Sunday, December 11, 2011

Song of the week - Repalliya yada jhalluna - Saptapadi

నా సంగీత ప్రపంచం లో కొన్ని వేల పాటలు విని ఉంటాను, అందులో చాల అలలు తాకినట్లు వెళ్ళిపోగా, మరి కొన్ని గాలి లాగ స్పృశించి వెళ్ళిపోయాయి.  కొన్ని హృదయానికి హత్తుకోగా కొన్ని మదిలో అలా నిలచిపోయాయి. వాటిలో కొన్ని పాటలు ఎన్ని సార్లు విన్నాఏదో కొత్తదనం వాటిల్లో కనిపిస్తుంది. అలాంటి పాటలు వారానికి ఒకటి కాలం అనుమతి ఇస్తే నిక్షిప్త పరచుకోవాలనే చిన్న ఆశ ఎప్పటినుంచో ఉంది కాని బ్లాగ్ రూపం దాల్చటానికి కుదురుతుంది అని ఎప్పుడు ఊహించలేదు. ఈ పాటల యొక్క వివరణ, విశ్లేషణ అంతా నా పరిమిత జ్ఞానం మాత్రమే. ఇది ఎటువంటి విమర్శా కాదు ఇటువంటి  ఆణిముత్యాలని ఇచ్చిన  పెద్దలని కించపరచాలని కాదు. ఏమైనా తప్పులుంటే పెద్ద మనస్సు తో మన్నించండి. ఇందులో వచ్చే పాటలు వరుస గొప్పతనానికి సూచన కాదు, ఇది నాకు వచ్చిన జ్ఞాపకం, ఈ టైం కి కుదిరిన వీలు మాత్రమే.

ఇక ఈ వారం పాట
రేపల్లియ  యద ఝల్లున  పొంగిన  రవళి -  song from the Telugu movie "సప్తపది".

You tube link

Movie: Saptapadi
Director: K.Viswanath
Music: K.V.Mahadevan
Lyrics: Veturi
Singers: S.P Balasubramanyam, P.Susheela
Flute: Nanjappa
Dance Master: Seshu
Asst. Dance Master: Kumari
Year of Release: 1981



ఒక పాట చిరకాలం నిల్చి పోవాలంటే చక్కటి సాహిత్యం ఆ సాహిత్యాన్ని పరిమలిమ్పచేసే సంగీతం మొదట తోడవ్వాలి, ఆ తరువాత అది ప్రేక్షకునికి చేర్చే అత్యంత ఆహ్లాదకరమైన, శ్రావ్యమైన కంఠం ఉండాలి, ఆ సంగీత ఝరిని చిత్రీకరించే ప్రదేశం , నిర్దేశించే దర్శకుడు ఆ మాటల్ని ఆ అందాన్ని దృశ్య కావ్యంగా మలచటానికి నటీ నటులు తోడయ్యి, వాళ్ళని నర్తిన్పచేసే నృత్యకారుడు మాల గా చుట్టి మెడలో వేస్తే అది ప్రేక్షకుడికి వీనుల విందు అవుతుంది. ఈ పాటకి అన్ని అలా సమకూరాయి కాబట్టే ఇది అజరామరం అయ్యింది. ఒక శృంగార కావ్యం గా నిల్చిపోయింది,

ఈ సినిమా మొత్తం మీద కథానాయకుడు, నాయిక కి మధ్యలో 4-5 dialogs మాత్రమే ఉంటాయి. వాళ్ళ మధ్య స్పర్స కూడా 1-2 సార్లు కూడా ఉండదేమో. కాని వాళ్ళ మధ్య అనిర్వచనీయమైన, అతీతమైన ప్రేమని చూపించటం లో దర్శకుడు సఫలీకృతం అయ్యాడు. అతీతం ఎందుకంటే ఇది  రెండు  శరీరాల కంటే రెండు కళల పట్ల ఏర్పడ్డ బంధం, రెండు ఆత్మల మధ్య ఏర్పడ్డ బంధం. నాయిక నర్తకి అయితే నాయకుడు మురళికారుడు. అందుకనేనేమో వేటూరి గారు వారిని ఇంత హృద్యంగా రాధ మాధవులని పోలుస్తూ రాయగలిగారు, ఆయనకి ఉన్న కల్పనా శక్తి అమోఘం. ఈ పాటలో ఆయన చేసిన పద ప్రయోగం ఒక ఇంద్రజాలం. బాలు సుశీల గార్ల గొంతు అమృతం. "Thats why it remains as one of the beautiful romantic song ever picturized in Telugu Film history."

