడుతుంది. అందుకనే సినిమా లో చివరిగా " వేసే ప్రతి అడుగు ఒకటికి పది సార్లు అలోచించి వెయ్యండి అనే సందేశం ఇస్తారు, అంటే కాక పిల్లలు పెద్దలు చివరకి కోరుకునేది ఆనందమే, అది మేము ఇవ్వగలం అని తల్లి తండ్రులు అనుకుంటే, వాళ్ళ ప్రేమలో నిజాయితీని పెద్దలు అర్థం చేసుకుంటే ప్రతి ఇల్లు ఒక కొత్త బంగారు లోకమే" అనే చక్కటి సందేశం తో సినిమా ముగుస్తుంది..
కొసమెరుపు: ఈ పాట రాసినందుకు సిరివెన్నెల గారికి కాని పాడినందుకు బాలు గారికి కాని నంది అవార్డు కూడా రాకపోవటం.
rao garu, chala baga rasarruu ee song gurinchiii. nenu inni rojulluu lite thesukunna ee pata ni. mee review taruvatha vintaunthey, it just happeing infront of my eyes.
ReplyDeleteOne more nice review...
Your articles and reviews are so nicely written. Good effort. Reminding some good memories. There are some typing errors please take care of them hoping more from you.
ReplyDeleteHi! Music Fan garu, chala entertaining blog idhi. Nijanga satisfying.
ReplyDeleteEntho viluvaina song idhi. Daanni vivarinchalanna mee uddesam nachindi. Nenuu meela prathee padam lo artham vethukkune rakam. Ee pata lo meeru cheppina bhavala tho patu nenu vinneppudu naku inkonni ardhalu sphurinchayi.
Udaharanaku,
పది నెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా, అపుడో ఇపుడో కననే కనను అంటుందా
ప్రతి కుసుమం తనదే అనదే విరిసే కొమ్మైనా, గుడికో జడకో సాగనంపక ఉంటుందా
Ikkada nenu artham chesukunna bhavam, Manalni kanna talli, inka aa adivi talli ela tamaki puttinavi, thamaku hakku unnavi thama nunchi veravvadanni oppukuntunnaro kada. Manam matram ninnaa monna kalisina ammayi ni veedanantu denikaina tegisthunnam, endaikaina veluthunnam. Pattu-vidupu aavasakyam teliyakapothe adhe moorkhatvam kada.
అలలుండని కడలేదని అడిగేందుకె తెలివుందా
Ee vaakyam lo naku thochina bhavam nannentho alochimpaesindhi. Ikkada Alalu undani kadali ante kashtalu, badhyathalu, nirutshahalu leni jeevitham. Manaki devudu ichina telivi jeevitham tho pordadaaniki, gelavadaniki. Anthey kani aa sukhamaina jeevitham kosam adagamani kadu.
Sirivennela garu rasina chaala patallo, ila okko vakyam lo, oka neethi padyam daagi vuntundhi. Ee paata matram nijamga mana rojuu jevvitha neethi kavyam.