ఈ పాట సందర్భం గూడ ఒక రాయబారం , ఉత్తర ప్రత్యుత్తరాల తరువాత మొదలు అవుతుంది, కృష్ణ నది కొండ ఎత్తునుంచి చూస్తూ camera నావ మీద నుంచి అలా వేణువు మీదకి ఫోకస్ అవుతుంది, అప్పుడు వేణువు లోంచి ఒక శ్రావ్యమైన ఆలాపన మొదలుఅవుతుంది, అత్యంత శ్రద్ధగా వింటూ నాయికా పాట పాడుతుంది ( ఒక పాట ఇంత అద్భుతం గా మొదలవ్వటం చాల తక్కువసార్లు చూస్తాం రేపల్లె కాదు మన గుండె కూడా ఝల్లుమంటుంది )
వ్రేపల్లియ ( రేపల్లియ) ఎద  ఝల్లున  పొంగిన  రవళి 
నవరస మురళి  ఆ నందన  మురళి ఇదేనా  ఆ  మురళి  మోహన  మురళి  ఇదేనా  ఆ  మురళి

ఇక్కడ వేటూరి గారి చమత్కారం మొదలు అవుతుంది, మురళిని అన్ని విధాలుగా వివరిస్తూనే, కథానాయిక కథానాయకుడిని పరిచయం చేసుకుంటున్నట్టు ఉంటుంది. రేపల్లె మొత్తం కృష్ణుని పిల్లనగ్రోవికి పాద దాసులయ్యారు అలాంటి మురళి ఇదేనా అంటూనే , కృష్ణుడితో పోల్చుకోవటం అనేది చాల సముచితం, సినిమాలో మహదేవన్ గారు మురళి ని అట్లాగే పలికిస్తారు కూడా.

మధ్యలో వచ్చే interlude లో నాయకుడు నాయికా వాళ్ళ నాన్నగారి దగ్గరకి శిష్యరికం కోసం ( ఉద్యోగం ) రావటం, నాయిక గుమ్మం వరకు వచ్చి తనని చూసి బిడియం తో వెనక్కి వెళ్లి మైమరచి పోతుండగా చరణం మొదలవుతుంది,  ఇది విశ్వనాధ్ గారి ఉదాత్తతకు నిదర్శనం. చిన్న విషయాలు కూడా శ్రద్ధతో తీసే ఆయన ఆలోచన శక్తి అమోఘం.

చరణం 1
కాళింది మడుగున  కాళీయుని  పడగల 
ఆ  బాల  గోపాల మా  బాల  గోపాలుని 
అచ్చెరువున  అచ్చెరువున  విచ్చిన  కన్నుల   జూడ 
తాండవమాడిన  సరళి  గుండెలనూదిన  మురళి ఇదేనా  ఇదేనా  ఆ  మురళి 

వేటూరి గారిలాంటి మహానుభావుల కవిత్వం వినే అదృష్టం కలగటం మన అదృష్టం, సరళమైన పదాలతో ఏంటో అత్యున్నతమైన భావాన్ని అందచేసిన ఆయన జన్మ ధన్యం.  కాళీయుని  వృత్తాంతం ఎంత చక్కగా వివరించారో, ఆ రేపల్లి లో జనులందరు వయస్సు తో నిమిత్తం లేకుండా  ( ఆ బాల గోపాలులు ) ఆ చిన్ని కృష్ణుడు  ( బాల గోపలుడిని ) పాడగా మీద తాండవ నృత్యం చేస్తుంటే, ఆ చెరువున ( కాళింది నది ఒడ్డున ) ఆశ్చర్యం తో చూస్తుంటే వాయించిన మురళి ఇదేనా,,??? 

ఇక్కడ సబిత నృత్యం కూడా ఈ వివరణ ఇచ్చేలాగా ఉంటుంది, అచ్చెరువున అన్నప్పుడు కళ్ళు పెద్దవి చెయ్యటం,  ఆ బాల గోపాలులని చూపటం, తాండవ ముద్ర, విశ్వనాథ్ గారి కళా విజ్ఞతకు నిదర్శనం. 

 చరణం 2
అనగల   రాగమై  తొలుత  వీనుల  అలరించి 
అనలేని  రాగమై  మరల  వినిపించి  మరులే  కురిపించి 
జీవన రాగమై  బృందావన  గీతమై 
కన్నెల  కన్నుల  కలువల వెన్నెల దోచిన మురళి ఇదేనా ఇదేనా ఆ మురళి

ఇక్కడ మరొక్క చమత్కారం వేటూరి గారి పదంలో, అనగల రాగం, అనలేని రాగం  - ఒకటి, వీనులని అలరిస్తే, ఇంకోటి మరులు కురిపిస్తుంది అని చెప్పి కృష్ణుని లోని చిలిపితనం, కొంటెతనం చూపించారు, ఇంకా నాయికా పాటకి చివరగా, కన్నెల కన్నులని కాలువలు గా పోలుస్తూ కృష్ణుడు కన్నెల వలువలు దోచేస్తే, ఇక్కడ వెన్నెల దోచటం అనేది మనం మరలా వినటం సాధ్యం కాని వర్ణన,,  అటువంటి కృష్ణుడికి శక్తిని ఇచ్చిన మురళి ఇదేనా అని నాయిక పాడుకోవటం ఎంతో మధురాతి మధురం.

చరణం 3
వేణుగాన  లోలుని  మురిపించిన   రవళి నటనల  సరళి  ఆ  నందన  మురళి  ఇదేనా  ఇదేనా  ఆ  మురళి

ఇప్పుడు ఇంకా నాయకుని వంతు, నేనేమి తక్కువా అన్నట్టు నన్నునాట్యంతో మెప్పించిన రాధవి నువ్వేనా ఆంటాడు. ఈ సినిమాలో నాయికా నాట్యం చూసి ఆమె మీద అభిమానం పెంచుకున్న తరువాత అది ఆరాధనా గా మారుతుంది. అట్లాగే అతని వేణువుని ఆమె ఆరాధిస్తుంది. ఇట్లా ఇద్దరి సంగమం ఎట్లా ఉంటుంది అనేది వేటూరి గారి పాటలోని చివరి చరణం.

మధుర  నగరిలో  యమునా  లహరిలో 
ఆ  రాధా  ఆరాధనా  గీతి  పలికించి  (2)
సంగీత  నాట్యాల  సంగమ  సుఖ  వేణువై (2 )
రాసలీలకే  ఊపిరి  పోసిన  అందెల రవళి ఇదేనా  ఇదేనా  ఆ  మురళి 
ఈ సినిమా లో వేటూరి గారు రాసిన పాటలన్నీ అమోఘం, అత్యద్భుతం, ఆ రాధ ఆరాధన ని  పలికించిన ఆ వేణువు, సంగీత నాట్యాల సంగమం కాక ఏమవుతుంది? ఆ కలయిక రాసలీల కి ఊపిరి పోస్తే కృష్ణుడు ఆ గజ్జెలని పూజించకుండా ఉంటాడ?? ఇక్కడ విశ్వనాధ్ గారు హీరో తో హీరోయిన్ కట్టుకున్న కాలిని చేతి మీద తీసుకొని కడిగిస్తారు. ఆ అరధానని చూపిస్తారు. రచయిత, దర్శకుడు యొక్క భావాలు కలిస్తే ఇటువంటి ఆణి ముత్యాలు లభిస్తాయి అనటం లో సందేహం లేదు.

నాకు SPB పాటలో  రెండవ భాగం వరకు పాడకుండా ఉంది, సగం లో పాట మొదలు పెట్టిన పాటలంటే చాల ఇష్టం, ఎందుకంటే బాలు గొంతు female voice తరువాత  వచినప్పుడు ఎంత మాధుర్యం గా ఉంటుందో చెప్పలేం. ఆ గొంతులో ఏదో దివ్యత్వం విన్పిస్తుంది.
ఉదాహరణలు "శ్రీరంగ రంగనాథుని - మహానది " సిరులోలికించే చిన్ని- యమలీల లాంటివెన్నో.













1 comment:

  1. Hi music fan, really very good music reviews, especially song of the week article...ekkadikoo tesukuveltunnaru...baga nachinde...velite okasari mail cheyyagalaru..mee details

    kp007in@gmail.com

    ReplyDelete